iDreamPost
android-app
ios-app

జాక్​పాట్ కొట్టిన ‘మట్కా’.. వరుణ్ తేజ్ కెరీర్​లో ఇదే ఫస్ట్ టైమ్!

  • Published Sep 03, 2024 | 3:27 PM Updated Updated Sep 03, 2024 | 3:27 PM

Varun Tej, Matka Movie, Matka Movie Audio Rights: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘మట్కా’. ఈ మూవీ బిజినెస్​కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్​ అప్​డేట్ బయటకు వచ్చింది. ఈ ఫిల్మ్​తో వరుణ్ జాక్​పాట్ కొట్టేశాడు.

Varun Tej, Matka Movie, Matka Movie Audio Rights: మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘మట్కా’. ఈ మూవీ బిజినెస్​కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్​ అప్​డేట్ బయటకు వచ్చింది. ఈ ఫిల్మ్​తో వరుణ్ జాక్​పాట్ కొట్టేశాడు.

  • Published Sep 03, 2024 | 3:27 PMUpdated Sep 03, 2024 | 3:27 PM
జాక్​పాట్ కొట్టిన ‘మట్కా’.. వరుణ్ తేజ్ కెరీర్​లో ఇదే ఫస్ట్ టైమ్!

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్​కు ఉన్న క్రేజ్ గురించి తెలిసిందే. యూత్ ఆడియెన్స్​లో ఆయనకు మంచి ఫాలోయింగ్ ఉంది. డిఫరెంట్ మూవీస్​ను ఇష్టపడే వాళ్లు వరుణ్​ ఫిల్మ్స్​ను ఎక్కువగా లైక్ చేస్తుంటారు. కెరీర్ బిగినింగ్ నుంచి వైవిధ్యమైన చిత్రాల్లో నటిస్తూ అందరి ప్రశంసలు అందుకుంటూ వస్తున్నాడు. ఏదో ఒక జోనర్​కు పరిమితం కాకుండా అన్ని రకాల సినిమాలు చేస్తూ కెరీర్​లో దూసుకెళ్తున్నాడు. ఇప్పుడు పాన్ ఇండియా మార్కెట్​పై కన్నేశాడు మెగా ప్రిన్స్. ఇందులో భాగంగానే కొత్త చిత్రం ‘మట్కా’ను భారీ ఎత్తున రూపొందిస్తున్నాడు. పీరియాడికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాను ‘పలాస’ ఫేమ్ కరుణ కుమార్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ ఫిల్మ్ బిజినెస్​కు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్​డేట్ బయటకు వచ్చింది.

వరుణ్ తేజ్ కెరీర్​లోనే అత్యంత భారీ బడ్జెట్​తో తెరకెక్కుతోంది ‘మట్కా’. ఆ మూవీకి ప్రీ-రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్​లో జరిగే ఛాన్సులు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆడియో హక్కుల్ని సూపర్ రేటుకు అమ్మేశారు. ప్రముఖ సంస్థ ఆదిత్య మ్యూజిక్ ‘మట్కా’ ఆడియో రైట్స్​ను రూ.3.6 కోట్ల ధరకు సొంతం చేసుకుంది. వరుణ్ తేజ్ కెరీర్​లో ఆడియో హక్కులకు ఇంత భారీ ధర దక్కడం ఇదే ఫస్ట్ టైమ్. డైరెక్టర్ కరుణ కుమార్​తో పాటు వరుణ్​కు మంచి మ్యూజిక్ టేస్ట్ ఉండటం, ‘మట్కా’కు స్టార్ కంపోజర్ జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతాన్ని అందిస్తుండటంతో మ్యూజిక్ రైట్స్​కు భారీ ధర దక్కిందని తెలుస్తోంది.

కరుణ కుమార్ తొలి చిత్రం ‘పలాస’లో నక్కిలీసు గొలుసు పాట చార్ట్ బస్టర్​గా నిలిచింది. ఆయన సెకండ్ ఫిల్మ్ ‘శ్రీదేవి సోడా సెంటర్​’లోనూ సాంగ్స్ మంచి ఇంప్రెషన్ తీసుకున్నాయి. దీంతో ‘మట్కా’ ఆల్బమ్ అదిరిపోతుందని ఆదిత్య మ్యూజిక్ భావించిందని సమాచారం. సేమ్ టైమ్ జీవీ కుమర్ కంపోజింగ్ కాబట్టి రెండు, మూడు పాటలు కచ్చితంగా బాగుంటాయనే నమ్మకం కూడా అధిక ధర పెట్టడానికి కారణంగా చెబుతున్నారు. ఏదేమైనా ఆడియో రైట్స్​తో ప్రీ రిలీజ్ బిజినెస్​ను ఘనంగా స్టార్ట్ చేసింది ‘మట్కా’. ఇదే ఊపులో థియేట్రికల్, ఓటీటీ, శాటిలైట్ బిజినెస్ కూడా అదిరిపోవాలి. ఇక, 1952 నుంచి 1982 మధ్య నడిచే పీరియాడికల్ డ్రామాగా వరుణ్ ఫిల్మ్​ను కరుణ కుమార్ రూపొందిస్తున్నాడట. ఇందులో మెగా ప్రిన్స్ పక్కన మీనాక్ష్మి చౌదరి, నోరా ఫతేహీ హీరోయిన్స్​గా యాక్ట్ చేస్తున్నారు. ప్రముఖ హీరో నవీన్ చంద్ర ఓ కీలకపాత్రలో నటిస్తున్న ‘మట్కా’ నుంచి త్వరలో టీజర్ వచ్చే ఛాన్స్ ఉంది. మరి.. ‘మట్కా’తో వరుణ్ పాన్ ఇండియా హిట్ కొడతాడా? మీ ఒపీనియన్​ను కామెంట్ చేయండి.