iDreamPost
android-app
ios-app

Anil Ravipudi: IPL మ్యాచ్ లపై కామెంట్స్.. స్టార్ డైరెక్టర్ పై నెటిజన్ల ఆగ్రహం!

  • Published May 02, 2024 | 11:38 AM Updated Updated May 02, 2024 | 11:38 AM

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డైరెక్షన్ తో పాటు తనదైన కామెడీ మాటలతో అందరిని అల్లరిస్తుంటారు. అయితే తాజాగా ఆయన క్రికెట్ పై చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డైరెక్షన్ తో పాటు తనదైన కామెడీ మాటలతో అందరిని అల్లరిస్తుంటారు. అయితే తాజాగా ఆయన క్రికెట్ పై చేసిన వ్యాఖ్యలకు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

  • Published May 02, 2024 | 11:38 AMUpdated May 02, 2024 | 11:38 AM
Anil Ravipudi: IPL మ్యాచ్ లపై  కామెంట్స్.. స్టార్ డైరెక్టర్ పై నెటిజన్ల ఆగ్రహం!

సెలబ్రిటీలు ఎవరైనా.. వారు చేసే వ్యాఖ్యలు ఒకటి వంద సార్లు ఆలోచించుకుని మాట్లాడాలి. కారణం.. వారు చేసే వ్యాఖ్యలు ఎంతో మందిపై ప్రభావం చూపిస్తాయి. అంతేకాక కొందరి మనోభావాలు దెబ్బతిని రచ్చ చేసే అవకాశం ఉంది. ఏ సెలబ్రిటీ అయిన సరే కావాలని వ్యాఖ్యలు చేయకపోయినా.. కొన్ని సార్లు అవి మిస్ పైర్ అవుతుంటాయి. ఇప్పటికే అలా ఎంతో మంది సినీ, రాజకీయ ప్రముఖులు వివాదాల్లో చిక్కుకున్నారు. మరికొందరు నెటిజన్ల ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా టాలీవుడ్ యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి వార్తల్లో నిలిచారు. ఐపీఎల్ మ్యాచ్ లపై అనిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇక ఈ డైరెక్టర్ పై కొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అసలు స్టోరీ ఏమిటో ఇప్పుడు చూద్దాం..

యంగ్ హీరో సత్యదేవ్, అతీరా రాజ్ జంటగా నటించిన చిత్రం ‘కృష్ణమ్మ’. ఈ  మూవీని వీవీ గోపాలకృష్ణ తెరకెక్కించగా..స్టార్ డైరెక్టర్ కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ పై కృష్ణ కొమ్మాలపాటి నిర్మించారు. ఈ  సినిమా మే 10 ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్లు చిత్ర యూనిట్ బిజీగా ఉంది. తరచూ వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తూ..సినిమాపై ప్రేక్షకులు ఎంతో ఆసక్తిని పెంచుతున్నారు. ఇప్పటికే విడులైన ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. కృష్ణమ్మ మూవీ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో బుధవారం చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్  వేడుకను నిర్వహించింది. ఈ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌కి స్టార్ డైరెక్టర్లు ఎస్ఎస్ రాజమౌళి, కొరటాల శివ, అనిల్ రావిపూడి, గోపిచంద్ మలినేని ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సినిమా గురించి అందరూ  అనేక విషయాలను చెప్పారు.

అలానే ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ… కృష్ణమ్మ సినిమా గురించి అందులోని నటీనటులు, డైరెక్టర్ గురించి అనేక విషయాలను చెప్పాడు. సత్యదేవ్‌ చిన్న చిన్న పాత్రలతో  తన సినీ కెరీర్‌ని ప్రారంభించి.. హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారని అన్నారు. ఏ కథకైనా, పాత్రకైనా ఆయన కటౌట్‌, వాయిస్‌ బాగా సెట్‌ అవుతుంని అనిల్ తెలిపారు. ఈ సినిమా చాలా బాగుంటుందని, అందరు ఫ్యామిలీతో కలిసి వెళ్లి చూడలని తెలిపారు. ఇదే సమయంల అనిల్ రావిపూడి క్రికెట్ గురించి కామెంట్స్ చేశారు.

 ఐపీఎల్ మ్యాచ్‌లు 2-3 రోజులు చూడకుంటే కొంపలేం మునిగిపోవని అన్నాడు. అంతేకాక ఫస్ట్ షో, సెకండ్ షో సినిమాలకు అందరూ రావాలని విజ్ఞప్తి చేశాడు. క్రికెట్ స్కోర్‌ను మీ ఫోన్లలో కూడా చూసుకోవచ్చని చెప్పొకొచ్చారు. ఇక అనిల్ రావిపూడి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అనిల్‌పై క్రికెట్ అభిమానులు, నెటిజన్స్ మండిపడుతున్నారు. అంతేకాక అనిల్ కి రివర్స్ కౌంటర్ కూడా ఇస్తున్నారు సినిమాలు కూడా నెల రోజుల్లో ఓటీటీ, టీవీల్లో వస్తాయి కదా?.. అప్పుడు చూస్తాములే అంటూ కామెంట్స్ పెడుతున్నారు. ఇతరుల ఇష్టాయిష్టాలను కించపరచడం కరెక్ట్ కాదని  పలువురు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Jojobet Girişjojobetjojobet güncel girişMadridbetjojobetJojobetMadridbetjojobetJojobetBetsmovefixbetjojobetsüpertotobetsüpertotobetjojobetjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetciobetcioGrandpashabetHoliganbetHoliganbetHoliganbetjojobetjojobetjojobet girişgrandpashabet