iDreamPost
android-app
ios-app

Namrata Shirodkar: సినిమాలలోకి నమ్రతా రీ ఎంట్రీ ! ఎంత వరకు నిజం ?

  • Published Jul 10, 2024 | 9:12 AM Updated Updated Jul 10, 2024 | 9:12 AM

టాలీవుడ్ లో ఈ కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిని చూసి ప్రతి ఒక్కరు ముచ్చట పడాల్సిందే. వారు మరెవరో కాదు మహేష్ కుటుంబం. అయితే మహేష్ సతీమణి నమ్రత మళ్ళీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తుంది. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

టాలీవుడ్ లో ఈ కుటుంబం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిని చూసి ప్రతి ఒక్కరు ముచ్చట పడాల్సిందే. వారు మరెవరో కాదు మహేష్ కుటుంబం. అయితే మహేష్ సతీమణి నమ్రత మళ్ళీ ఇండస్ట్రీలో ఎంట్రీ ఇవ్వనున్నట్లు టాక్ వినిపిస్తుంది. దానికి సంబంధించిన విషయాలు చూసేద్దాం.

  • Published Jul 10, 2024 | 9:12 AMUpdated Jul 10, 2024 | 9:12 AM
Namrata Shirodkar: సినిమాలలోకి నమ్రతా రీ ఎంట్రీ ! ఎంత వరకు నిజం ?

సూపర్ స్టార్ మహేష్ బాబు సతీమణి .. నమ్రత శిరోద్కర్ గురించి అందరికి తెలిసిందే. ఒకప్పడు ఆమె కూడా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ , మోడల్ కూడా. ఎన్నో బ్యూటీ కాంపిటిషన్స్ లో పాల్గొని ఎన్నో అవార్డ్స్ ను సొంతం చేసుకున్నారు నమ్రత. 1998 లో బాలీవుడ్ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన నమ్రత.. అది తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్ గా.. క్రేజ్ సంపాదించుకుని.. తన కంటూ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్నారు. అయితే చాలా మంది హీరోయిన్స్ లానే నమ్రత కూడా పెళ్లి తర్వాత సినిమాలకు దూరం అయిపోయారు. ఇక ఇప్పుడు ఇన్నేళ్లకు మళ్ళీ నమ్రత ఇండస్ట్రీకి రీఎంట్రీ ఇస్తున్నారంటూ టాక్ వినిపిస్తుంది. దీనిలో ఎంత వరకు నిజం ఉంది. పూర్తి వివరాలను చూసేద్దాం.

మొదట్లో బాలీవుడ్ లో బిజీ బిజీగా ఉన్న నమ్రత శిరోద్కర్. తెలుగులో మహేష్ బాబు , మూవీలో ఛాన్స్ రావడంతో టాలీవుడ్ లో కూడా పరిచయం అయింది. ఆ తర్వాత చిరంజీవితో తో పాటు అంజి మూవీలో కూడా నటించి ప్రేక్షకులకు దగ్గరైంది నమ్రత. తెలుగులో నమ్రత తీసిన సినిమాలు తక్కువే అయినా కూడా.. తెలుగు ప్రేక్షకుల మదిలో మాత్రం నమ్రతకు ప్రత్యేకమైన స్థానమే ఉంది. ఆమె కెరీర్ పీక్స్ లో ఉన్నప్పుడే మహేష్ బాబు తో ప్రేమ వివాహం జరిగింది. ఇక పెళ్ళి తర్వాత నమ్రత పూర్తిగా సినిమాలకు దూరం అయిపోయారు. అయినా కానీ సోషల్ మీడియాలో మాత్రం నిత్యం యాక్టివ్ గానే ఉంటూ.. తనకు సంబంధించిన అప్ డేట్స్ ఇస్తూ ఉంటారు. అలాగే మహేష్ , నమ్రతల పిల్లలు గౌతమ్ , సితారా గురించి తెలియనిది కాదు. నిత్యం వీరికి సంబంధించిన ఎదో ఒక వార్తా సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే ఉంటుంది. అయితే, ప్రస్తుతం నమ్రత గురించి సోషల్ మీడియాలో ఓ వార్త వినిపిస్తుంది.

ప్రస్తుతం నమ్రత మహేష్ కు సంబంధించిన అన్ని విషయాలలోను శ్రద్ద వహిస్తూ.. కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ బిజీ బిజీగా ఉన్నారు. అయితే ఆమె మళ్ళీ సినిమాలలో ఎంట్రీ ఇస్తున్నారంటూ.. సోషల్ మీడియాలో టాక్ వినిపిస్తుంది. దాదాపు 20 ఏళ్ళ తర్వాత ఆమె సినిమాలలో ఎంట్రీ ఇవ్వనున్నారు. ప్రముఖ ఫ్యామిలీ కి చెందిన యువ నటుడి సినిమాలో ఆమె మెయిన్ క్యారక్టర్ లో నటించనున్నారని సమాచారం. పైగా ఈసారి నెగెటివ్ షేడ్స్ లో కనిపించనున్నారట నమ్రత. దీనిలో ఎంత వరకు నిజం ఉందొ తెలియదు కానీ.. ఒకవేళ రీ ఎంట్రీ ఇస్తే మాత్రం కచ్చితంగా నమ్రత కెరీర్ లో.. ఇది మంచి కం బ్యాక్ అవుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు. ప్రస్తుతం ఈ వార్తలు మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ విషయంపై ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetşanlıurfa konteynerGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobetjojobetbetwooncasibomcasibomcasibombetcio giriş