iDreamPost
android-app
ios-app

Sundeep Kishan: నా సినిమా నాకే నచ్చలేదు అంటూ.. సందీప్ కిషన్ కామెంట్స్..

  • Published Feb 09, 2024 | 2:04 PM Updated Updated Feb 09, 2024 | 2:04 PM

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి కంటెంట్ తో సినిమాలు తీసే వారిలో హీరో సందీప్ కిషన్ ఒకరు. తాజాగా ఈ హీరో తన సినిమా మీద తానే కామెంట్స్ చేసుకున్నాడు. దీనితో ఈ న్యూస్ చర్చనీయాంశంగా మారింది.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మంచి కంటెంట్ తో సినిమాలు తీసే వారిలో హీరో సందీప్ కిషన్ ఒకరు. తాజాగా ఈ హీరో తన సినిమా మీద తానే కామెంట్స్ చేసుకున్నాడు. దీనితో ఈ న్యూస్ చర్చనీయాంశంగా మారింది.

  • Published Feb 09, 2024 | 2:04 PMUpdated Feb 09, 2024 | 2:04 PM
Sundeep Kishan: నా సినిమా నాకే నచ్చలేదు అంటూ.. సందీప్ కిషన్ కామెంట్స్..

ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో పెద్ద పెద్ద హీరోలే కాకుండా .. వారితో పోటీ పడుతున్న ఎంతో మంది చిన్న హీరోలు కూడా ఉన్నారు. ప్రతి సారి వారు కూడా మంచి కంటెంట్ తో .. ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉంటారు. కానీ, కొన్ని సార్లు ఎదో ఒక లోపం వలన వారి సినిమాలు ఆడియన్సును అంతగా ఆకట్టుకోలేకపోవచ్చు. ఈ క్రమంలో .. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ఎంతో మంది ఉన్నారు. ఈ కోవకు చెందినవాడే హీరో “సందీప్ కిషన్”. ఎప్పటికపుడు తన లుక్ ని మార్చుకుని.. ప్రేక్షకులకు కొత్తగా కనిపిస్తూ.. మంచి కంటెంట్ ను అందిస్తూ ఉంటాడు ఈ హీరో. కానీ, కొన్ని సార్లు ఆ చిత్రాలు ఆడియన్సును అంతగా ఆకట్టుకోలేకపోతాయి. ఈ క్రమంలోనే గత ఏడాది సందీప్ కిషన్ హీరోగా నటించిన చిత్రం “మైఖేల్”. తాజాగా ఈ చిత్రం పైన తానే కామెంట్స్ చేస్తూ.. అందరికి షాక్ ఇచ్చాడు ఈ హీరో.

సందీప్ కిషన్ ఒక మంచి హిట్ సాధించడం కోసం గత కొన్నేళ్లుగా ఎదురు చూస్తూనే ఉన్నాడు. సినిమా ఎలా ఉన్నా సరే .. ఎప్పటికపుడు తనని తానూ కొత్తగా చూపిస్తూ.. మరో సినిమా తీస్తూ ఉంటాడు ఈ హీరో. హిట్ కోసం గతడేది సందీప్ కిషన్ చేసిన చిత్రం “మైఖేల్”. ఈ చిత్రం కోసం చాలా కష్టపడ్డాడు సందీప్ . కానీ, ఈమూవీ ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయితే, తాజాగా ఈ చిత్రంపైన తానే స్వయంగా కొన్ని షాకింగ్ కామెంట్స్ చేశాడు. తాజాగా తన మరో సినిమా ప్రమోషన్లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సందీప్ కు.. గత ఏడాది ఎంతో కష్టపడి తీసిన చిత్రం.. ప్లాప్ అవ్వడంపైన కొన్ని ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనిపై సందీప్ మాట్లాడుతూ .. ” నిజమే ‘మైఖేల్’ సినిమా థియేటర్స్ లో సరిగా ఆడలేదు. మూవీ రెవెన్యూ గురించి పక్కన పెడితే సినిమా ఫైనల్ అవుట్ పుట్ నాకే నచ్చలేదు. అదే విషయాన్ని డైరెక్టర్ కి కూడా చెప్పా. మా దగ్గర సాలిడ్ ఫుటేజ్ ఉంది. సో ఎడిటింగ్ విషయంలో ఏదైనా మ్యాజిక్ జరిగి ఉంటే మైఖేల్ ఫెంటాస్టిక్ ఫిలిం అయ్యేది. అక్కడే తేడా వచ్చింది. అందుకే ఆమూవీ అలా అయ్యింది.” అంటూ చెప్పుకొచ్చారు సందీప్. ఇక ఇది చూసిన నెటిజన్లు దీనిపై రకరకాలుగా స్పందిస్తున్నారు.

ఇక తాజాగా ఈ హీరో నటించిన చిత్రం “భైరవ కోన”. ఈ సినిమాకు వీఐ ఆనంద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. కాగా , “భైరవ కోన” చిత్రం ఫిబ్రవరి 16న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ క్రమంలో చిత్ర బృందం మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వూస్ తో మూవీ ప్రమోషన్లను గ్రాండ్ గా చేస్తున్నారు. చూడబోతుంటే ఈసారి ఈ చిత్రంతో మంచి హిట్ సాధించాలని అనుకుంటున్నట్టు ఉన్నాడు ఈ హీరో. మరి ఈ సినిమా థియేటర్ లలో విడుదల అయిన తర్వాత ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుంటుందో వేచి చూడాలి. మరి సందీప్ కిషన్ తన చిత్రంపైన తానే కామెంట్స్ చేసిన విషయంలో.. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişjojobetJojobetİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioTipobetHoliganbetHoliganbetTipobetjojobetjojobet girişbetcio