iDreamPost
android-app
ios-app

విజయశాంతితో ఉన్న ఈ పిల్లాడ్ని గుర్తు పట్టారా..? ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్

  • Published Apr 06, 2024 | 3:17 PM Updated Updated Apr 06, 2024 | 3:17 PM

లేడీ అమితాబ్, లేడీ సూపర్ స్టార్ విజయ శాంతితో కనిపిస్తున్న ఈ పిల్లాడిని గుర్తు పట్టారా..? ఇప్పుడు అతడో స్టార్ హీరో. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇంతకు అతడు ఎవరో గుర్తు పట్టండి చూద్దాం

లేడీ అమితాబ్, లేడీ సూపర్ స్టార్ విజయ శాంతితో కనిపిస్తున్న ఈ పిల్లాడిని గుర్తు పట్టారా..? ఇప్పుడు అతడో స్టార్ హీరో. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. ఇంతకు అతడు ఎవరో గుర్తు పట్టండి చూద్దాం

  • Published Apr 06, 2024 | 3:17 PMUpdated Apr 06, 2024 | 3:17 PM
విజయశాంతితో ఉన్న ఈ పిల్లాడ్ని గుర్తు పట్టారా..? ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్

స్టార్ హీరోలతో రెమ్యనరేషన్ తీసుకున్న హీరోయిన్లు చాలా అరుదు. ఒకప్పుడు సావిత్రి, భానుమతి ఆ తర్వాత విజయ శాంతి మాత్రమే.. తమతో నటించిన హీరోలకు ధీటుగా రెమ్యునరేషన్ తీసుకున్నారు. ఎందుకంటే.. వీరికి అప్పట్లో ఉన్న క్రేజ్ అలాంటిది. వీరు నటిస్తున్నారంటే.. సినిమా హిట్ అని కూడా భావించేవారు దర్శక నిర్మాతలు. ముఖ్యంగా లేడీ ఓరియెంట్ చిత్రాలకు కేరాఫ్ అడ్రస్ అయ్యింది విజయ శాంతి. నేటి భారతం, ప్రతి ఘటన, రేపటి పౌరులు, ఆశయం, కర్తవ్యం, పోలీస్ లాకప్, ఒసేయ్ రాములమ్మ, రౌడీ దర్భార్, అడవి చుక్క, ఇందిరమ్మ, నాయుడమ్మ ఇలా ఎన్నో ఉమెన్ సెంట్రిక్ చిత్రాలు చేసింది. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్ర చేయాలంటే.. విజయ శాంతిని తప్ప మరెవ్వరినీ ఊహించుకోలేరు తెలుగు ప్రేక్షకులు.

యాక్షన్ సన్నివేశాల్లో డూప్ లేకుండా నటించేదట. ఆమెకు లేడీ అమితాబ్, లేడీ సూపర్ స్టార్ అన్న బిరుదు కూడా ఉంది. సుమారు 190 సినిమాల వరకు చేసింది విజయ శాంతి. దక్షిణాది ఇండస్ట్రీతో పాటు హిందీ చిత్ర పరిశ్రమలో కూడా అడపా దడపా చిత్రాల్లో నటించింది ఆవిడ. టాలీవుడ్‌లో ఆమెకు బెస్ట్ జోడీ ఎవరంటే.. చిరంజీవి, బాల కృష్ణ పేర్లే వినిపిస్తాయి. ఇప్పుడు కనిపిస్తున్న ఫోటో కూడా ఓ సినిమా షూటింగ్‌లోనిదే. ఈ ఫోటోలో కనిపిస్తున్న పిల్లాడు ఎవరో తెలుసా..? అతడు ఇండస్ట్రీలో టాప్ హీరో. గ్లోబల్ స్టార్ అయ్యాడు. ప్రస్తుతం వరుస చిత్రాలతో ఫుల్ స్వింగ్‌లో ఉన్నాడు. ఇంతకు ఆ బుడ్డోడు ఎవరంటే మెగా స్టార్ చిరంజీవి ముద్దుల తనయుడు రామ్ చరణ్. ఈ స్టిల్ పసివాడి ప్రాణం సినిమా సెట్‌లోనిది. ఈ సినిమాలో చిరంజీవి, విజయ శాంతి కలిసిన నటించిన సంగతి విదితమే.

1987లో వచ్చిన ఈ చిత్రం.. బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి విదితమే. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించాడు. ఇక రామ్ చరణ్ విషయానికి వస్తే.. ఆర్ఆర్ఆర్ మూవీతో పాన్ ఇండియన్ అండ్ గ్లోబల్ స్టార్ అయ్యాడు. ఇటీవల తండ్రిగా ప్రమోట్ అయిన ఈ మెగా వారసుడు. వరుస పెట్టి సినిమాలు చేస్తున్నాడు. శంకర్ గేమ్ ఛేంజర్‌తో పాటు బుచ్చిబాబు దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నాడు. ఇటీవల చరణ్ పుట్టిన రోజును పురస్కరించుకుని జరగండి.. జరగండి సాంగ్ రిలీజ్ చేసిన సంగతి విదితమే. ఇదిలా ఉంటే.. విజయ శాంతి కూడా తన నాయుడమ్మ మూవీ తర్వాత రాజకీయాల్లోకి వెళ్లిపోయింది. సుమారు 13 ఏళ్ల తర్వాత సరిలేరు నీకెవ్వరూ చిత్రంతో రీ ఎంట్రీ ఇచ్చింది. ఇది కూడా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సంగతి విదితమే. ప్రస్తుతం ఆమె కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేస్తోంది ఈసీనియర్ నటీమణి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetMadridbetJojobetHoliganbetMadridbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet