iDreamPost
android-app
ios-app

విజయ్ ‘ది గోట్’ ట్రైలర్ వచ్చేసింది.. దళపతి యాక్టింగ్​కు థియేటర్లు దద్దరిల్లాల్సిందే!

  • Published Aug 17, 2024 | 6:37 PM Updated Updated Aug 17, 2024 | 6:37 PM

Thalapathy Vijay The GOAT Movie Trailer Review: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన కొత్త చిత్రం ‘ది గోట్’. ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ఇది ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

Thalapathy Vijay The GOAT Movie Trailer Review: కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్ నటించిన కొత్త చిత్రం ‘ది గోట్’. ఈ మూవీ ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. ఇది ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Aug 17, 2024 | 6:37 PMUpdated Aug 17, 2024 | 6:37 PM
విజయ్ ‘ది గోట్’ ట్రైలర్ వచ్చేసింది.. దళపతి యాక్టింగ్​కు థియేటర్లు దద్దరిల్లాల్సిందే!

కోలీవుడ్ స్టార్ హీరో దళపతి విజయ్​కు తమిళంతో పాటు తెలుగు నాట కూడా మంచి క్రేజ్ ఉంది. ఆయన సినిమాలను ఇష్టపడే వారు ఇక్కడ చాలా మంది ఉన్నారు. విజయ్ యాక్టింగ్, డ్యాన్స్, క్రేజీ యాక్షన్ సీక్వెన్స్​లకు తెలుగు నాట చాలా మంది ఫిదా అయిపోయారు. ఆయన నటించిన ‘తుపాకీ’, ‘అదిరింది’, ‘మాస్టర్’, ‘వారసుడు’, ‘లియో’ సినిమాలు ఇక్కడ సూపర్ కలెక్షన్స్​ సాధించాయి. అందుకే విజయ్ తాను యాక్ట్ చేసే ప్రతి చితాన్ని తమిళంతో పాటు ఏకకాలంలో తెలుగులోనూ రిలీజ్ చేస్తున్నారు. ఆయన ప్రస్తుతం నటిస్తున్న ఫిల్మ్ ‘ది గోట్’. డిఫరెంట్ మూవీస్ తీసే వెంకట్ ప్రభు డైరెక్ట్ చేసిన ఈ చిత్రం ట్రైలర్ తాజాగా రిలీజ్ అయింది. అది ఎలా ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..

2 నిమిషాల 51 సెకన్ల పాటు సాగే ‘ది గోట్’ ట్రైలర్ అదిరిపోయింది. ముఖ్యంగా యాక్షన్ సీక్వెన్స్​లు చాలా బాగున్నాయి. దళపతి విజయ్ తనకు అలవాటైన స్టైల్​లో ఫైట్ సీక్వెన్సుల్లో అదరగొట్టారు. ఇందులో ఆయన రెండు వైవిధ్యమైన క్యారెక్టర్స్​లో కనిపిస్తున్నారు. తండ్రీ కొడుకుల్లా అలరించనున్నట్లు ట్రైలర్​తో అర్థమవుతోంది. మాజీ స్పై ఏజెంట్ అయిన విజయ్​ను తిరిగి రంగంలోకి దింపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నట్లు ట్రైలర్​లో గమనించొచ్చు. ఒక టాస్క్ కోసం ఆయన బరిలోకి దిగి చేసే యుద్ధమే ‘ది గోట్’ అని అర్థమవుతోంది. పవర్​ప్యాక్డ్ యాక్షన్ సీక్వెన్స్​లతో ఆడియెన్స్ ముందుకు వచ్చిన ఈ ట్రైలర్​లో కామెడీకి కూడా మంచి స్కోప్ ఇచ్చారు.

‘ది గోట్​’ను యాక్షన్ ఎంటర్​టైనర్​గా మలిచినట్లు ట్రైలర్ ద్వారా డైరెక్టర్ వెంటక్ ప్రభు చెప్పకనే చెప్పేశారు. విజయ్ రెండు పాత్రల్లోనూ తనదైన నటనతో అదరగొట్టారు. ముఖ్యంగా సీనియర్ స్పై ఏజెంట్​గా ఆయన లుక్స్, డైలాగ్స్, యాక్షన్ సీక్వెన్స్​లు బాగున్నాయి. ఈ పాత్రతో థియేటర్లను ఆయన షేక్ చేయడం గ్యారెంటీగా కనిపిస్తోంది. ఇక, ‘ది గోట్’లో సీనియర్ హీరో ప్రశాంత్, ప్రముఖ కొరియోగ్రాఫర్ ప్రభుదేవాతో పాటు మోహన్, జయరామ్ నటిస్తున్నారు. స్నేహ, లైలా కూడా యాక్ట్ చేస్తున్నారు. ట్రైలర్​లో వీళ్లంతా తమ యాక్టింగ్​తో అట్రాక్ట్ చేశారు. హీరోయిన్ మీనాక్ష్మి చౌదరి ఎక్కువ సేపు కనిపించకపోయినా ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందిస్తున్న ఈ మూవీ సెప్టెంబన్ 5వ తేదీన వరల్డ్​వైడ్​గా గ్రాండ్​గా రిలీజ్ కానుంది. మరి.. ‘ది గోట్’ ట్రైలర్ మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: ప్రభాస్ తో ఫోటో ఎఫెక్ట్ .. ఇన్ స్టాలో ఇమాన్ ఇస్మాయిల్ రేంజ్ మారిపోయింది!