iDreamPost
android-app
ios-app

రూ.1000 కోట్ల టార్గెట్ కోసం ముగ్గురు పోటీ! మొనగాడు ఎవరు?

టాలీవుడ్ లో గతం ఓ లెక్క. ఇప్పుడో లెక్క. 200 కోట్ల కలెక్షన్లను కొడితేనే వారెవ్వా అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు టార్గెట్ అంతా వెయ్యి కోట్ల పై మాటే. ఇప్పుడు ఆ మార్కును టచ్ చేసేందుకు సిద్ధమౌతున్నాయి ఆ టాప్ హీరోలు.. వారి సినిమాలు..

టాలీవుడ్ లో గతం ఓ లెక్క. ఇప్పుడో లెక్క. 200 కోట్ల కలెక్షన్లను కొడితేనే వారెవ్వా అనుకునే రోజులు పోయాయి. ఇప్పుడు టార్గెట్ అంతా వెయ్యి కోట్ల పై మాటే. ఇప్పుడు ఆ మార్కును టచ్ చేసేందుకు సిద్ధమౌతున్నాయి ఆ టాప్ హీరోలు.. వారి సినిమాలు..

రూ.1000 కోట్ల టార్గెట్ కోసం ముగ్గురు పోటీ! మొనగాడు ఎవరు?

టాలీవుడ్ అగ్ర హీరోలు పాన్ ఇండియాను దాటి గ్లోబల్ రేంజ్‌కు చేరుకున్నారు. బాహుబలితో దర్శక ధీరుడు రాజమౌళి ఆ మార్క్‌ను క్రియేట్ చేయగా.. మొన్న వచ్చిన ఆర్ఆర్ఆర్ సుస్థిరం చేసింది. బాలీవుడ్ నుండి మాలీవుడ్ వరకు టాలీవుడ్ హీరోల రేంజ్, రెమ్యునరేషన్ అప్ గ్రేడ్ అయ్యింది. వారి క్రేజ్, మార్కెట్ బలం పెరిగింది. కేవలం తెలుగు దర్శకులే కాదూ.. ఇతర పరిశ్రమకు చెందిన డైరెక్టర్లు కూడా తెలుగు స్టార్ హీరోస్‌తో వర్క్ చేసేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. భారీ బడ్జెట్‌తో సినిమాలను తెరకెక్కిస్తున్నారు. బిగ్ టార్గెట్ ఫిక్స్ చేసుకుని, ప్రేక్షకులకు విజువల్ వండర్ ఇచ్చేందుకు ఎక్కడ రాజీ పడకుండా.. సమయం తీసుకుని మూవీస్ చేస్తున్నారు మేకర్స్. అయితే హీరో క్రేజ్, రేంజ్, బడ్జెట్ కు తగ్గట్లు కలెక్షన్స్ ఎక్స్ పెక్టేషన్స్.. మోర్ ఉంటున్నాయి.

ఇప్పుడు మూడు పాన్ ఇండియా మూవీస్ కుంభ స్థలం కొట్టేందుకు సిద్ధమౌతున్నాయి. వెయ్యి కోట్లను దాటి.. బిగ్ టార్గెట్ టచ్ చేసేందుకు పోటీ పడుతున్నాయి ఆ హీరోల పాన్ ఇండియా మూవీస్. అవే పుష్ప 2, గేమ్ చేంజర్, దేవర. పుష్ప 1తో అల్లు అర్జున్ రేంజ్ అమాంతం పెరిగిపోయింది. ఏకంగా ఏ తెలుగు హీరోకు దక్కని తొలి ఉత్తమ నటుడు పురస్కారం అందుకోవడంతో..ఎక్కడా చూసినా మన బన్నీ బాబే వార్తల్లో నిలుస్తున్నారు. పుష్ప2తో ఇక తగ్గేదేలే అని బాక్సాఫీసు మీదకు గురి ఎక్కు పెడుతున్నాడు. లెక్కల మాస్టారు సుకుమార్.. అందుకు తగ్గ ఎక్కాలు, లెక్కలు వేస్తున్నట్లు ఉన్నాడు.  డైలాగులతో, పాటలతో పాన్ ఇండియాను షేక్ చేయించిన సుక్కు.. రూ. 1000 కోట్ల స్కోరుకు పక్కా స్కెచ్ గీశాడనే ఫిల్మ్ నగరాల వినికిడి.

ఇక గేమ్ చేంజర్.. దీని మీదైతే మరిన్ని అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే.. టాలీవుడ్ అగ్ర హీరో రామ్ చరణ్ కోలీవుల్ టాప్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కదా మరీ ఆ మాత్రం ఉండకపోతే ఎలా ఎక్స్ పక్టేషన్స్. ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియానే కాదూ.. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న నటుడు రామ్ చరణ్. శంకర్ అంటే భారీ గ్రాఫిక్సే కాదూ, భారీ నిర్మాణ వ్యయం.. రిచ్ లొకేషన్లు అన్ని భారీగానే ఉంటాయి. అలాగే కలెక్షన్లు కూడా. ఇప్పుడు ఈ కాంబోలో వస్తున్న మూవీ కాబట్టి.. వెయ్యి కోట్ల మార్కెట్ టచ్ చేస్తుందని అంచనా. ఇక దేవర సినిమా విషయానికి వస్తే.. ఆర్ఆర్ఆర్ మూవీతో మనోడు ఇంటర్నేషనల్ ఫిగర్ అయిపోయాడు జూనియర్ ఎన్టీఆర్. ఎన్టీఆర్, దర్శకుడు కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రెండో సినిమా.

ఈ మూవీ ప్రమోషన్లలో భాగంగా టీం ఎక్కడకు వెళితే.. అక్కడ.. ఎన్టీఆర్ ఇచ్చిన స్పీచులకు ఫిదా అయిపోయారు.  మనవాడు అంటే మనోడు అనేలా దగ్గరయ్యాడు. దీంతో వరుస మూవీ ఆఫర్లు వచ్చేశాయి. బాలీవుడ్ లో వార్ 2, ప్రస్తుత సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ వంటి దర్శకులతో పనిచేసే అవకాశాన్ని కొల్గగొట్టేశాడు ఈ అరవింద సమేత వీర రాఘవుడు. అయితే ఇప్పుడు దేవర షూటింగ్ వేగంగా జరుపుకుంటోంది. భయానికి మరో పేరు దేవర అంటూ భయపెడుతున్న ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. పాన్ ఇండియాకు తగ్గట్లు ఈ సినిమాలో భారీ తారాగణాన్ని తీసుకున్నారు. ఇది కూడా వచ్చే ఏడాది సమ్మర్ లో రిలీజ్ కానుంది. భీభత్సమైన కలెక్షన్ల నంబర్ ను లక్ష్యంగా తీసుకున్నట్లు కనిపిస్తుంది. ఈ మూడు సినిమాలు కూడా రాబోయే సంవత్సరంలోనే విడుదల కానున్నాయి. భారీ బడ్జెట్లతో రూపుదిద్దుకుంటున్న అద్భుత సినిమా కళా కృతుల్లో ఎవ్వరూ హయ్యెస్ట్ కలెక్షన్లు కొట్టి.. టాలీవుడ్ కాదూ కాదూ..పాన్ ఇండియా మొనగాడు అవుతాడో వెయిట్ చేయాలి.