iDreamPost
android-app
ios-app

ఈ ఫోటోలోని చిన్నారి.. ఇప్పుడు స్టార్ హీరోల కన్నా బిజీ!

  • Published Mar 16, 2024 | 4:56 PM Updated Updated Mar 16, 2024 | 4:56 PM

ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తు పట్టారా..? స్టార్ హీరో కన్నా ఈమె చాలా బిజీ. ఇంకా నాలుగు చేతులు ఉండాలే గానీ అన్ని చక్కబెట్టేస్తోంది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా..?

ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నారిని గుర్తు పట్టారా..? స్టార్ హీరో కన్నా ఈమె చాలా బిజీ. ఇంకా నాలుగు చేతులు ఉండాలే గానీ అన్ని చక్కబెట్టేస్తోంది. ఇంతకు ఆమె ఎవరో గుర్తుపట్టారా..?

  • Published Mar 16, 2024 | 4:56 PMUpdated Mar 16, 2024 | 4:56 PM
ఈ ఫోటోలోని చిన్నారి.. ఇప్పుడు స్టార్ హీరోల కన్నా బిజీ!

సాధారణంగా తెలిసిన సినీ ఇండస్ట్రీలో హవా సాగించొచ్చు.. కానీ పరాయి పరిశ్రమలో సత్తా చాటడం అంటే ఆశామాషీ కాదూ.  అక్కడ పోటీ, రాజకీయాలు తట్టుకుని,  భాష, ఆహారం, ఆహార్యానికి అలవాటు పడాల్సి ఉంటుంది. అలాగైతేనే ఇక్కడ నిలబడగలరు నటీమణులు. బిగ్ స్క్రీన్ అయినా, స్మాల్ స్క్రీన్ అయినా రాణించాలంటే.. కాస్తంత తెలివి, మాటల చాతుర్యం కూడా అవసరం. యాక్టింగ్ అవకాశాలు రాకపోయినా.. యాంకర్‌గా అయినా రాణించొచ్చు. మాటలతో మాయ చేయగలిగితే షోస్ చేసుకుంటూ కూడా క్యాష్ చేసుకోవచ్చు అని నిరూపిస్తున్నారు కొందరు. ఇప్పటికే చాలా మంది యాంకరమ్మలు.. తెలుగు తెరపై సత్తా చాటుతున్న సంగతి విదితమే.

ఇదిగో ఈ ఫోటోలో కళ్ల జోడు పెట్టుకున్న ఈ కుట్టీని గుర్తుపట్టారా..? మాటల మరాఠీ. తన మాటలతోనే ప్రేక్షకుల్ని కట్టిపడేస్తుంది. సీరియల్స్, సినిమాలతో రానంత పాపులారిటీ బుల్లితెరపై తెచ్చుకుంది. టెలివిజన్‌లో తిరుగులేని రారాణిగా రాణిస్తుంది. 30 ఏళ్ల ఇండస్ట్రీ ఇక్కడ. ఇంతకు ఆమె ఎవరంటే.. తన మాటలతో బూరెలు వండేసే యాంకర్ సుమ. టాలీవుడ్ ప్రేక్షకులు ముద్దుగా సుమక్క అని పిలుచుకుంటూ ఉంటారు. కేరళలో పుట్టిన ఈ మలయాళ కుట్టి.. తెలుగింట మెట్టి.. యాంకరింగ్‌లో ఆమెకు తిరుగులేదు అన్నట్లుగా మారిపోయింది. గంటలు గంటలుగా నిలబడి యాంకర్ చేయగల సత్తా ఆమెది. ఆమె స్పాంటినిటీకి ఫిదా కానీ వారు లేరు..షోకు సంబంధించిన స్క్రిప్ట్ గుర్తుంచుకోవాలంటే మామూలు విషయం కాదు.

90వ దశకం నుండి బుల్లితెరలో అనేక సీరియల్స్‌లో రాణించిన ఆమె కళ్యాణ ప్రాప్తిరస్తు మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. అటు మలయాళంలో కూడా పలు సినిమాల్లో చేసింది. కానీ నటిగా అంత సక్సెస్ కాలేకపోయిందనే చెప్పొచ్చు. కానీ బుల్లితెరను ఏలేస్తుంది. ఆమె ఓ షో స్టార్ చేసిందంటే.. ఎపిసోడ్లకు ఎపిసోడ్లు అలా వెళ్లిపోతుంటాయి. స్మాల్ స్క్రీన్ మహానటి సుమ అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక ఆమె చేసే ప్రీ రిలీజ్ ఈవెంట్స్, సక్సెట్ మీట్ ఫంక్షన్స్, స్పెషల్ ఇంటర్వ్యూస్ కొదవే ఉండదు. స్టార్ హీరోలంతా తమ ప్రీ రిలీజ్ ఈవెంట్లకు ఆమె యాంకరింగ్ చేయాలని కోరుకుంటూ ఉంటారు. నిజం చెప్పాలంటే.. వారి కన్నా ఈమెనే చాలా బిజీ. ప్రతి రోజు ఏ స్టార్ అయినా కనిపిస్తాడో లేదో తెలియదు కానీ.. సుమ మాత్రం బుల్లితెరలోనే, సోషల్ మీడియాలోనో సందడి చేస్తూనే ఉంటోంది.

స్టార్ మహిళ ఆమెకు మరింత పేరు ప్రఖ్యాతలు తెచ్చిపెట్టాయి. నిర్విరామంగా 15 ఏళ్ల పాటు సాగిందా షో. క్యాష్ దొరికినంత దోచుకో అంటూ గిలింగతలు పెడుతోంది. సుమ అడ్డా అంటూ అలరిస్తూనే ఉంది. ఇక ఆ టీవీ, ఈ టీవీ అని లేదు.. ఏదైనా స్పెషల్ ప్రోగ్రాం ఉందా.. సుమ ఉండాల్సిందే అనేంతలా మారిపోయింది. ఇటు యూట్యూబ్ ఛానల్ స్టార్ చేసి.. పిల్లలతో హంగామా చేస్తుంది. ఇప్పుడిప్పుడే మళ్లీ సినిమాలు స్టార్ట్ చేసింది. జయమ్మ పంచాయతీలో ఆమె నటనకు ఫిదా అయిపోయారు ఆడియన్స్. 1999లో ప్రముఖ నటుడు రాజీవ్ కనకాలను వివాహం చేసుకుంది సుమ. వీరికి ఇద్దరు పిల్లలు.. వీరిలో కొడుకు రోషన్ బబుల్ గమ్ అనే మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobetcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom