iDreamPost
android-app
ios-app

టాలీవుడ్‌లో టెన్షన్‌.. ఆ విషయంలో తిప్పలు తప్పవా?

అమౌంట్‌ పరంగా కొంత సేఫ్‌ అవుతున్నారు. అలాంటి డిజిటల్‌ రైట్స్‌కు సంబంధించి సంక్లిష్ట పరిస్థితి నెలకొంది. టాలీవుడ్‌లో చాలా సినిమాలు డిజిటల్‌ అమ్మకాలు జరగక టెన్షన్‌ పడుతున్నాయి.

అమౌంట్‌ పరంగా కొంత సేఫ్‌ అవుతున్నారు. అలాంటి డిజిటల్‌ రైట్స్‌కు సంబంధించి సంక్లిష్ట పరిస్థితి నెలకొంది. టాలీవుడ్‌లో చాలా సినిమాలు డిజిటల్‌ అమ్మకాలు జరగక టెన్షన్‌ పడుతున్నాయి.

టాలీవుడ్‌లో టెన్షన్‌.. ఆ విషయంలో తిప్పలు తప్పవా?

తెలుగు చిత్ర పరిశ్రమలో టెన్షన్‌ వాతావరణం నెలకొంది. నిర్మాతలు ఓ విషయంలో తెగ ఇబ్బంది పడుతున్నారు. ఒకరకంగా తలలు పట్టుకునే పరిస్థితి ఏర్పడింది. ఇంతకీ సంగతేంటంటే.. గత కొన్నేళ్ల నుంచి చిన్న సినిమా మొదలుకుని, పెద్ద సినిమా వరకు డిజిటల్‌ రైట్స్‌ ఆదుకుంటున్నాయి. నిర్మాతలకు థియేట్రికల్‌ రైట్స్‌, శాటిలైట్‌ రైట్స్‌ కాకుండా.. ఈ డిజిటల్‌ రైట్స్‌ ద్వారా చాలా వరకు పెట్టుబడి తిరిగి వస్తోంది. సినిమా కొంచెం అటు ఇటు అయినా..

అమౌంట్‌ పరంగా కొంత సేఫ్‌ అవుతున్నారు. అలాంటి డిజిటల్‌ రైట్స్‌కు సంబంధించి సంక్లిష్ట పరిస్థితి నెలకొంది. టాలీవుడ్‌లో చాలా సినిమాలు డిజిటల్‌ అమ్మకాలు జరగక టెన్షన్‌ పడుతున్నాయి. దీనికి కారణం లేకపోలేదు. ఓటీటీ సంస్థలకు కొత్త బడ్జెట్‌ వచ్చే వరకు డిజిటల్‌ సేల్స్‌ జరిగే అవకాశం కనిపించటం లేదు. దీంతో తెలుగు నిర్మాతలు టెన్షన్‌కు గురవుతున్నారట. డిజిటల్‌ రైట్స్‌ అమ్ముడుపోయేంత వరకు కొన్ని సినిమాలు విడుదలను వాయిదా వేసుకుంటున్నట్లు తెలుస్తోంది.

కాగా, కరోనా సమయం నుంచి ప్రపంచ వ్యాప్తంగా ఓటీటీ ప్లాట్‌ ఫాంల వాడకం బాగా పెరిగిపోయింది. ఎక్కువ సమయం ఇంట్లో ఉండాల్సిన పరిస్థితులు రావటంతో ఓటీటీ ప్లాట్‌ ఫాం వాడకం వైపు మళ్లారు. భాషతో సంబంధం లేకుండా సినిమాలు చూడ్డం మొదలుపెట్టారు. ప్రేక్షకుల అభిరుచుల్లోనూ పెను మార్పులు వచ్చాయి.  కంటెంట్‌ ఉన్న సినిమాలు చూడ్డం మొదలుపెట్టారు. అందుకే నిర్మాతలు ఓటీటీ ప్లాట్‌ ఫాంల మీద ఎక్కువ ఫోకస్‌ చేస్తున్నారు. మరి, డిజిటల్‌ రైట్స్‌ విషయంలో తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న టెన్షన్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.