iDreamPost
android-app
ios-app

ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల క్రష్ గా మారింది

  • Published Aug 13, 2024 | 8:30 PM Updated Updated Aug 13, 2024 | 8:30 PM

Pic Talk: పై ఫోటోలో ఉన్న ఈ క్యూట్ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..ఇండస్ట్రీలో ఈమె ఒక క్రేజీ హీరోయిన్. ముఖ్యంగా మొదటి సినిమాతోనే కుర్రాళ్ల క్రష్ గా మారింది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా..

Pic Talk: పై ఫోటోలో ఉన్న ఈ క్యూట్ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..ఇండస్ట్రీలో ఈమె ఒక క్రేజీ హీరోయిన్. ముఖ్యంగా మొదటి సినిమాతోనే కుర్రాళ్ల క్రష్ గా మారింది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా..

  • Published Aug 13, 2024 | 8:30 PMUpdated Aug 13, 2024 | 8:30 PM
ఈ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా.. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల క్రష్ గా మారింది

గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసిన సెలబ్రీటిస్ త్రో బ్యాక్ ఫోటో ట్రెండ్ హవా ఎక్కువగా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే.. ఇన్ స్టా, ఫేస్ బుక్, యూట్యూబ్ వంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో స్టార్ హీరో, హీరోయిన్ల చిన్ననాటి ఫోటోస్ ఎక్కువగా దర్శనమిస్తున్నాయి. ఇక వీరితో పాటు అలనాటి యాక్టర్ లేటెస్ట్ ఫోటోస్ సైతం నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. అయితే వాటిలో కొన్ని సినీ తారలే వారి పుట్టిన రోజు,ఏదైనా స్పెషల్ మూమెంట్ సందర్భంగా సోషల్ మీడియాలో షేర్ చేయగా.. మరి కొన్ని ఫోటోస్ ను వారి ఫ్యాన్స్ వెతికి మరీ సామాజిక మాధ్యమాల్లో షేర్లు కొడుతూ తెగ హంగామా చేస్తుంటారు. ఇక ఎప్పటిలాగే ఈరోజు కూడా మరో క్రేజీ హీరోయిన్ చిన్ననాటి ఫోటో సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఇంతకీ పై ఫోటోలో ఉన్న ఈ క్యూట్ చిన్నారి ఎవరో గుర్తుపట్టారా..ఇండస్ట్రీలో ఈమె ఒక క్రేజీ హీరోయిన్. మొదటి సినిమాతోనే కుర్రాళ్ల క్రష్ గా మారింది. ఇంతకీ ఎవరో గుర్తుపట్టారా..

పై ఫోటోలో కనిపిస్తున్న ఈ చిన్నారి మరెవరో కాదు.. యంగ్ క్రేజీ హీరోయిన్ ‘మేఘా ఆకాష్’. ఈ పేరు ప్రేక్షకులు అందరికీ సుపరిచితమే. అయితే చూడటానికి క్యూట్ గా తెలుగమ్మాయిల కనిపించిన ఈ చిన్నాది కోలీవుడ్ కు చెందిన భామ.  ఈమె చెన్నైలోని  1995 అక్టోబర్ 26న జన్మించింది. ఇక అక్కడే మహిళా క్రిస్టియన్ కాలేజీ అయిన లేడీ ఆండల్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. కానీ చిన్నప్పటి నుంచి నటన మీద ఆసక్తితో మేఘా చదువు తర్వాత ఇంటస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ క్రమంలోనే మొదటిగా ఒరు ‘పక్క కథై’ చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. అలా మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ ముద్దుగుమ్మకు ఆ తర్వాత టాలీవుడ్ లో ఆఫర్ అందుకుంది.

Megha akash childhood photo

ఈ నేపథ్యంలోనే..  2017లోని నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘లై‘ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. కానీ, ఈ సినిమా డిజాస్టర్ కావడంతో.. మేఘాకు తెలుగులో ఆశించిన స్థాయిలో గుర్తింపు తెచ్చి పెట్టలేదు. కాకపోతే ఆ సినిమాలో అమ్మడి నటనకు, అందంకు ప్రేక్షకులచే మంచి మార్కులు పడ్డాయి. ఇక ఆ సినిమా తర్వాత మళ్లీ తెలుగులో నితిన్ సరసన ‘చల్ మోహన్ రంగ’ చేసింది. కానీ ఈ సినిమా కూడా మేఘాకు నిరాశపరిచింది. దీని తర్వాత మళ్లీ మేఘా శ్రీవిష్ణు రాజ రాజ చోర చిత్రాల్లో నటించినప్పటికీ  ఆ సినిమా కూడా మేఘాకు సక్సేస్ ను తెచ్చిపెట్టాలేకపోయింది.  దీంతో పూర్తిగా ఈ బ్యూటీ తమిళ్ సినిమాలకే పరిమితమై బిజీగా మారిపోయింది. అయితే ఇటీవలే మాస్ మహారాజా రవితేజ హీరోగా నంటించిన ‘రావణాసుర’ చిత్రంతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చింది మేఘా ఆకాశ్.

ఇక ఈ సినిమాలో తన క్యూట్ నటనతో ఆకట్టుకున్నప్పటికీ సినిమా మాత్రం హిట్ అవ్వలేదు. దీంతో వరుస ఫెయిల్యూర్స్ రావడంతో తెలుగులో ఈ చిన్నదానికి పూర్తిగా అవకాశాలు తగ్గిపోయాయి. ఇక అవకాశాలు తగ్గిపోయిన సోషల్ మీడియాలో మాత్రం ఈ అమ్మడు ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. ఈ క్రమంలోనే తనకు సంబంధించిన లేటెస్ట్ ఫిక్స్ ను షేర్ చేస్తూ ఉంటుంది. ఇదిలా ఉంటే.. తాజాగా ఈ చిన్నదాని చైల్డ్ హుడ్ ఫిక్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరీ, ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న మేఘ ఆకాశ్ చిన్ననాటి ఫోటో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet