iDreamPost
android-app
ios-app

OTTలో హనుమాన్ మూవీ చూస్తూ.. ఏడ్చేసిన చిన్నారి!

  • Published Mar 18, 2024 | 4:59 PM Updated Updated Mar 18, 2024 | 4:59 PM

థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హనుమాన్ మూవీ ఓటీటీకి వచ్చేసింది. జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది. అటు హిందీతో పాటు అన్ని భాషల్లోనూ అందుబాటులోకి వచ్చేసింది. దీంతో చిన్న పెద్ద అంతా సినిమాను వీక్షిస్తున్నారు. చూడటమే కాదూ..

థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన హనుమాన్ మూవీ ఓటీటీకి వచ్చేసింది. జీ 5లో స్ట్రీమింగ్ అవుతుంది. అటు హిందీతో పాటు అన్ని భాషల్లోనూ అందుబాటులోకి వచ్చేసింది. దీంతో చిన్న పెద్ద అంతా సినిమాను వీక్షిస్తున్నారు. చూడటమే కాదూ..

  • Published Mar 18, 2024 | 4:59 PMUpdated Mar 18, 2024 | 4:59 PM
OTTలో హనుమాన్ మూవీ చూస్తూ.. ఏడ్చేసిన చిన్నారి!

టాలెంట్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. యంగ్ హీరో తేజ సజ్జా కాంబోలో వచ్చిన చిత్రం హనుమాన్ బాక్సాఫీసును దున్నేసిన సంగతి విదితమే .జనవరి 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిన్న సినిమా రూ. 330 కోట్లకు పైగా కొల్లగొట్టింది. ఇతిహాస గాధల్లోని ఓ సూపర్ హీరో కథని ఇప్పటి పరిస్థితులకు తగ్గట్లుగా రూపొందించాడు దర్శకుడు. ప్రశాంత్ సినిమాటిక్ యూనివర్స్‌లో భాగంగా వచ్చిన ఈ చిత్రాన్ని ప్రైమ్ షో ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె.నిరంజన్‌ రెడ్డి నిర్మించారు. తేజ సజ్జా, అమృత అయ్యర్, వరలక్ష్మి శరత్ కుమార్, గెటప్ శీను ప్రధాన పాత్రల్లో నటించారు. విజువల్ వండర్స్‌గా తెరకెక్కిన ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేసింది.

చాలా సైలెంట్‌గా హిందీతో పాటు తెలుగులో కూడా రిలీజ్ అయ్యింది. రెండు నెలల నుండి ఫ్యాన్స్ ఎదురు చూస్తున్న చూపులకు నిన్నటితో తెరపడింది. అలా ఓటీటీలో వచ్చేయడం ఆలస్యం.. విపరీతంగా చూస్తున్నారు మూవీ లవర్స్. అయితే పిల్లలు సైతం ఈ సినిమాను ఇష్టంగా చూస్తున్నారు. తేజ సజ్జా పెర్ఫ్మామెన్స్‌కు పిల్లలు కూడా ఫిదా అయిపోతున్నారు. అంతే కాదూ.. సినిమాలో లీనమై పోతున్నారు. తాజాగా హనుమాన్ మూవీని వీక్షించిన ఓ చిన్నారి కన్నీళ్లు పెట్టుకుంది. ఓ హైట్ సీనులో తేజను విలన్ కొడుతుంటే.. అది చూసిన చిన్నారి తట్టుకోలేక ఏడ్చేసింది. ఆమె ఏడుస్తుండగా.. తండ్రి ఆ వీడియోను తీసి.. నెట్టింట్లో పోస్టు చేయడంతో వైరల్ అయ్యింది. ఈ సందర్భంగా సినిమా పట్ల ఆమెకున్న ప్రేమ గురించి చెబుతూ.. తేజకు, ప్రశాంత్ వర్మకు థాంక్స్ చెప్పాడు ఆ పాప ఫాదర్.

కాగా, ఈ వీడియోపై స్పందించాడు దర్శకుడు ప్రశాంత్ వర్మ. ’ఆ‘ అంటూ ఎమోజీలను పోస్టు చేశాడు. కాగా, థియేటర్ల కన్నా ఓటీటీకి వచ్చాక వీక్షిస్తున్న సంఖ్య పెరిగినప్పటికీ.. కాస్త నెగిటివిటీని మూట గట్టుకుంది. ఈ సినిమానే తోపు,తురుము అంటున్నారు అంటూ కొంత మంది వెకిలీ కామెంట్స్ పెడుతున్నారు. అయితే ఇలాంటి విజువల్ వండర్స్ చూడాలంటే.. థియేటర్లే బెస్ట్ జోన్. అవేమీ తెలియకుండా ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇక మూవీ లవర్స్ ఇవేమీ పట్టించుకోకుండా.. సినిమాను ఎంజాయ్ చేసే పనిలో ఉన్నారు. ఇటీవల 50 రోజులు కూడా పూర్తి చేసుకోవడంతో సక్సెస్ మీట్ నిర్వహించింది చిత్ర యూనిట్. ఇప్పుడు హనుమాన్ మూవీ సీక్వెల్ జై హనుమాన్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ లో బిజీగా ఉన్నాడు ప్రశాంత్.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom