iDreamPost
android-app
ios-app

టామ్ బాయ్‌లా కనిపిస్తున్నఈ పాప.. ఇప్పుడు ట్రెండీ హీరోయిన్

  • Published Feb 12, 2024 | 5:10 PM Updated Updated Feb 12, 2024 | 5:10 PM

కొంత మంది పేరెంట్స్ అమ్మాయిలను కూడా అబ్బాయిల్లా పెంచుతుంటారు. జుట్టు పెంచకుండా కట్ చేయించి.. టామ్ బాయ్‌లా తయారు చేస్తుంటారు. అప్పట్లో అలా సరదా తీర్చుకునే వారు తల్లిదండ్రులు. ఇదిగో ఈ హీరోయిన్ తల్లిదండ్రులు కూడా.

కొంత మంది పేరెంట్స్ అమ్మాయిలను కూడా అబ్బాయిల్లా పెంచుతుంటారు. జుట్టు పెంచకుండా కట్ చేయించి.. టామ్ బాయ్‌లా తయారు చేస్తుంటారు. అప్పట్లో అలా సరదా తీర్చుకునే వారు తల్లిదండ్రులు. ఇదిగో ఈ హీరోయిన్ తల్లిదండ్రులు కూడా.

  • Published Feb 12, 2024 | 5:10 PMUpdated Feb 12, 2024 | 5:10 PM
టామ్ బాయ్‌లా కనిపిస్తున్నఈ  పాప.. ఇప్పుడు ట్రెండీ హీరోయిన్

మిస్ ఇండియా, మిస్ వరల్డ్ వంటి అందాల పోటీల్లో పాల్గొన్న చాలా మంది అమ్మాయిలు ఆ తర్వాత సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి సత్తా చాటారు. ఐశ్వర్యరాయ్, సుస్మితా సేన్, లారా దత్తా అందుకు ఉదాహరణ. విన్నర్స్ కాకపోయినా బ్యూటీ కంటెస్టులో సందడి చేసి.. పరిశ్రమలోకి అడుగుపెట్టిన అమ్మాయిలు కూడా ఉన్నారు. అలాంటి వారిలో ఇదిగో ఈ ఫోటోలో కనిపిస్తున్న బుడ్డది కూడా. చూడటానికి మగ పిల్లవాడిలా కనిపిస్తున్న ఈమె.. ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంటుంది. చేసినవే తక్కువ సినిమాలే అయినా.. బడా ప్రాజెక్టుల్లో భాగస్వామ్యం అవుతుంది. ఇప్పుడు మరో పాన్ ఇండియా మూవీలో నటించబోతుంది.

ఈ పిక్ లో టామ్ బాయ్ దుస్తుల్లో నిలుచున్న పాప ఎవరో తెలుసా..? ఒక్క సినిమాతో టాప్ హీరోలను లైన్లో పెట్టేస్తుంది. ఈమె మిస్ ఇండియా పోటీల్లో కూడా పాల్గొంది. ఫైనల్ వరకు వెళ్లి.. రన్నరప్‏తో సరిపెట్టుకుంది. తెలుగు ఇండస్ట్రీ ఈమెను గుర్తించి.. లైఫ్ ఇచ్చేద్దామని ఇక్కడకు తెచ్చేసింది. ఇంకేముంది.. వరుసగా సినిమా ఆఫర్లు. వాటిల్లో చూసీగా సెలెక్ట్ చేసుకుని హిట్స్ అందుకుంటోంది. ఇంతకు ఆ అమ్మాయి ఎవరంటే.. ‘ఉరికే ఉరికే మనసే ఉరికే’అంటూ అడవి శేష్ హృదయాన్నే కాదూ టాలీవుడ్ అభిమానుల్ని సొంతం చేసుకున్న మీనాక్షి చౌదరి. ఈ ఫోటోలో ఉంది అంటే అంటే అస్సలు నమ్మరు కదూ.. కానీ ఆమెనే. 2018లో మిస్ ఇండియా పోటీల్లో రన్నరప్ గెలుచుకుంది. హిందీలో ఓ మూవీలో గెస్ట్ అప్పీయరెన్స్ ఇచ్చిన ఈ బ్యూటీ.. ఆ తర్వాత నేరుగా తెలుగులోకి అడుగుపెట్టింది.

ఇచ్చట వాహనాలు నిలుపరాదు ఆమెకు తొలి సినిమా. ఈ మూవీ హిట్ కాకపోయినా.. కిలాడీ ఒకే అనిపించింది. పేరు వచ్చింది మాత్రం హిట్. ఇందులో అడవి శేష్ ప్రేయసిగా కనిపిస్తుంది. ఆ తర్వాత తమిళ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది ఈ అందాల సుందరి. ఇటీవల వచ్చిన గుంటూరు కారం మూవీలో మహేష్ పక్కన ఆడిపాడిన అమ్మడు..వరుస ఛాన్సులు కొల్లగొడుతోంది. ఇప్పుడు ఆమె చేతిలో నాలుగు ఐదు సినిమాలున్నాయి. మట్కాతో పాటు దుల్కర్ పాన్ ఇండియా మూవీ లక్కీ భాస్కర్, విశ్వక్ సేన్, ఇతర హీరోలతో జతకట్టబోతుంది. మీనాక్షి మూవీల్లో మీకు ఏదీ ఇష్టమో కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişCasibomgrandpashabet