iDreamPost
android-app
ios-app

రాజా సాబ్ నుండి ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్! మారుతి మామూలోడు కాదుగా!

  • Published Apr 30, 2024 | 1:05 PM Updated Updated Apr 30, 2024 | 1:05 PM

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్- మారుతి కాంబోలో వస్తున్న చిత్రం రాజా సాబ్. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అభిమానులకు పండుగ లాంటి వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే..

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్- మారుతి కాంబోలో వస్తున్న చిత్రం రాజా సాబ్. ఈ సినిమా షూటింగ్ వేగంగా జరుపుకుంటోంది. ఈ సందర్భంగా అభిమానులకు పండుగ లాంటి వార్త ఒకటి బయటకు వచ్చింది. అదేంటంటే..

  • Published Apr 30, 2024 | 1:05 PMUpdated Apr 30, 2024 | 1:05 PM
రాజా సాబ్ నుండి ప్రభాస్ ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్! మారుతి మామూలోడు కాదుగా!

కల్కి మూవీ కంప్లీట్ చేసి.. రాజా సాబ్ షూటింగ్ షురూ చేశాడు గ్లోబల్ స్టార్.. డార్లింగ్ ప్రభాస్. ఈ సంక్రాంతి సందర్భంగా రాజా సాబ్ టైటిల్ ఎనౌన్స్ చేసిన సంగతి విదితమే. ఇందులో యంగ్ రెబల్ స్టార్‌ను కంప్లీట్ ఫ్యామిలీ లుక్స్ లో చూసుకుని మురిసిపోయారు డై హార్ట్ ఫ్యాన్స్. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుందని టాక్. మారుతి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై టీజీ విశ్వ ప్రసాద్, వివేక్ కూచి బొట్ల నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది మూవీని రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. నిథి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. వరలక్ష్మీ శరత్ కుమార్, యోగి బాబు, సప్తగిరి, బ్రహ్మానందం తదితరులు కీలక పాత్ర పోషిస్తున్నారు.

ఇప్పటికే 50 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ మూవీ నుండి కొత్త అప్డేట్ వచ్చింది. ప్రస్తుతం ఈ సినిమాలో ఓ సాంగ్ షూటింగ్ జరుపుకొంటోంది. అందులో విశేషముంది అనుకుంటున్నారా.. మాస్ డ్యాన్సులకు కాలు కదపనున్నాడట మన డార్లింగ్. చాలా రోజుల తర్వాత అదిరిపోయే స్టెప్స్ వేయబోతున్నాడట. ముగ్గురు భామలతో కలిసి చిందులేయనున్నట్లు తెలుస్తోంది. నిధి అగర్వాల్, మాళవిక, రిద్ది కుమార్‌తో కలిసి ప్రభాస్ డ్యాన్స్ చేస్తున్నాడట. ఇది సినిమాలో ఈ పాట స్పెషల్ అట్రాక్షన్‌గా మారనున్నట్లు తెలుస్తోంది. మారుతి, డ్యాన్స్ మాస్టర్స్ మాస్ స్టెప్స్ డిజైన్ చేశారట. ఈ పాటలో డిఫరెంట్ ప్రభాస్ చూడబోతున్నారని టాక్. ఇది నిజమైతే.. అభిమానులకు పండుగ. కొన్ని సంవత్సరాల నుండి ప్రభాస్‌ను ఓ మాస్ సాంగ్‌లో చూడాలని అనుకుంటున్నారు ఫ్యాన్స్.

ప్రభాస్ అంటే కేవలం ఫైట్స్ మాత్రమే కాదు.. డ్యాన్సులతో కూడా దుమ్ము లేపుతాడు. కానీ బాహుబలి సినిమా షూటింగ్ సమయంలో మోకాలి నొప్పి సమస్య ఏర్పడింది. అప్పటి నుండి కాస్త డ్యాన్సులకు దూరంగానే ఉంటున్నాడు. సలార్ మూవీ షూటింగ్ సమయంలో కాలి నొప్పితో మరింత బాధపడ్డ టాలీవుడ్ మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్‌లర్.. ఈ సినిమా తర్వాత చికిత్స తీసుకునేందుకు విదేశాలకు పయనం అయిన సంగతి విదితమే. ఇప్పుడు ఈ నొప్పి నుండి కాస్త ఉపశమనం దొరకడంతో ఇక స్టెప్పులతో దుమ్ములేపేసేందుకు రెడీ అయ్యాడు. ఇక ఆయన సినిమాల విషయానికి వస్తే.. కల్కి మే 9 నుండి వాయిదా పడి.. జూన్ 27కి జరిగింది. రాజా సాబ్ తర్వాత సందీప్ రెడ్డి వంగా స్పిరిట్, సలార్ -2, హను రాఘవపూడి దర్శకత్వంలో మరో మూవీని చేస్తున్నాడు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet