iDreamPost
android-app
ios-app

ఐదేళ్ల తర్వాత థియేటర్లలోకి సమంత, విజయ్ సేతుపతి మూవీ!

  • Published Aug 07, 2024 | 6:31 PM Updated Updated Aug 07, 2024 | 6:33 PM

Super Deluxe Movie: వారం వారం థియేటర్లలోకి చాలా సినిమాలు వస్తుంటాయి. అయితే ఆగష్టు 9న విడుదల కాబోతున్న ఓ సినిమా అందరిని ఆకట్టుకుంటుంది. సమంత, విజయ్ సేతుపతి నటించిన ఆ సినిమా.. ఐదేళ్ల తరువాత తెలుగులో అది కూడా థియేటర్లలో విడుదల కానుంది.

Super Deluxe Movie: వారం వారం థియేటర్లలోకి చాలా సినిమాలు వస్తుంటాయి. అయితే ఆగష్టు 9న విడుదల కాబోతున్న ఓ సినిమా అందరిని ఆకట్టుకుంటుంది. సమంత, విజయ్ సేతుపతి నటించిన ఆ సినిమా.. ఐదేళ్ల తరువాత తెలుగులో అది కూడా థియేటర్లలో విడుదల కానుంది.

  • Published Aug 07, 2024 | 6:31 PMUpdated Aug 07, 2024 | 6:33 PM
ఐదేళ్ల తర్వాత థియేటర్లలోకి సమంత, విజయ్ సేతుపతి మూవీ!

ప్రస్తుతం  ప్రేక్షకులను ఎంటర్ టైన్  వాటిల్లో సినిమాలు ఒకటి. ఇక ప్రతివారం అనేక మూవీలు థియేటర్లలో సందడి చేస్తుంటాయి. కొన్ని సినిమాల్లో అయితే మల్టీస్టారర్ మూవీగా థియేటర్లలోకి వస్తాయి. అలాంటి సినిమాలపై ఎంతో  క్రేజ్ , విపరీతమైన అంచనాలుఉంటాయి. అలానే పలువురు స్టార్ యాక్టర్స్ నటించిన ఓ సినిమా దాదాపు ఐదేళ్ల తరువాత తెలుగులో థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమా 2019లో బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకుంది. తాజాగా  ఐదేళ్ల తరువాత తెలుగులో 400పైగా థియేటర్లలో విడుదల కానుంది. మరి.. ఆ సినిమా ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…

తమిళ స్టార్ హీరో, నటుడు మక్కల్ సెల్వన్ విజయ సేతుపతి, మలయాళ పాపులర్ యాక్టర్ పుష్ప ఫేమ్ ఫహాద్ ఫాజిల్, సమంత, రమ్యకృష్ణ ప్రధాన పాత్రలు నటించిన సినిమా సూపర్ డీలక్స్. వివిధ భాషల్లో పేరు సంపాదించుకున్న అగ్ర నటీనటులు నటించిన ఈ సినిమా 2019లో సూపర్ హిట్ సొంతం చేసుకుంది. ఈ మాస్టర్ పీస్ సినిమాను దైవసెల్వితీర్థం ఫిలిమ్స్ బ్యానర్‌పై నిర్మించారు. అంతేకాక ఈ సినిమాకు దైవసిగమణి, తీర్థమలై, పూల మధు నిర్మాతలుగా వ్యవహరించారు. ఈ మూవీని త్యాగరాజ కుమార రాజా డైరెక్షన్  చేశారు. ఈ సినిమా అప్పట్లో కోలీవుడ్ లో మాస్టర్ పీస్‌గా నిలిచి..బాక్సాఫీస్ వద్దు పలు రికార్డ్స్ కొల్లగొట్టింది. అలా ఎంతో సూపర్ హిట్ అందుకున్న ఈ సినిమా దాదాపు ఐదేళ్లకు ఇప్పుడు తెలుగులో విడుదల కానుంది.

Samantha and Vijay Sethupathi movie to hit the theaters after five years!

తెలుగులో కూడా ఓటీటీలోనో అనుకుంటే..పొరపడినట్లే ఏకంగా థియేటర్లలో విడుదల కానుంది. ఆగస్టు 9న సూపర్ డీలక్స్ సినిమాను తెలుగులో గ్రాండ్  విడుదల చేయనున్నారు. దాదాపు 400కుపైగా థియేటర్లలో సూపర్ డీలక్స్ రిలీజ్ కానుందని మేకర్స్ తెలిపారు. ఈ మూవీలో విజయ్ సేతుపతి స్పెషల్ లేడీ గెటప్ లో అద్భుతంగా యాక్ట్ చేశారు.  అంతేకాక ఆ క్యారెక్టర్‌కు గాను విజయ్ ఎన్నో అవార్డ్స్ సైతం అందుకున్నారు. ఇక ఈ సినిమాలో సమంత, ఫహాద్ ఫాజిల్ దంపతులుగా నటించారు. భర్తను మోసం చేసి ఎఫైర్ కొనసాగించే భార్యగా సమంత యాక్టింగ్ అందరిని ఆకట్టుకుంటుంది. ఇదే సమయంలో సమాజంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలపై ఏం చేయలేక ఆవేశాన్ని మాత్రమే  చూపించే వ్యక్తిగా ఫహాద్ ఫాజిల్ నటన ఎంతో అందర్ని ఆలోచింపజేస్తుంది.

ఇదే సమయంలో రమ్యకృష్ణ ప్రత్యేక పాత్రలో కనిపించింది. ఇక భార్యాబిడ్డలు ఉన్న ఓ భర్త(విజయ్ సేతుపతి) శిల్పాఅనే మహిళగా ఎందుకు మారాడు. మంచి భర్త ఉండి కూడా వేంబు (సమంత) ఎఫైర్ ఎందుకు పెట్టుకుంది? గృహిణి అయిన లీలా (రమ్యకృష్ణ) ఎందుకు వేరే రకం మూవీల్లో నటించాల్సి వచ్చింది? అనే విషయాలు ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. ఇవే కాకుండా మూవీ ప్రారంభం నుంచే సూపర్ ట్విస్టులతో సూపర్ డీలక్స్ ఆద్యంతం అలరిస్తుంది.  నాలుగు విభిన్న పాత్రల కథలను జోడించి తెరకెక్కించిన  ఈ చిత్రం ఎన్నో అవార్డులను అందుకుందిత. అంతేకాక విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. మొత్తంగా ఐదేళ్ల తరువాత తెలుగులో థియేటర్లో సూపర్ డిలాక్స్ మూవీ సందడి చేయనుంది.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetJojobetJojobetMadridbetMadridbetMadridbetjojobetcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom