iDreamPost
android-app
ios-app

యానిమల్.. ఆ 18 నిమిషాలు థియేటర్స్ షేక్ అవుతాయట!

  • Published Nov 27, 2023 | 2:02 PM Updated Updated Nov 28, 2023 | 1:21 PM

తన స్టైల్ ఏమిటో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన తొలి చిత్రం అర్జున్ రెడ్డి తోనే వంద శాతం చూపించారు. ఇప్పుడు మరోసారి బీభత్సంగా చూపిస్తూ యానిమల్ సినిమాతో మన ముందుకి రాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్ డేట్ ఒకటొచ్చింది.

తన స్టైల్ ఏమిటో దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన తొలి చిత్రం అర్జున్ రెడ్డి తోనే వంద శాతం చూపించారు. ఇప్పుడు మరోసారి బీభత్సంగా చూపిస్తూ యానిమల్ సినిమాతో మన ముందుకి రాబోతున్నారు. ఈ సినిమాకు సంబంధించి ఆసక్తికర అప్ డేట్ ఒకటొచ్చింది.

  • Published Nov 27, 2023 | 2:02 PMUpdated Nov 28, 2023 | 1:21 PM
యానిమల్.. ఆ 18 నిమిషాలు థియేటర్స్ షేక్ అవుతాయట!

అర్జున్ రెడ్డి సినిమా గురించి టాలీవుడ్ ప్రేక్షకులు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తెలుగు చిత్ర పరిశ్రమలోనే ఈ సినిమా పలు రికార్డులను బద్దలు కొట్టింది. ఇక ఈ సినిమాతో విజయ్ దేవరకొండకు క్రేజ్ పెరిగిపోయింది. అలానే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా కూడా ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్‌ డైరెక్టర్ల లిస్టులోకి చేరిపోయారు. అర్జున్ రెడ్డి సినిమాను కబీర్‌ సింగ్‌గా హిందీలోనూ తెరకెక్కించి బ్లాక్‌ బస్టర్‌ హిట్ కొట్టారు.

తాజాగా సందీప్ రెడ్డి మరోసారి బాలీవుడ్‌లోనే తన అదృష్టం పరీక్షించుకునేందుకు రెడీ అయ్యారు. ఆయన దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక జంటగా నటిస్తోన్న సినిమా ‘యానిమల్’. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్ అందరిని  ఆకట్టుకుంది.  ఈ సినిమాకు సంబంధించిన మరో అప్ డేట్ వచ్చింది.  ఇందులో ఓ 18 నిమిషాల సీన్ కి థియేటర్స్ షేక్ అవుతాయంట.

యానిమల్ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాలో అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్, ట్రైలర్ అందరిని ఆకట్టుకున్నాయి. యానిమల్‌ ట్రైలర్‌లో ఫస్ట్ టు లాస్ట్ ఫ్రేమ్‌ ప్రతి క్షణాన్నీ తండ్రీ కొడుకుల థీమ్‌తోనే డిజైన్‌ చేశారు సందీప్‌ రెడ్డి వంగా. అర్జున్ రెడ్డిలో ప్రీతి కోసం, అయితే యానిమల్ మూవీలో తండ్రి కోసం అనే కాన్సెప్ట్ తో రానున్నాడు. ముఖ్యంగా సందీప్ రెడ్డి డిజైన్ చేసిన హీరో క్యారెక్టరైజేషన్, యాక్షన్  ఎపిసోడ్స్ యానిమల్ సినిమాలో చాలా పవర్ ఫుల్ గా ఉండబోతున్నాయని  ట్రైలర్ తోనే అర్ధమైంది.  దీంతో ఈ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. తెలుగు, హిందీ భాషల్లో అయితే కచ్చితంగా ఈ సినిమా సాలిడ్ ఓపెనింగ్స్ రాబట్టే అవకాశం ఉంది.

ఇది ఇలా ఉంటే.. ఈ సినిమాను కోలివుడ్ లో కూడా గట్టిగానే ప్రమోట్ చేస్తున్నారు. ఈ సినిమా నిర్మాత ప్రణయ్ రెడ్డి యానిమల్  ప్రమోషన్స్  ఓ రేంజ్ లో చేస్తున్నారు. ఇందులో భాగంగా  ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించారు. ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ యాక్షన్ ఎపిసోడ్ ఏకంగా 18 నిమిషాల పాటు ఉంటుందని తెలిపాడు. ఈ మొత్తం ఎపిసోడ్ ప్రేక్షకులను ఊపిరి బిగపట్టుకునేలా  చేస్తుందని చెప్పుకొచ్చారు.

ట్రైలర్ లో చూసిన విధంగానే ఎంతో ఆసక్తికరంగా ఉంటుందని తెలిపారు. ముఖ్యంగా బాబీ డియోల్, రణబీర్ కపూర్ మధ్య వచ్చే సంభాషణలు అద్భుతంగా ఉంటాయని నిర్మాత వెల్లడించారు. కచ్చితంగా యాక్షన్ ఎలిమెంట్స్ అందరికి నచ్చుతాయని ప్రణయ్ రెడ్డి మీడియా ద్వారా తెలిపారు. ఇక యానిమల్ సినిమా ప్రొడ్యూసర్ చెప్పిన ప్రకారం చూస్తే.. సినిమా ఓ రేంజ్ లో ఉండబోతుందని అర్థమవుతుంది.

ముఖ్యంగా ఆ 18 నిమిషాల యాక్షన్ ఎపిసోడ్ అంటే కచ్చితంగా మరోస్థాయిలో ఉంటుందని ఊహించుకోవచ్చు. మరి ప్రేక్షకులు ఈ హైవోల్టేజ్ యాక్షన్ ని ఎలా రిసీవ్ చేసుకుంటారు అనేది ఇప్పుడు అందరిలో ఆసక్తికరంగా మారింది. రణబీర్ కపూర్ ని కూడా ఇప్పడి వరకు ఎన్నడూ చేయని కొత్త పాత్రలో నటిస్తున్నారు. రణబీర్ విషయంలో బాలీవుడ్ ఆడియన్స్ దీనిని ఎలా యాక్సెప్ట్ చేస్తారనేది చూడాల్సి ఉంది. మరి.. యానిమల్ మూవీ నిర్మాత చెప్పిన విషయాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetJojobetjojobetjojobetJojobetZirvebetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişjojobet giriş