iDreamPost
android-app
ios-app

తమన్నాతో డేటింగ్‌.. 20 రోజులు పట్టింది: విజయ్‌ వర్మ

  • Published Mar 24, 2024 | 6:30 PM Updated Updated Mar 24, 2024 | 6:30 PM

Tamannaah : ప్రస్తుతం ఇండస్ట్రీలో తమన్నా,విజయ్ వర్మల పేరు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎక్కడ చూసిన ఈ లవ్ బర్డ్స్ చెట్టపట్టాలేసుకుంటూ దర్శనమిస్తున్నారు. అయితే ఇంత వరకు వీరిద్దరి పెళ్లి గురించి మాత్రం ఎక్కడ ప్రస్తావించడం లేదు. కానీ, తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విజయ్ వర్మ తమన్నా తో డేటింగ్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

Tamannaah : ప్రస్తుతం ఇండస్ట్రీలో తమన్నా,విజయ్ వర్మల పేరు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎక్కడ చూసిన ఈ లవ్ బర్డ్స్ చెట్టపట్టాలేసుకుంటూ దర్శనమిస్తున్నారు. అయితే ఇంత వరకు వీరిద్దరి పెళ్లి గురించి మాత్రం ఎక్కడ ప్రస్తావించడం లేదు. కానీ, తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విజయ్ వర్మ తమన్నా తో డేటింగ్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

  • Published Mar 24, 2024 | 6:30 PMUpdated Mar 24, 2024 | 6:30 PM
తమన్నాతో డేటింగ్‌.. 20 రోజులు పట్టింది: విజయ్‌ వర్మ

టాలీవుడ్ మిల్క్ బ్యూటీ ‘తమన్నా’. ఈమెకు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్ గురించి అందరికి తెలిసిందే. ఇండస్ట్రీకి ఈ బ్యూటీ వచ్చి 19 ఏళ్లు కావస్తోన్న ఇంకా ఈమె జోరు కొనసాగుతుంది. కాగా, గతేడాది తమన్నా, రజనీకాంత్ ‘జైలర్’ మూవీలో స్పెషల్ సాంగ్ తో కుర్రాళ్లను ఓ ఊపు ఊపేసింది. అంతేకాకుండా.. ఇటీవలే ‘లస్ట్ స్టోరీస్‌-2’ వెబ్ సిరీస్‌తో ‍ప్రేక్షకులను అలరించింది. అయితే ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బాలీవుడ్‌ సినిమాలతో బిజీగా ఉంది. అలాగే ‘అరణ్మణై- 4’ అనే తమిళ చిత్రంతో పాటు ‘స్ట్రీ-2’ అనే మూవీలో నటిస్తోంది. ఇదిలా ఉంటే.. తమన్నా గతేడాది తన బాయ్‌ఫ్రెండ్‌ విజయ్ వర్మను అభిమానులకు పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పటి వరకు వీరిద్దరు పెళ్లి గురించి ఎక్కడా ప్రస్తావించడం లేదు. కానీ, తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విజయ్ వర్మ తమన్నా తో డేటింగ్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు.

ప్రస్తుతం బాలీవుడ్ లో తమన్నా, విజయ్ వర్మల పేరు హాట్ టాపిక్ గా మారిపోయింది. ఎక్కడ చూసిన ఈ లవ్ బర్డ్స్ చెట్టపట్టాలేసుకుంటూ దర్శనమిస్తున్నారు. అయితే ఇంత వరకు వీరిద్దరి పెళ్లి గురించి మాత్రం ఎక్కడ ప్రస్తావించడం లేదు. కానీ, తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన విజయ్ వర్మ తమన్నా తో డేటింగ్ పై కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేశారు. అందులో విజయ్ వర్మ మాట్లాడుతూ..’ తమన్నా, నేను డేటింగ్‌ ప్రారంభించింది లస్ట్ స్టోరీస్‌-2 షూటింగ్‌లో కాదు. ఎందుకంటే.. ఆ సమయంలో ర్యాప్ పార్టీ జరగాల్సింది. కానీ జరగలేదు. అందుకే మేం నలుగురం కలిసి పార్టీ చేసుకోవాలనుకున్నాం. అలా పార్టీ చేసుకున్న రోజున తమన్నాకు.. నేను మీతో ఎక్కువ సమయం గడపాలని కోరుకుంటున్న అని అసలు విషయం చెప్పాను. ఆ తర్వాత.. మేం కలవడానికి దాదాపు 20 నుంచి 25 రోజులు పట్టిందని చెప్పుకొచ్చారు. ఇక వీరిద్దరూ జంటగా నటించిన లస్ట్‌ స్టోరీస్-2 చిత్రంలో కెమిస్ట్రీకి అభిమానులు సైతం ఫిదా అయ్యారు. దీంతో ఆ మూవీ సమయంలోనే డేటింగ్‌ ప్రారంభించారని ఫ్యాన్స్ భావించారు. కానీ, ఈ విషయంపై విజయ్ వర్మ క్లారిటీ ఇవ్వడంతో అసలు విషయం తెలిసింది.

కాగా, కొన్ని రోజుల క్రితమే విజయ్ వర్మ, తమన్నా భాటియా జంటగా ఓ పార్టీకి వెళ్తూ కనిపించిన విషయం తెలిసిందే. ఇక విజయ్ వర్మ విషయానికొస్తే.. ఇతను కొత్త ఏడాదిలో ‘మర్డర్‌ ముబారక్‌’ అనే వెబ్ సినిమాతో అలరించాడు. అలాగే గతేడాది ‘జానే జాన్’, ‘దాహాద్’, ‘లస్ట్‌ స్టోరీస్‌-2’ చిత్రాలతో మెప్పించారు. ప్రస్తుతం విజయ్ వర్మ ‘ఉల్ జలూల్ ఇష్క్‌లో’ హీరోగా నటించనున్నారు. అయితే తమన్నా, విజయ్ వర్మ డేటింగ్‌ గురించి తెలిసినప్పటీ నుంచి వీరి పెళ్లి గురించే ఎక్కువగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి. మరి ప్రస్తుతం రిలేషన్ లో ఉన్న ఈ జంట ఈ ఏడాదిలోనైనా వివాహాబంధంలోకి ‍అడుగుపెడతారో లేదో అని అభిమానులు ఎదురు చూస్తున్నారు. మరి, తమన్నా తో విజయ్ వర్మ డేటింగ్ ఎప్పుడు మొదలైందో చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.