iDreamPost
android-app
ios-app

ఎక్కడ తగ్గట్లేదుగా.. వరుస లైనప్స్ ఎనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ

  • Published May 09, 2024 | 11:24 AM Updated Updated May 09, 2024 | 11:24 AM

సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన మరో హీరో విజయ్ దేవరకొండ. నువ్విలా మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ కుర్రాడు.. వరుస విజయాలతో దూసుకెళ్లాడు. సరైన కొన్ని సినిమాల నుండి సరైన హిట్ లేక సతమతమౌతున్నాడు ఈ రౌడీ బాయ్.

సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఎదిగిన మరో హీరో విజయ్ దేవరకొండ. నువ్విలా మూవీతో టాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ కుర్రాడు.. వరుస విజయాలతో దూసుకెళ్లాడు. సరైన కొన్ని సినిమాల నుండి సరైన హిట్ లేక సతమతమౌతున్నాడు ఈ రౌడీ బాయ్.

  • Published May 09, 2024 | 11:24 AMUpdated May 09, 2024 | 11:24 AM
ఎక్కడ తగ్గట్లేదుగా.. వరుస లైనప్స్ ఎనౌన్స్ చేసిన విజయ్ దేవరకొండ

బాయ్ నెక్ట్స్ డోర్ అన్న పదానికి ఫర్ ఫెక్ట్ సింక్ అయ్యే హీరో విజయ్ దేవరకొండ. తక్కువ సమయంలోనే స్టార్ హీరోల సరసన చేరిన ఈ యంగ్ యాక్టర్.. ఇటీవల కాలంలో సరైన హిట్టు లేక సతమతమౌతున్నాడు. పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన లైగర్ థియేటర్స్ వద్ద చతికిల పడగా.. ఖుషీ పర్వాలేదు అనిపించుకుంది. ఇక ఫ్యామిలీ స్టార్ కూడా ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ అతడి క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు. ఒక్క హిట్ పడాలే కానీ.. మళ్లీ బాణంలా దూసుకెళ్లిపోతాడు. ఇప్పుడు వరుసగా సినిమాలను లైన్లో పెట్టాడు. దిల్ రాజు నిర్మించిన ఫ్యామిలీ స్టార్ బెడిసి కొట్టగా.. మరోసారి దేవరకొండతో రిస్క్ చేసేందుకు సిద్ధమయ్యాడు ఈ బడా నిర్మాత. బాలీవుడ్ యంగ్ హీరోయిన్ల క్రష్ బాయ్ విజయ్ దేవర కొండ పుట్టిన రోజు పురస్కరించుకుని పలు సినిమా అప్డేట్స్ వచ్చాయి.

సితార ఎంటర్ టైన్ మెంట్ పై గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కబోతుంది. నాగవంశీ నిర్మాత. VD 12 తెరకెక్కబోతోంది. రౌడీ బాయ్‌కు బర్త్ డే విషెస్ తెలియజేస్తూ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది యూనిట్. అలాగే శ్రీ వెంకటేశ్వర సినీ క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు.. విజయ్‌తో ఓ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు. కత్తి పట్టిన హీరో చేతిని చూపిస్తూ.. ‘కత్తి నేనే.. నెత్తురు నాదే.. యుద్ధం నాతోనే’ అంటూ మాస్ డైలాగ్స్ రాసి ఉన్నాయి. దీన్ని బట్టి చూస్తే.. ఇదొక యాక్షన్ మూవీగా కనిపిస్తోంది. పోస్టరే సినిమాపై అంచనాలు పెంచేసింది. పాన్ ఇండియన్ మూవీగా తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి రాజా వారు రాణివారు ఫేం రవి కిరణ్ కోలా దర్శకుడు. ఇక ఇందులో శ్రీలీల అనుకోగా.. ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుందని, ఆమె స్థానంలో ప్రేమలు బ్యూటీ మమిత బైజు రాబోతున్నట్లు టాక్ నడుస్తోంది. ఇక ఇదే కాకుండా మైత్రీ మూవీస్ మేకర్స్ నుండి మరో అప్టేట్ వచ్చింది.

‘ఇతిహాసాలు రాయలేదు.. అవి హీరోల రక్తంలో ఇమిడిపోయాయి’ అంటూ ఓ క్యాప్షన్ ఇచ్చి.. ఓ పురాతన రాయిపై పోరాటానికి వెళుతున్న రాజు చిత్రాన్ని పొందుపరిచారు. దీనిపై ‘ది లెజెండ్ ఆఫ్ ది క్రూస్ లాండ్’ అని రాసి ఉంది. 1854-1878 మధ్యలో జరిగిన కథగా తెలుస్తోంది. సినిమాపై విపరీతమైన క్యూరియాసిటీని క్రియేట్ చేసింది ఈ మూవీ. టాక్సీవాలా, ది ఎండ్, శ్యామ్ సింగరాయ్ సినిమాలతో తన మార్క్ చూపించిన రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వంలో మరో మూవీ చేస్తున్నాడు. ఆ సినిమా ఎనౌన్స్ మెంట్ వచ్చింది. మైత్రీ మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుంది. విజయ్, రాహుల్ కాంబోలో రాబోతున్న రెండో చిత్రమిది.  నువ్విలా, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రాల్లో స్మాల్ రోల్స్ చేసిన విజయ్.. ఎవడే సుబ్రమణ్యంతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. పెళ్లి చూపుల మూవీతో క్లిక్ అయిన ఈ హీరో.. అర్జున్ రెడ్డితో బాలీవుడ్ ఇండస్ట్రీని కూడా ఆకర్షించాడు. ద్వారక, ఏ మంత్రం వేశావో వంటి చిత్రాలు అలరించకపోయినా.. గీత గోవిందం మరో మెట్టు ఎక్కించింది. టాక్సీ వాలా హిట్ తర్వాత.. బ్లాక్ బస్టర్ అన్న పదం చూడలేదు దేవరకొండ. ఇప్పుడు ఈ సినిమాలపై ఆశలన్నీ పెట్టుకున్నాడు.

Wishing the Supremely Talented, our beloved The #VijayDeverakonda a very Happy Birthday! – Team #VD12 ❤️#HBDTheVijayDevarakonda@TheDeverakonda @anirudhofficial @gowtam19 #GirishGangadharan @vamsi84 #SaiSoujanya @NavinNooli @SitharaEnts @Fortune4Cinemas #SrikaraStudios pic.twitter.com/8siio4EcgN

— Sithara Entertainments (@SitharaEnts) May 9, 2024

Presenting #VD14 – THE LEGEND OF THE CURSED LAND 🔥

Happy Birthday, @TheDeverakonda ❤️‍🔥

Directed by @Rahul_Sankrityn

Produced by @MythriOfficial pic.twitter.com/FVorlWkLmd

— Mythri Movie Makers (@MythriOfficial) May 9, 2024

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet