Keerthi
ఏదైనా కొత్త సినిమాలు విడుదలయితే చాలు సినీ ప్రియులకు పండగాలా ఉంటుంది. అది ఏ భాష అయిన సరే కంటేంట్ నచ్చితే ఎన్ని సార్లు చూసిన తనివి తీరదు. ఈ క్రమంలోనే తాజాగా మోహన్ లాల్ నటించిన సినిమా ప్రేక్షకులను అలరించడానికి ఓటీటీలో సిద్ధమవుతుంది. ఇంతకి అది ఎప్పుడంటే..
ఏదైనా కొత్త సినిమాలు విడుదలయితే చాలు సినీ ప్రియులకు పండగాలా ఉంటుంది. అది ఏ భాష అయిన సరే కంటేంట్ నచ్చితే ఎన్ని సార్లు చూసిన తనివి తీరదు. ఈ క్రమంలోనే తాజాగా మోహన్ లాల్ నటించిన సినిమా ప్రేక్షకులను అలరించడానికి ఓటీటీలో సిద్ధమవుతుంది. ఇంతకి అది ఎప్పుడంటే..
Keerthi
భాష ఏదైనా భావం ఒక్కటే అనే మాట మన సినీ ప్రియులకు బాగా వర్తిస్తుంది. ఎందుకంటే.. ఏదైనా కొత్త సినిమాలు విడుదలయితే చాలు అభిమానులకు పండగలా ఉంటుంది. ఇక తమ అభిమాన హీరో సినిమాలైతే ఎన్ని సార్లు చూసిన మళ్లీ మళ్లీ చూడలనే ఉత్సహం ఎక్కువగా ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ డబ్బింగ్ చిత్రం ప్రేక్షకులను అలరించడానికి ఓటీటీలో సిద్ధమవుతుంది. ఇంతకి ఓటీటీలో అలరించబోతున్న ఆ హీరో మరెవరో కాదు, మలయాళ ఆగ్ర నటుడు సూపర్ స్టార్ మోహనాలాల్. ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పలసిన అవసరం లేదు. ఇతను నటించిన అన్ని సినిమాలు తెలుగులో కూడా విడుదలయ్యి సూపర్ హిట్ గా నిలిచాయి. దీంతో ఈయనకు తెలుగులో విపరీతమైన ఫ్యాన్ పాలోయింగ్ తో పాటు మంచి క్రేజ్ కూడా ఉంది. ఇదిలా ఉంటే.. తాజాగా మోహన్ లాల్, ప్రియమణి నటించిన చిత్రం ‘నేరు’. ఈ సినిమా మంచి విజయం సాధించిన విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు ఈ సినిమా ఓటీటీలో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉంది. అది ఎప్పుడంటే..
మలయాళ ఆగ్ర నటుడు మోహన్ లాల్, ప్రియమణి, అనశ్వర రాజన్ సిద్ధిక్ కీలక పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘నేరు’. ఈ సినిమాను దృశ్యం 1,2 వంటి సినిమాలను రూపొందించిన జీతూ జోసెఫ్ దర్శకత్వం వహించారు. మలయాళం నుంచి తరుచుగా వచ్చే క్రైమ్ థ్రిల్లర్ కాకుండా కోర్టు డ్రామా జానర్‌లో ఈ సినిమాను రూపొందించారు. అయితే ఈ సినిమా గతేడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న థియేటర్లలో విడుదలైన బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. కేరళలో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించిన ఈ మూవీ ఓవరాల్‌గా రూ.86 కోట్లు రాబట్టింది. ఇలా థియేటర్లలో సూపర్బ్ రెస్పాన్స్‌ను సొంతం చేసుకున్న నేరు సినిమా ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. దీనిని ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ హక్కులకు సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే.. నేడు అనగా మంగళవారం (జనవరి 23) అర్ధరాత్రి నుంచే మోహన్ లాల్ నేరు మూవీ ఓటీటీలో ప్రసారం అవుతుంది. అంతేకాకుండా ఈ సినిమాను మలయాళంతో పాటు తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో కూడా అందుబాటులోకి వచ్చింది.
ఇక మోహన్ లాల్ నటించిన నేరు సినిమా అత్యధిక వసూళ్లు రాబట్టి మలయాళ సినిమాల్లో ఐదో స్థానంలో నిలిచింది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రూ.100 కోట్లకు పైగా వసూళ్లతో భారీ విజయం సాధించి 2023 సంవత్సరానికి గ్రాండ్‌గా ముగింపు పలికింది. ఈ సినిమాలో మోహన్ లాల్ , ప్రియమణి తో పాటు శాంతి, జగదీశ్, గణేష్ కుమార్, నందు, అదితి రవి తదితర నటులు ప్రధాన పాత్రల్లో నటించారు. ఇక సినిమా కథ విషయానికొస్తే.. ఇదొక కోర్టు రూమ్ డ్రామా. మోహన్‌లాల్ కొన్ని కారణాలతో లాయర్ ప్రాక్టీస్ మానేస్తాడు. అదే సమయంలో ఒక కేసు కోసం మళ్లీ నల్లకోటు వేసుకుంటాడు. అయితే న్యాయం కోసం పరితపించే మోహనల్ లాల్ ఎందుకు ప్రాక్టీస్ మానేశాడు? మళ్లీ ఎందుకు నల్లకోటు వేసుకున్నాడు? ఇంతకీ కేసు ఏంటి? అందులో గెలిచాడా? లేదా? అన్న ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలంటే నేరూ సినిమా ఓటీటీలో చూడాల్సిందే. మరి, మోహనా లాల్ నేరు సినిమా ఓటీటీలో సందడి చేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Extra ordinary responses for #Neru and #Mohanlal‘s performance after the OTT release 👏🏻👏🏻
MEGA BLOCKBUSTER #Neru now streaming on @DisneyPlusHS in 5 languages…!@Mohanlal @jeethu4ever @aashirvadcine pic.twitter.com/GNOoqKMnZS
— Mollywood Updates (@Mollywooduoffl) January 23, 2024