iDreamPost
android-app
ios-app

ప్రభాస్ తో ఫోటో ఎఫెక్ట్ .. ఇన్ స్టాలో ఇమాన్ ఇస్మాయిల్ రేంజ్ మారిపోయింది! అంతా గంటల్లోనే!

  • Published Aug 17, 2024 | 6:21 PM Updated Updated Aug 17, 2024 | 6:21 PM

Prabhas Heroine Iman Esmail: ప్రభాస్- హను రాఘవపూడి సినిమాకి సంబంధించి పూజలో ఒక అమ్మాయి బాగా వైరల్ అయ్యింది గమనించారా? ఆ ఒక్క ఫొటో ఆమె రేంజ్ నే మార్చేసింది.

Prabhas Heroine Iman Esmail: ప్రభాస్- హను రాఘవపూడి సినిమాకి సంబంధించి పూజలో ఒక అమ్మాయి బాగా వైరల్ అయ్యింది గమనించారా? ఆ ఒక్క ఫొటో ఆమె రేంజ్ నే మార్చేసింది.

  • Published Aug 17, 2024 | 6:21 PMUpdated Aug 17, 2024 | 6:21 PM
ప్రభాస్ తో ఫోటో ఎఫెక్ట్ .. ఇన్ స్టాలో ఇమాన్ ఇస్మాయిల్ రేంజ్ మారిపోయింది! అంతా గంటల్లోనే!

ప్రభాస్- హను రాఘవపూడి– ఇమాన్ ఇస్మాయిల్.. ఇప్పుడు పాన్ ఇండియా లెవల్లో వైరల్ అవుతున్న పేర్లు ఇవే. ప్రభాస్- హను రాఘవపూడి కాంబోలో వస్తున్న సినిమాకి సంబంధించి శనివారం హైదరాబాద్ వేదికగా అట్టహాసంగా పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పూజలో ఒక అమ్మాయి అందరి దృష్టిని ఆకర్షించింది. ఆమె మరెవరో కాదు.. ఇమాన్ ఇస్మాయిల్. ఈ ప్రాజెక్ట్ లో హీరోయిన్ ఆమే అని చెబుతున్నారు. నిజానికి మధ్యాహ్నం వరకు ఈ విషయంపై ఎవరికీ అంతగా క్లారిటీ లేదు. ఆమె హీరోయిన్ అని కూడా ఎవరూ అనుకోలేదు. కానీ, ప్రభాస్ పక్కన ఒక్క ఫ్రేమ్ లో కనిపించగానే సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది. ఆమె అకౌంట్ కోసం వెతకడమే కాకుండా.. ఫాలోలు కూడా కొట్టేశారు.

అంతా గంటల్లోనే:

ఇమాన్ ఇస్మాల్ ఫొటోలు ఎప్పుడైతే వైరల్ అయ్యాయో.. అప్పటి నుంచి ఆమె ఇన్ స్టాగ్రామ్ అకౌట్ ఫాలోవర్స్ కూడా పెరుగుతూ వచ్చారు. అది ఎంతలా అంటే.. నిన్నటి వరకు ఆమె న్యూ ఫాలోవర్స్ సంఖ్య డబుల్ డిజిట్లో ఉంటే.. పూజ ఫొటోలు వైరల్ అయిన తర్వాత అది వేలల్లోకి మారిపోయింది. ఒక గంటలోనే 50 వేల వరకు ఫాలోవర్స్ పెరిగిపోయారు. మధ్యాహ్నం 6.50 లక్షల వరకు ఫాలోవర్స్ ఉంటే.. ఇప్పుడు 7.10 లక్షల వరకు వచ్చేశారు. ఈ ఫ్లో ఇలాగే కొనసాగితే కొత్త ఇంకో రెండ్రోజుల్లో ఈమెకు 1 మిలియిన్ ఫాలోవర్స్ వచ్చినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం గంటకు ఒక వెయ్యి కొత్త ఫాలోవర్స్ వస్తున్నారు. ఈరోజు ఉదయం వరకు ఇమాన్ ఇస్మాయిల్ అంటే తెలుగు ప్రేక్షకులకు తెలీదు. కానీ, ఇప్పుడు ఇమాన్ ఇస్మాయిల్ పేరు పాన్ ఇండియా లెవల్లో ట్రెండింగ్ లో ఉంది.

 

View this post on Instagram

 

A post shared by Imanvi (@iman1013)

బ్యాగ్రౌండ్:

స్వతహాగా ఇమాన్ ఇస్మాయిల్ ఒక డ్యాన్సర్. ఈమె తనకు 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడే డ్యాన్స్ నేర్చుకోవడం స్టార్ట్ చేసింది. ఈమె తన ఇన్ స్టాగ్రామ్ బయోలో యాక్టర్, డ్యాన్సర్, కొరియోగ్రాఫర్ అని మెన్షన్ చేసింది. ఇంక రీల్స్ చూస్తే అన్నీ డ్యాన్స్ చేస్తున్నవే ఉంటాయి. ఆమె ఎంత అందంగా ఉందో.. అంతకంటే అందంగా డ్యాన్స్ చేస్తుండటంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫిదా అయిపోయారు. అంతేకాకుండా మరోసారి హను రాఘవపూడి హీరోయిన్ సెలక్షన్ కు తెలుగు సినిమా అభిమానులు ఆశ్చర్యపోయారు. నిజానికి తెలుగు డైరెక్టర్స్ కూడా హను రాఘవపూడి హీరోయిన్ సెలక్షన్ కు అవాక్కవుతున్నారు. ఆయన సెలక్షన్ కి వందకు వంద మార్కులు వేస్తున్నారు. మరి.. హను రాఘవపూడి హీరోయిన్ సెలక్షన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by Imanvi (@iman1013)

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio