Arjun Suravaram
పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో రానున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. తాజాగా ఈ సినిమా బ్లేజ్ విడుదలైంది. అయితే దీనిపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది సినిమా ప్రమోషనా లేక జనసేనా పార్టీ ప్రమోషనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
పవన్ కళ్యాణ్ దర్శకుడు హరీష్ శంకర్ కాంబినేషన్ లో రానున్న సినిమా ఉస్తాద్ భగత్ సింగ్. తాజాగా ఈ సినిమా బ్లేజ్ విడుదలైంది. అయితే దీనిపై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది సినిమా ప్రమోషనా లేక జనసేనా పార్టీ ప్రమోషనా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
Arjun Suravaram
పవన్ కల్యాణ్, హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా ‘ఉస్తాద్ భగత్ సింగ్’. గబ్బర్ సింగ్ వంటి బ్లాక్ బాస్టర్ వంటి సినిమా అనంతరంతో వీరిద్దరి కాంబినేషన్ లో ఈ సినిమా రానుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదలయ్యాయి. అయితే ఈ గ్లింప్స్ పై అనేక విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఇది సినిమా ప్రమోషనా లేక జనసేనా పార్టీ ప్రమోషనా అంటూ పలువురు అభిప్రాయ పడుతున్నారు.
పవన్ కల్యాణ్ పదేళ్ల క్రితం జనసేన పార్టీని స్థాపించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి నేటి వరకు పవన్ రాజకీయం ఏమి మారలేదు. కేవలం ఊగిపోయే ప్రసంగాలు తప్పా.. చేతల్లో ఏమి ఉండటం లేదు. అందుకే పార్టీ పెట్టి ఏళ్లు గడుస్తున్నా క్షేత్ర స్థాయిలో పార్టీని బలోపేతం చేసుకోలేపోయారు. అందుకే 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేయలేక టీడీపీ, బీజేపీలతో జట్టు కట్టాడు. ఇది ఇలా ఉంటే.. పవన్ కల్యాణ్ సినిమాలపై తరచూ అనేక విమర్శలు వస్తున్నాయి. సినిమాను సినిమాలాగా చూపించకుండా.. అందులో తన పొలిటికల్ ను చూపిస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది.
పవన్ కల్యాణ్ రాజకీయాల్లో అధికార వైఎస్సార్ సీపీని ఏ మాత్రం ఎదుర్కొలేక పోతున్నారు. అంతేకాక ఆయన స్పీచ్ లు కూడా ప్రజలను ఆకట్టుకునే లా ఉండటం లేదు. పవన్ కల్యాణ్ చెప్పే మాటలకు, చేసే పనులకు అసలు సంబంధం ఉండదు. కేవలం ఆవేశంతో మాట్లాడటం తప్ప..మరేం చేయలేకపోతున్నారు. ఇలాంటి ప్రస్టేషన్లో ఉన్న పవన్ కల్యాణ్ ప్రత్యక్ష రాజకీయాల్లో తాను చేయలేకపోయిన వాటిని..సినిమాల్లో చూపిస్తూ నవ్వుల పాలవుతున్నారు. అందుకు ఉదాహరణ గతంలో వచ్చిన పవన్ కల్యాణ్ సినిమాలు. అలానే తాజాగా విడుదలైన ఉస్తాద్ భగత సింగ్ బ్లేజ్ కూడా ఆ మార్క్ ను చూపించారు.
ఉస్తాద్ భగత్ సింగ్ బ్లేజ్ చూసినట్లు అయితే అందులో పవన్ కల్యాణ్ కి , ఆయన పార్టీకి ఇచ్చిన బిల్డప్ మాములుగా లేదు. అందుకే ఈ వీడియో చూసిన చాలా మంది రాజకీయల్లో ఏమి చేయలేని పవన్.. ఇలా సినిమాల్లో బిల్డప్ లు ఇచ్చుకుంటూ సంతోష పడుతున్నారని అంటున్నారు. మొత్తంగా ప్రస్తుత సామాజిక రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఉంటూనే పవన్ కళ్యాణ్ ఆ తరహా టచ్ చూపిస్తారని టాక్ నడిచింది. ఆనుకున్న విధంగానే ఉస్తాద్ భగత్ సింగ్ తాజా గ్లింప్స్ లో జనసేన పార్టీ గుర్తైన గాజు గ్లాసును ఉద్దేశిస్తూ డైలాగులు పెట్టించారు. కానీ.. నిజ జీవితంలో పవన్ కి రాజకీయ సామర్థ్యం లేదనేది చాలా మంది ఓపినియన్. వారి మాటలను నిజం చేస్తూ.. సినిమాల్లో మాత్రమే తన గొప్పలు చెప్పుకుంటున్నారు. మొత్తంగా ఉస్తాద్ భగత్ సింగ్ బ్లేజ్ కూడా పవన్ కల్యాణ్ రాజకీయ స్పీచ్ లా చప్పగా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తోన్నాయి.