iDreamPost
android-app
ios-app

Upasana : చరణ్ కు నాకు మధ్య బౌండ్రీస్ ఉన్నాయి! ఉపాసన కామెంట్స్ వైరల్!

  • Published Feb 06, 2024 | 5:28 PM Updated Updated Feb 06, 2024 | 5:28 PM

మెగా వారి కోడలు ఉపాసన కొణిదెల గురించి ఇప్పుడు ఎవరికీ ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ.. తన భర్త రామ్ చరణ్ గురించి, కూతురు క్లింకార గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

మెగా వారి కోడలు ఉపాసన కొణిదెల గురించి ఇప్పుడు ఎవరికీ ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఉపాసన మాట్లాడుతూ.. తన భర్త రామ్ చరణ్ గురించి, కూతురు క్లింకార గురించి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది.

  • Published Feb 06, 2024 | 5:28 PMUpdated Feb 06, 2024 | 5:28 PM
Upasana : చరణ్ కు నాకు మధ్య బౌండ్రీస్ ఉన్నాయి! ఉపాసన కామెంట్స్ వైరల్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతుల గురించి ఈ మధ్య ఎన్నో వార్తలు వింటూనే ఉంటున్నాం. వారి ఇరువురికి కూతురు జన్మించిన దగ్గర నుంచి అందరి కళ్ళు ఈ జంట వైపే చూస్తున్నాయి. అలాగే ఇప్పటివరకు వారి కూతురిని ఎవరికీ చూపించలేదు కూడా. ఉపాసన కొణిదెల ఇదివరకు ఎవరికీ తెలియకపోయినా .. రామ్ చరణ్ ను పెళ్లాడిన తర్వాత అందరికి పరిచయం అవుతూ వచ్చింది. మొదటిలో ఈమెపైన ట్రోల్ చేసిన వారే.. ఈమె గురించి తెలుసుకున్న తర్వాత ప్రశంసలు కురిపిస్తున్నారు. ఉపాసన కూడా ఇప్పటివరకు ఎన్నో సామజిక సేవలు చేస్తూ .. తన మంచితనాన్ని చాటుకుంటున్నారు. ప్రస్తుతం ఈ మెగా వారి కోడలు ఒక హాస్పిటల్ నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. అడపా దడపా ఏవో ఒక ఇంటర్వూస్ కూడా ఇస్తూ ఉంటుంది ఉపాసన. ఈ క్రమంలో తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఉపాసన తన భర్త రామ్ చరణ్, కూతురు క్లింకార గురించి కొన్ని ఆసక్తికర విషయాలు చెప్పుకొచ్చింది.

తాజాగా జరిగిన ఆ ఇంటర్వ్యూలో ఉపాసనను పలు వ్యక్తిగత విషయాలు అడిగారు. ఈ క్రమంలో .. ఇంటర్వ్యూ చేసే వ్యక్తి . ‘పదేళ్ల తర్వాత తల్లి తండ్రులయ్యారు కదా.. ఎలా ఫీల్ అవుతున్నారు?’ అని అడుగుగా.. ఉపాసన ఆ ప్రశ్నకు సమాధానం ఇలా ఇచ్చింది. “అందరు తల్లి కావడం గ్రేట్ అని ఫీల్ అవుతారు. నేను మాత్రం డబుల్ గ్రేట్ అని ఫీల్ అవుతున్నా. ఇంకా ఎప్పుడు బిడ్డకు జన్మనిస్తారు లాంటి మాటలు నా వరకు వచ్చాయి. ఏమైనా సమస్య ఉందా అని కూడా మాట్లాడుకున్నారు. అయితే, మేము అన్ని విధాల సిద్ధంగా ఉన్నపుడే బిడ్డను కనాలి అనుకున్నాం. అందుకే ఇన్నేళ్లు పట్టింది”. అంటూ చెప్పుకొచ్చింది ఉపాసన.

ఇక ఆ తర్వాత తన భర్త చరణ్ తో బాండింగ్ గురించి అడుగగా.. “రామ్ ఎపుడు కూడా ప్రేమలో పడకు, ప్రేమలో ఎదుగుదాం అంటూ ఉంటాడు. అలానే , మేము ఒకరినొకరు సపోర్ట్ చేసుకుంటాము, గౌరవించుకుంటాము, మా ఇద్దరి మధ్య హద్దులు కూడా ఉంటాయి. కెరీర్ విషయంలో ఒకరి దానిలో మరొకరం కల్పించుకోము. కానీ , వ్యక్తిగత జీవిత విషయానికొస్తే మాత్రం ఇద్దరం ఒకటిగా ఉంటాము”. అంటూ సమాధానం ఇచ్చింది ఉపాసన. ఇక ఈ ఇంటర్వ్యూలో ఉపాసన చెప్పిన మాటలు ఇప్పుడు .. సోషల్ మీడియాలో ఇంట్రెస్టింగ్ టాపిక్ గా మారాయి. మరి, ఉపాసన కొణిదెల రామ్ చరణ్ , క్లింకార గురించి చేసిన వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişmeritbetmeritbetmeritkingPradabet güncel girişcasibomJojobet GirişjojobetjojobetjojobetcasibommeritkingMadridbetPokerklasJojobet GirişjojobetHoliganbet GirişOnwin Girişdeneme bonusu veren siteler