iDreamPost
android-app
ios-app

హీరోయిన్‌గా ఛాన్స్ ఇవ్వాలంటే.. ముందు అదే అడుగుతున్నారు: నటి

  • Published Nov 08, 2023 | 7:16 PM Updated Updated Nov 08, 2023 | 7:16 PM

హీరోయిన్లుకు నేడు చాలా అవకాశాలున్నాయి. ఎంత మంది నటీ మణులు వచ్చినా.. టాలీవుడ్ పరిశ్రమ ఆహ్వానం పలుకుతూనే ఉంది. అయితే అవకాశాల కోసం గతంలో ఫోటోషూట్స్, ఆల్బమ్స్, ఆడిషన్స్ చేసేవారు. కానీ నేడు.. సోషల్ మీడియా వచ్చాక..

హీరోయిన్లుకు నేడు చాలా అవకాశాలున్నాయి. ఎంత మంది నటీ మణులు వచ్చినా.. టాలీవుడ్ పరిశ్రమ ఆహ్వానం పలుకుతూనే ఉంది. అయితే అవకాశాల కోసం గతంలో ఫోటోషూట్స్, ఆల్బమ్స్, ఆడిషన్స్ చేసేవారు. కానీ నేడు.. సోషల్ మీడియా వచ్చాక..

  • Published Nov 08, 2023 | 7:16 PMUpdated Nov 08, 2023 | 7:16 PM
హీరోయిన్‌గా ఛాన్స్ ఇవ్వాలంటే.. ముందు అదే అడుగుతున్నారు: నటి

ఒకప్పుడు పరిశ్రమలోకి రావాలనుకునే వారు ఫోటో షూట్స్‌తో ఓ ఆల్బమ్ చేయించుకుని స్టూడియోల చుట్టూ తిరిగేవారు. అదే హీరోయిన్లు అయితే ఏజెన్సీ ద్వారా వచ్చేవారు. ఆ పిక్స్ నచ్చితే ఆడిషన్స్ చేసేవారు. ఆ తర్వాత సెట్ అనుకుంటే.. సినిమాకి బుక్ చేసేవారు. ముంబయి యాక్టర్స్ అయినా మాలీవుడ్ ముద్దుగుమ్మలైనా ఇదే ప్రాసెస్. అయితే ఇప్పుడు కాలం మారింది. సోషల్ మీడియా కారణంగా అనేక మంది సినిమా అవకాశాలను పొందుతున్నారు. ఇప్పుడు మధ్యవర్తులు ఎవ్వరూ లేకపోవడంతో సినిమా ఛాన్స్ కోసం వీరినే సంప్రదిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారానే తాను ఛాన్సులు వస్తున్నాయని చెబుతోంది ఓ బ్యూటీ.

ఆమె మరెవ్వరో కాదూ.. అను కృతి వ్యాస్. టైగర్ నాగేశ్వరరావులో వేశ్య పాత్రలో కనిపించింది ఈ అమ్మడు. ఈ సినిమాలో టైగర్ నాగేశ్వరరావును చూసేందుకు ఆరాటపడి.. చివరికి అతడినే పోలీసులకు పట్టిస్తుంది. ఆ మూవీలో సహజమైన నటనతో కట్టిపడేసింది. తమిళనాడుకు చెందిన అనూ.. 2018 మిస్ తమిళనాడుతో పాటు ఆ ఏడాది మిస్ ఇండియా కిరీటాన్ని కైవసం చేసుకుంది. 2022లో విజయ్ సేతుపతి నటించిన డీఎస్పీ మూవీ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ అమ్మడు. ఆ సినిమా మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. తాజాగా టాలీవుడ్‌లో మెరిసింది. రవితేజ హీరోగా రూపొందిన టైగర్ నాగేశ్వరరావులో నటించింది. ఈ సినిమా ఈ దసరాకు విడుదలై యావరేజ్‌గా నిలిచింది.

ప్రస్తుతం వెట్ట్రి అనే సినిమాలో నటిస్తోన్న ఈమె.. సినిమా అవకాశాలపై సెన్సేషనల్ కామెంట్లు చేసింది. సోషల్ మీడియా వచ్చాక ప్రపంచం మొత్తం మారిపోయిందని, ఐదేళ్ల క్రితం సామాజిక మాధ్యమాల గురించి ఎవ్వరికి పెద్దగా తెలియదని, ఇప్పుడు దీని వాడకం విపరీతంగా పెరిగిందని పేర్కొంది. ఇప్పుడు తనకు అవకాశాలిచ్చేందుకు సంప్రదిస్తున్న వారంతా.. ముందుగా తన ఇన్ స్టా ఐడీని అడుగుతున్నారని, అందులోని తన పిక్స్ చూసి.. సినిమాలకు ఎంపిక చేస్తున్నారని చెప్పారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని పంచుకుంటున్నట్లు చెబుతోంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom