iDreamPost
android-app
ios-app

ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ కు వెంకటేశ్ పార్టీ! ఎవరెవరికి ఆహ్వానం అంటే?

  • Published Dec 26, 2023 | 6:14 PM Updated Updated Dec 26, 2023 | 6:14 PM

Venkatesh Grand Party: విక్టరీ వెంకటేశ్ కెరీర్ లో అరుదైన మైలురాయిని అందుకోబోతున్నారు. ఈ సందర్భంగా గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేస్తున్నారు.

Venkatesh Grand Party: విక్టరీ వెంకటేశ్ కెరీర్ లో అరుదైన మైలురాయిని అందుకోబోతున్నారు. ఈ సందర్భంగా గ్రాండ్ పార్టీ ఏర్పాటు చేస్తున్నారు.

  • Published Dec 26, 2023 | 6:14 PMUpdated Dec 26, 2023 | 6:14 PM
ఇండస్ట్రీలో టాప్ స్టార్స్ కు వెంకటేశ్ పార్టీ! ఎవరెవరికి ఆహ్వానం అంటే?

టాలీవుడ్ సెకండ్ జనరేషన్ టాప్ హీరోల్లో విక్టరీ వెంకటేశ్ కూడా ఒకరు. ఆయన ఎనర్జీ, కామెడీ టైమింగ్, స్పాంటినిటీ ఇప్పటికీ తగ్గలేదు. ఆన్ స్క్రీన్ మీదనే కాకుండా.. ఆఫ్ స్క్రీన్ లో కూడా పంచులతో ఇరగదీస్తూ ఉంటారు. ఈ సంక్రాంతికి వెంకటేశ్ నటించి ఫ్యామిలీ ఎంటర్ టైనర్ సైంధవ్ మూవీ విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ సినిమాకి ఇంకో ప్రత్యేకత కూడా ఉంది. వెంకటేశ్ కెరీర్లో సైంధవ్.. 75వ సినిమా. అందుకే ఈ మైలురాయిని మరింత మధురజ్ఞాపకంగా మార్చేందుకు ఒక పెద్ద పార్టీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. మరి.. ఈ పార్టీకి ఎవరెవరు రాబోతున్నారు? ఈ పార్టీ స్పెషలేంటో చూద్దాం.

విక్టరీ వెంకటేశ్ అనగానే ప్రేక్షకుల్లోకూడా ఒక కొత్త ఉత్సాహం వచ్చేస్తుంది. ఇప్పటివరకు ఎన్నో వైవిధ్య పాత్రల్లో నటించి తెలుగు ప్రేక్షకులను మెప్పించారు. ఇప్పుడు వెంకటేశ్ కెరీర్లో 75వ సినిమా సైంధవ్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీ సంక్రాంతి సందర్భంగా జనవరి 14న విడుదలవుతుందని చెబుతున్నారు. కెరీర్ లో ఈ అరుదైన మైలురాయిన మరింత స్పెషల్ చేసేందుకు.. ఒక పెద్ద పార్టీని వెంకటేశ్ ప్లాన్ చేస్తున్నారట. ఆ పార్టీకి టాలీవుడ్ లో ఉన్న సెలబ్రిటీలను, ప్రముఖులను ఆహ్వానిస్తున్నారట. చిరంజీవి, నాగార్జున, మహేశ్ బాబు, నాని స్పెషల్ అట్రాక్షన్ గా నిలువనున్నారు. అలాగే వెంకేటశ్ తో కలిసి ఇప్పటివరకు సినిమాలు చేసిన నిర్మాతలు, దర్శకులు కూడా ఈ పార్టీకి వస్తారట. అలాగే టాలీవుడ్ లో ఉన్న టాప్ హీరోలందరికీ ఆహ్వానం అందుతుందని చెబుతున్నారు. అయితే నందమూరి కుటుంబానికి ఏమేరకు అహ్వానాలు అందుతున్నాయనే విషయంపై మాత్రం స్పష్టమైన సమాచారం లేదని చెబుతున్నారు.

venktesh giving party to top stars

ఈ పార్టీని మరింత స్పెషల్ గా మార్చేందుకు సైంధవ్ సినిమా నిర్మాత వెంకట్ బోయినపల్లి ప్లాన్ చేస్తున్నారట. ఈ మూమెంట్ ని ఇంకాస్త స్పెషల్ గా మార్చేందుకు గొప్ప ఈవెంట్ ఆర్గనైజ్ చేయబోతున్నారని తెలుస్తోంది. డిసెంబర్ 27 సాయంత్రం ఈ గ్రాండ్ ఈవెంట్ జరగనుంది. ఈ ఈవెంట్ లో బడా బడా హీరోలతో వెంకటేశ్ ఇంటర్వ్యూ ఉంటుంది. అయితే దీనిని లైవ్ టెలికాస్ట్ చేయరని చెబుతున్నారు. దీనిని న్యూఇయర్ స్పెషల్ గా ప్రముఖ ఛానల్ లో ప్రసారం చేస్తారు. అలాగే ఈ సైంధవ్ సినిమాకి సంబంధించి ఎలాంటి ప్రచార కార్యక్రమాలు, ఇంటర్వ్యూలు ఉండవని తెలుస్తోంది. ఈ ఇంటర్వ్యూ, ఈవెంట్ నే సైంధవ్ ప్రమోషన్స్ గా వాడతారని చెబుతున్నారు. సైంధవ్ మూవీని సంక్రాంతి స్పెషల్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమైపోయారు. అయితే ఇప్పుడు టాలీవుడ్ లో సంక్రాంతి రేసులో 5 సినిమాలు ఉన్నాయి. ఇప్పటికే దిల్ రాజు తన ఫ్యామిలీ మ్యాన్ సినిమాని సంక్రాంతి నుంచి సమ్మర్ కు మార్చుకున్నారు. ఇంక మిగిలిన 5 సినిమాల్లో ఎవరు తగ్గుతారు? ఎవరు సంక్రాంతి బరిలో నిలుస్తారు అనే విషయంపై రెండ్రోజుల్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. మరి.. సైంధవ్ సినిమా సందర్భంగా వెంకటేశ్ గ్రాండ్ పార్టీ ఇవ్వడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet