iDreamPost
android-app
ios-app

వీడియో: బన్నీ పాటకు స్టెప్పులేసిన దళపతి విజయ్! ఇది కదా అభిమానమంటే..

  • Author Soma Sekhar Published - 12:27 PM, Fri - 23 June 23
  • Author Soma Sekhar Published - 12:27 PM, Fri - 23 June 23
వీడియో: బన్నీ పాటకు స్టెప్పులేసిన దళపతి విజయ్! ఇది కదా అభిమానమంటే..

సినిమా ఇండస్ట్రీలో హీరోలకు, హీరోలకు మధ్య మంచి అనుబంధం ఉంటుంది. అయితే కొంత మంది హీరోల మధ్య గొడవలు ఉన్నట్లు మనం చాలా కథనాలే చదివాం. ఇక కొన్ని కొన్ని సందర్భాల్లో తమ అభిమాన హీరోపై మరో హీరో ప్రశంసలు కురిపించడం. అతని పాటలకు స్టెప్పులేయడం మనం చాలా ఈవెంట్స్ లో చూశాం. తాజాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాటకు స్టెప్పులేశాడు తమిళ దళపతి విజయ్. జూన్ 22న విజయ్ పుట్టిన రోజు కావడంతో.. బుట్ట బొమ్మ పాటకు పూజా హెగ్డేతో కలిసి స్టెప్పులేశారు విజయ్. దాంతో బన్నీ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ఇది కదా అభిమానం అంటే.. అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.

దళపతి విజయ్.. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. దక్షిణాది సినిమా ఇండస్ట్రీలో ఎంత పెద్ద స్టార్లో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఇక వారి సినిమాలు థియేటర్లలోకి వస్తున్నాయి అంటే చాలు ఫ్యాన్స్ కు పూనకాలే. ఇద్దరు పాన్ ఇండియా లెవల్లో సినిమాలు తీస్తూ.. తెగ బిజీగా ఉన్నారు. ఇక తాజాగా దళపతి విజయ్ పుట్టిన రోజు కావడంతో.. ఫ్యాన్స్ ఆయనతో ఉన్న అనుబంధాన్ని సోషల్ మీడియాలో వెల్లడిస్తూ.. పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

అయితే ఓ వీడియో మాత్రం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఆ వీడియోలో బన్నీ నటించిన అల వైకుంఠపురంలో సినిమాలోని బుట్ట బొమ్మ పాటకు విజయ్ స్టెప్పులేసి అదరగొట్టారు. విజయ్ తో పాటుగా బుట్ట బొమ్మ పూజా హెగ్డే కూడా మరోసారి బుట్ట బొమ్మ స్టెప్ వేసింది. వీరితో పాటుగా ఇద్దరు చిన్నారు కాలు కదిపారు. ఇక ఈ వీడియో బీస్ట్ సినిమా షూటింగ్ టైమ్ లో తీసినట్లు తెలుస్తోంది. ఈ వీడియోను అల్లు అర్జున్ ఫ్యాన్ విజయ్ బర్త్ డే సందర్భంగా.. ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. దాంతో నెటిజన్లు పలు విధాలుగా స్పందిస్తున్నారు.

Jojobet GirişHoliganbetHoliganbetHoliganbetGrandpashabetholiganbetholiganbetjojobetgrandpashabetbetparkcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibom girişCasibomgrandpashabetJojobet Girişbigboss