iDreamPost
android-app
ios-app

సలార్ రాకపోతే.. ఆ డేట్ మాకు కావాలంటున్న స్టార్స్!

  • Author ajaykrishna Updated - 11:41 AM, Sat - 2 September 23
  • Author ajaykrishna Updated - 11:41 AM, Sat - 2 September 23
సలార్ రాకపోతే.. ఆ డేట్ మాకు కావాలంటున్న స్టార్స్!

సలార్.. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ – డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న మూవీ ఇది. దాదాపు ఏడాది కాలంగా ఈ సినిమా కోసం ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్నారు. కేజీఎఫ్ ఫేమ్ హోంబలే ఫిలిమ్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్న సలార్.. సెప్టెంబర్ 28న వరల్డ్ వైడ్ రిలీజ్ చేయబోతున్నట్లు ఇదివరకే మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. రిలీజ్ డేట్ ని మళ్లీ మళ్లీ గుర్తు చేస్తూ పోస్టర్స్ వదిలారు. రీసెంట్ గా సలార్ నుండి టీజర్ కూడా రిలీజ్ చేసి.. ఫ్యాన్స్ లో హైప్, అంచనాలను ఒక్కసారిగా తారాస్థాయికి చేర్చారు. సరే అని ఫ్యాన్స్ కూడా.. సెప్టెంబర్ వచ్చేసిందని సలార్ ని సోషల్ మీడియా వేదికగా నెక్స్ట్ లెవెల్ లో ప్రమోట్ చేస్తున్నారు.

ఒక విధంగా మేకర్స్ చెప్పకపోయినా.. ట్రైలర్ గురించి కూడా ఫస్ట్ వీక్ లో రాబోతుందని ప్రచారం చేశారు. కట్ చేస్తే.. ఫ్యాన్స్, సలార్ కోసం వెయిట్ చేస్తున్న ప్రేక్షకులు అందరు షాక్ అయ్యేలా ఓ న్యూస్ బయటికి వచ్చింది. సలార్ నుండి ట్రైలర్ రావట్లేదని.. సినిమాకు సంబంధించి గ్రాఫిక్స్ వర్క్ ఇంకా పూర్తి కాలేదని.. ట్రైలర్ తో పాటు సినిమా రిలీజ్ కూడా వాయిదా పడే అవకాశం ఉందంటూ జోరుగా వార్తలు మొదలయ్యాయి. గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ ఉండటం వల్లనే మేకర్స్ ఇంకా ట్రైలర్ డేట్ కూడా అనౌన్స్ చేయలేదు.. ఇప్పటిదాకా ఒక్క సాంగ్ కూడా వదలలేదు అని ఇంకొందరు సినీ విశ్లేషకులు ప్రచారం మొదలు పెట్టారు. దీంతో ఎన్నో ఆశలతో ఉన్న సలార్ ఫ్యాన్స్ ఒక్కసారిగా చతికిలపడిపోయారు.

ప్రస్తుతం సలార్ మేకర్స్ మౌనం చూస్తుంటే.. బయట జరుగుతున్న ప్రచారం అంతా నిజమే అనిపిస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. ఇలాంటి తరుణంలో సినిమా వాయిదా పడేలా ఉందని టాక్ నడుస్తుండగా.. కొత్తగా వేరే సినిమాల కబుర్లు ప్రేక్షకులను ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి. అదేంటంటే.. ఒకవేళ సెప్టెంబర్ 28న రావాల్సిన సలార్ వాయిదా పడితే.. దాని స్థానంలో.. అంటే అదే డేట్ కి తమ సినిమాలు రిలీజ్ చేసే ఆలోచన చేస్తున్నారట మేకర్స్, హీరోలు. ఇంతకీ సలార్ డేట్ కోసం ఏయే సినిమాలు ఆసక్తిగా ఉన్నాయంటే.. రవితేజ నటించిన టైగర్ నాగేశ్వరరావు, నందమూరి బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరి పేర్లు ప్రస్తుతం వినిపిస్తున్నాయి. మరి సలార్ నుండి ఏదైనా క్లారిటీ వస్తే.. ఆరోజున ఏయే సినిమాలు వస్తాయో తెలిసే అవకాశం ఉంది. లేదు సలార్ గురించి జరుగుతుంది అంతా అసత్య ప్రచారం అనంటే.. ఎప్పటిలాగే సినిమాలు వస్తాయి అని సమాచారం. మరి సలార్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet Girişdeneme bonusuDeneme Bonusu Veren SitelermeritkingDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomtimebetjojobet girişbahiscasinoMariobetMariobetMadridbetMadridbetcasibomgrandpashabet girişJojobetgrandpashabetcasibomcasibomultrabetgrandpashabetultrabetgrandpashabet girişcasinoroyalbetciograndpashabet girişcasibom girişgrandpashabet girişgrandpashabetgrandpashabetholiganbet