iDreamPost
android-app
ios-app

క్రేజీ కాంబినేషన్.. జాతిరత్నాలు డైరెక్టర్ తో విశ్వక్ సేన్

  • Published Aug 08, 2024 | 11:07 AM Updated Updated Aug 08, 2024 | 11:07 AM

Vishwak Sen: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా VS13 అనే కొత్త ప్రాజెక్ట్ ను చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి బజ్ నుడస్తున్న క్రమంలోనే తాజాగా విశ్వక్ కు సంబంధించి మరో కొత్త సినిమా ప్రటకన వెలువడింది.

Vishwak Sen: టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ తాజాగా VS13 అనే కొత్త ప్రాజెక్ట్ ను చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. అయితే ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి బజ్ నుడస్తున్న క్రమంలోనే తాజాగా విశ్వక్ కు సంబంధించి మరో కొత్త సినిమా ప్రటకన వెలువడింది.

  • Published Aug 08, 2024 | 11:07 AMUpdated Aug 08, 2024 | 11:07 AM
క్రేజీ కాంబినేషన్.. జాతిరత్నాలు డైరెక్టర్ తో విశ్వక్ సేన్

మాస్ కా దాస్ ‘విశ్వక్ సేన్’ ఇటీవలే గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీతో ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే.అయితే యాక్షన్ థ్రిలర్ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ థియేటర్ లో విడుదలై ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక పోయింది. దీంతో యావరేజ్ టాక్ తో విశ్వక్ గ్యాంగ్స్ ఆఫ్ గోదవరి సరిపెట్టుకుంది. ఇకపోతే ఎప్పుడు విభన్న కథలను ఎంచుకుంటూ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు విశ్వక్. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఈ యంగ్ హీరో వరుస ప్రాజెక్ట్స్ తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే.  ఇప్పటికే ఓ వైపు ‘మెకానిక్ రాకీ’ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకొంటోంది. కాగా, ఈ సినిమా . అక్టోబర్ 31 వ తేదీన వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో రిలీజ్ కాబోతుంది.

దీంతో పాటుగా ‘లైలా’ అనే ఇంట్రెస్టింగ్ మూవీని కూడా అనౌన్స్ చేశాడు విశ్వక్. ఈ క్రమంలోనే మళ్లీ తాజాగా ఈయన VS13 అనే కొత్త ప్రాజెక్ట్ ను చేస్తున్నాడు. ఇక ఈ VS13 సినిమాకు శ్రీధర్ గంట దర్శకత్వం వహిస్తుండగా.. శ్రీ‌ల‌క్ష్మీ వెంక‌టేశ్వ‌ర సినిమాస్ బ్యానర్ పై సుధాక‌ర్ చెరుకూరి నిర్మిస్తున్నాడు. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. దీంతో ప్రస్తుతం విశ్వక్ VS13 పోస్టర్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇలా ఓ వైపు ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి బజ్ సోషల్ మీడియాలో నడుస్తున్న క్రమంలోనే.. తాజాగా విశ్వక్ సంబంధించిన మరో కొత్త ప్రాజెక్ట్ ప్రకటన వెలువడింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

anudep kv vishwaksen combo 2

యంగ్ హీరో విశ్వక్ సేన్ ప్రస్తుతం ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో తో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే  తాజాగా విశ్వక్ సేన్ కు సంబంధించి మరో కొత్త చిత్రం ప్రకటన వెలువడింది. అయితే విశ్వక్ సేన్ ను దర్శకుడు కేవీ అనుదీప్ డైరెక్ట్ చేయనున్నారు. ఇక ఈ సినిమా VS14 అనే టైటిల్ తో తెరకెక్కనుందట. అలాగే ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ అయిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై నిర్మించనున్నారు. అలాగే భీమ్స్ ఈ VS14 సినిమాకి సంగీతం అందించనున్నారు. ఇకపోతే మూవీ మేకర్స్ ఈ సినిమా వివరాలను పోస్టర్ ద్వారా వెల్లడించారు. కాకపోతే ఈ చిత్రం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది. నటీ, నటులు ఎవరు అనే విషయాలు ఇంక తెలియాల్సి ఉంది. మరీ, విశ్వక్ సేన్, దర్శకుడు కేవీ కాంబినేషన్ లో త్వరలో తెరకెక్కనున్న VS14  సినిమా పై మీ అభిప్రాాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

gamdomCasibomJojobet Girişmarsbahis girişGrandpashabet Giriş