రిసెప్షన్ లో ఆ ఇద్దరి కాళ్లు మొక్కిన లావణ్య త్రిపాఠి!

వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి మ్యారేజ్ రిసెప్షన్ వైభవంగా జరిగింది. ఈ రిసెప్షన్ లో లావణ్య త్రిపాఠి ప్రవర్తించిన తీరుపై నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి.

వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠి మ్యారేజ్ రిసెప్షన్ వైభవంగా జరిగింది. ఈ రిసెప్షన్ లో లావణ్య త్రిపాఠి ప్రవర్తించిన తీరుపై నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి.

మెగా హీరో వరుణ్ తేజ్, లావణ్య త్రిపాఠిల వివాహం అంగరంగవైభవంగా జరిగిన విషయం తెలిసిందే. ఇన్నాళ్లు ప్రేమలో ఉన్న వీళ్లు పెద్దల సమక్షంలో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. వీరి వివాహం నవంబర్ 1న ఇటలీలో అత్యంత సన్నిహితులు, కుటుంబసభ్యుల సమక్షంలో జరిగింది. ఆ తర్వాత నవంబర్ 5న ఇండస్ట్రీలో పెద్దలు, స్నేహింతలు కోసం ఒక గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి సినిమా ఇండస్ట్రీలో పెద్దలు, ప్రముఖులు, స్టార్లు అంతా పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ రిసెప్షన్ లో లావణ్య త్రిపాఠి సంస్కారానికి అభిమానులు ఫిదా అయిపోయారు.

మెగా కాంపౌండ్ లో పెళ్లి వేడుక అంటే అది రేంజ్ లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులంతా వధూవరులను ఆశీర్వదించేందుకు వచ్చేశారు. ఈ కార్యమంలో వరుణ్- లావణ్య ఇద్దరూ చాలా సింపుల్ గా రెడీ అయ్యారు. వరుణ్ తేజ్ బ్లాక్- గోల్డ్ కలర్ డిజైనర్ షేర్వానీని ధరించాడు. లావణ్య త్రిపాఠి బంగారు వర్ణంలో ఎంతో సింపుల్ చీరలో సిద్ధమైంది. అచ్చమైన తెలుగింటి కోడలిలా నుదుటిన కుంకుమతో లక్షణంగా రెడీ అయ్యింది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన అతిథులు అందరినీ నవ్వుతూ పలకరిస్తూ నూతన జంట సందడి చేశారు. ఈ రిసెప్షన్ లో ఇంకో ఆసక్తికర విషయం కూడా జరిగింది. లావణ్య త్రిపాఠి పెద్ద మామయ్య మెగాస్టార్ చిరంజీవికి పాదాభివదనం చేసి ఆశీర్వాదం తీసుకుంది. మెగా కాంపౌండ్ లో ఫంక్షన్ అంటే చిరంజీవి లేకుండా ఏమీ జరగదనే చెప్పాలి. మొత్తం కుటుంబానికే పెద్దదిక్కు ఆయన.

అంతేకాకుండా నట గురువు సత్యానంద్ కు పాదాభివదనం చేసి ఆశీర్వాదం తీసుకుంది. సత్యానంద్ వద్ద శిక్షణ తీసుకున్న హీరోలు టాలీవుడ్ లో వందకు పైగా ఉంటారు. అలాగే వరుణ్ తేజ్, సాయి ధరమ్ తేజ్ కూడా సత్యానంద వద్దే శిక్షణ తీసుకున్నారు. ఒక్క మెగా ఫ్యామిలీకే కాకుండా సత్యానంద్ తో ఎంతో మంది హీరోలకు, వారి కుటుంబాలకు ప్రత్యేకమైన అనుబంధం ఉంటుందనే చెప్పాలి. అలాంటి ఒక గొప్ప వ్యక్తి రాగానే లావణ్య త్రిపాఠి ఏమాత్రం ఆలోచించకుండా ఆయన ఆశ్వీర్వాదం తీసుకోవడంపై నెట్టింట ప్రశంసలు కురుస్తున్నాయి.

మెగా కోడలిగా మాత్రమే కాకుండా.. ఒక తెలుగింటి కోడలిగా లావణ్యకు వందకు వంద మార్కులు పడతాయి అంటూ మెచ్చుకుంటున్నారు. తాను ఒక హీరోయిన్, మెగా కోడలు ఇలాంటివి ఏవీ మనసులో పెట్టుకోకుండా ఒక గురువు రాగానే ఆమె కాళ్లు మొక్కిన విధానం చూసి సెలబ్రిటీలే కాదు.. మెగా అభిమానులు అంతా ఫిదా అయిపోతున్నారు. లావణ్య త్రిపాఠి బంగారం సార్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లికి ముందే లావణ్య త్రిపాఠి ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. మెగా కోడలు కాక ముందే తన కెరీర్, తాను చేసే పాత్రల వల్ల తన అత్తింటి కుటుంబానికి మాట రాకూడదు అనే ఉద్దేశంతో లావణ్య నిర్ణయం తీసుకుంది. ఇకపై తాను సినిమాలకు సంబంధించి బోల్డ్ పాత్రలు, అభ్యంతరకర సన్నివేశాల్లో మాత్రం నటించబోనని వెల్లడించింది. ఇప్పుడు పెద్దల పట్ల లావణ్య త్రిపాఠి చూపించిన సంస్కారం కూడా అందరినీ ఆకట్టుకుంటోంది.

Show comments