iDreamPost
android-app
ios-app

మూవీ ఒకటే కానీ వేర్వేరు థియేటర్స్ లో వేర్వేరు క్లైమాక్స్ లు !

  • Published May 28, 2025 | 12:03 PM Updated Updated May 28, 2025 | 12:03 PM

జూన్ 6 నుంచి బాలీవుడ్ మూవీ ' హౌస్ ఫుల్ 5' అనే మూవీ రిలీజ్ కాబోతుంది. సినిమా రిలీజ్ అవ్వడంతో వింత ఏమి లేదు కానీ.. ఏ సినిమా రిలీజ్ చేయడంలోనే ఓ కొత్త రకం రూట్ ను ఎంచుకున్నారు మేకర్స్. ఈ సినిమాకు రెండు క్లైమాక్స్ లు షూట్ చేసి కొన్ని థియేటర్లలో ఒకటి, ఇంకొన్ని థియేటర్స్ లో వేరొకటి ప్రదర్శించబోతున్నారట.

జూన్ 6 నుంచి బాలీవుడ్ మూవీ ' హౌస్ ఫుల్ 5' అనే మూవీ రిలీజ్ కాబోతుంది. సినిమా రిలీజ్ అవ్వడంతో వింత ఏమి లేదు కానీ.. ఏ సినిమా రిలీజ్ చేయడంలోనే ఓ కొత్త రకం రూట్ ను ఎంచుకున్నారు మేకర్స్. ఈ సినిమాకు రెండు క్లైమాక్స్ లు షూట్ చేసి కొన్ని థియేటర్లలో ఒకటి, ఇంకొన్ని థియేటర్స్ లో వేరొకటి ప్రదర్శించబోతున్నారట.

  • Published May 28, 2025 | 12:03 PMUpdated May 28, 2025 | 12:03 PM
మూవీ ఒకటే కానీ వేర్వేరు థియేటర్స్ లో వేర్వేరు క్లైమాక్స్ లు !

వింతల్లో ఇదొక కొత్త వింత అని అనుకోవచ్చేమో. జూన్ 6 నుంచి బాలీవుడ్ మూవీ ‘ హౌస్ ఫుల్ 5’ అనే మూవీ రిలీజ్ కాబోతుంది. సినిమా రిలీజ్ అవ్వడంతో వింత ఏమి లేదు కానీ.. ఏ సినిమా రిలీజ్ చేయడంలోనే ఓ కొత్త రకం రూట్ ను ఎంచుకున్నారు మేకర్స్. ఈ సినిమాకు రెండు క్లైమాక్స్ లు షూట్ చేసి కొన్ని థియేటర్లలో ఒకటి, ఇంకొన్ని థియేటర్స్ లో వేరొకటి ప్రదర్శించబోతున్నారట. పైగా రెండు వెర్షన్స్ కు విడి విడిగా సెన్సార్ చేయించడం విశేషం.

ప్రపంచంలోనే మొట్టమొదటి సారి ఇలాంటి ప్రయోగం జరుగుతుంది. అయితే ఎక్కడ ఏ క్లైమాక్స్ ప్లే అవుతుందో సినిమా చేసేవరకు తెలియదట. ఏ క్లైమాక్స్ బావుందో తెలియాలంటే కచ్చితంగా రెండు థియేటర్స్ లో సినిమాను చూడాల్సిందే. ఇలా రెండు క్లైమాక్స్ లో తీయడం కొత్త కానీ .. వాటిని ఒకేసారి రిలీజ్ చేయడం విశేషం. గతంలో షోలే క్లైమాక్స్ సీన్ ని రెండు రకాలుగా తీసిన సంగతి తెలిసిందే. ఓ క్లైమాక్స్ లో అంజాద్ ఖాన్ ని సంజీవ్ కుమార్ చంపే సీన్ ఉంటే మరొకటి అంజాద్ ఖాన్ ని పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా ఉంటుంది. ఈ డిఫరెన్స్ యుట్యూబ్ లో కనిపిస్తుంది. అలాగే వారసుడు సినిమా క్లైమాక్స్ లో ఓ దానిలో కృష్ణ చనిపోయినట్లుగా ఉంటె మరొక దానిలో కృష్ణను అరెస్ట్ చేసినట్లుగా చూపిస్తారు. ఇలా కొన్ని ఉదాహరణలు అయితే ఉన్నాయి.

కానీ ఇలా ఒకేసారి రెండు వేర్వేరు క్లైమాక్స్ లతో వేర్వేరు థియేటర్స్ లో రిలీజ్ అవుతున్న సినిమా మాత్రం ఇదే అని చెప్పొచ్చు. ఈ సినిమాలో అక్షయ్ కుమార్, అభిషేక్ బచ్చన్, రితీష్ దేశముఖ్, జాక్వలిన్ ఫెర్నాండేజ్ లాంటి పెద్ద పెద్ద క్యాస్టింగ్ నటించారు. కథలో అసలు హంతకుడు ఎవరో తెలుసుకోవడమే ట్విస్ట్ అంటే.. దానిమీదే రెండు ట్విస్ట్స్ ఇంకో పెద్ద సస్పెన్స్. ఇక ఈ టీం చేసిన ప్రయోగం ఎలాంటి రెస్పాన్స్ తీసుకుని వస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.