iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇండస్ట్రీలో ఇప్పుడు క్రేజీ హీరోయిన్!

  • Published Aug 07, 2024 | 5:58 PM Updated Updated Aug 07, 2024 | 5:58 PM

Pic Talk: పై ఫోటోలో పెళ్లికూతురి అలంకరణలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు ఈమె ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా అలరిస్తుంది. ఇంతకీ ఎవరో కనిపెట్టారా..

Pic Talk: పై ఫోటోలో పెళ్లికూతురి అలంకరణలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు ఈమె ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా అలరిస్తుంది. ఇంతకీ ఎవరో కనిపెట్టారా..

  • Published Aug 07, 2024 | 5:58 PMUpdated Aug 07, 2024 | 5:58 PM
ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇండస్ట్రీలో ఇప్పుడు క్రేజీ  హీరోయిన్!

వెండితెర పై నటించాలనే ఆసక్తి, టాలెంట్, పట్టుదల ఈ మూడు ఉండేలే కానీ.. ఇండస్ట్రీలో ఎలాంటి వారైనా ఈజీగా క్లిక్ అవుతారు. కాకపోతే ఈ సినీ ఇండస్ట్రీలో కెరీర్ అప్స్ డౌన్ అనేది చాలా కామన్. ఈరోజు క్రేజీ నటి, నటులుగా రాణించినవారు కొన్ని రోజులకు ఆఫర్స్ తక్కువై సినిమాల్లో కనుమరుగవుతారు. కానీ, హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా.. పాత్ర ఏదైనా సరే ప్రతిభ ముఖ్యం అనుకునే వారికి ఇండస్ట్రీలో అవకాశాలకు ఎప్పుడు కొదవ ఉండదు. మరీ, కెరీర్ లో హిట్, ఫ్లాప్ లతో సంబంధం లేకుండా సుదీర్ఘకాలంగా రాణిస్తున్న ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. ఇప్పుడు ఈమె  ఇండస్ట్రీలో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో క్రేజీ హీరోయిన్ గా అలరిస్తుంది. ఇంతకీ ఎవరో కనిపెట్టారా.

పై ఫోటోలో పెళ్లికూతురి అలంకరణలో కనిపిస్తున్న ఈ చిన్నారి ఇప్పుడు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్. ఇక ఈ అమ్మడి అందంకు చాలామంది ఫిదా అవుతుంటారు.అయితే పేరుకు తెలుగు నటి అయిన ఈ బ్యూటీ తమిళ్ లో మంచి ఫేమ్ ను సంపాదించుకుంది. అంతేకాకుండా.. అక్కడ ఎక్కువ సినిమాల్లో అలిరించింది. ఇప్పటికే ఈమె ఎవరో గుర్తుపట్టే ఉంటారు. ఆమె మరెవరో కాదు.. తెలుగుమ్మాయి ‘అంజలి‘. ఈమె మొదటిగా తూర్పు గోదావరి జిల్లా, మామిడికుదురు మండలం, మొగలికుదురు గ్రామంలోని 1986 సెప్టెంబర్ 11వ తేదీన జన్మించింది. ఈమెకు ఇద్దరు అన్నలు, ఒక అక్క ఉన్నారు. తల్లిదండ్రులు ఉపాధి రీత్యా వేరే దేశంలో ఉంటున్నారు. పదవ తరగతి వరకు అక్కడే చదువుకున్న అంజలి తర్వాత చెన్నైకు మకాం మార్చింది. అయితే అక్కడ ఓ వైపు డిగ్రీ చదువుతూ.. మరో వైపు నటన మీద ఆసక్తితో షార్ట్ ఫిల్మిస్ లో నటించింది.

anjali pic talk

ఈ క్రమంలోనే.. ఈమె మొదటిగా తమిళంలో ‘డేర్’ అనే సినిమాలో నటించింది. ఇక ఆ సినిమా తర్వాత తెలుగులో 2006లో వచ్చిన ‘ఫోటో’ అనే సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది. ఇక ఆ సినిమా తర్వాత ‘ప్రేమలేఖ రాశా’ అనే సినిమాలో కూడా నటించింద. అయితే ఈ బ్యూటీ అందం, నటన అన్ని బాగున్న ఆ సినిమాలేవీ అంజలికి మంచి గుర్తింపు తెచ్చిపెట్టలేక పోయాయి. కానీ, అమ్మడు నటనకు మాత్రం మంచి మార్కులు పడ్డాయి. దీంతో మళ్లీ కోలివుడ్ కు మకాం మార్చిన అంజలి అక్కడే మంచి గుర్తిపు తెచ్చుకుంటూ వరుస సినిమాలు చేసింది. ఈ నేపథ్యంలోనే.. 2012లో అంజలికి ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాతో సీతగా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక ఈ సినిమా సూపర్ హిట్ అందుకోవడమే కాకుండా.. అంజలి నటనకు మంచి మార్కులు పడ్డాయి.

దీంతో వరుసగా అటు తమిళ్ తో పాటు తెలుగులో అంజలి బలుపు, మసాలా, గీతాంజలి, శంకరాభరణం, నియంత,సరైనోడు, చిత్రాంగద వంటి సినిమాల్లో నటించింది. అయితే మధ్యలో తెలుగు ఆఫర్లు తగ్గిన అంజలికి మళ్లీ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో ఫుల్ క్రేజ్ అందుకుంది. ఈ నేపథ్యంలోనే మళ్లీ తెలుగులో.. మాచర్ల నియోజకవర్గం, గీతాంజలి మళ్లీ వచ్చిది, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి వంటి బ్యాక్ టూ బ్యాక్ సినిమాలతో దూసుకుపోతుంది. అలాగే మరోవైపు డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ కు భార్యగా అంజలి నటిస్తుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం ఆమె చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చూసిన నటిజన్స్ చిన్నప్పుడు కూడా అంజలి ఎంతో అందంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరీ, ప్రస్తుతం అంజలి చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet