iDreamPost
android-app
ios-app

శ్రీలీల గొప్ప నిర్ణయం.. అలాంటి వాటికి దూరంగా ఉంటానంటూ..!

  • Published Feb 05, 2024 | 3:58 PM Updated Updated Feb 05, 2024 | 3:58 PM

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటనలో, డ్యాన్సుల్లో ఎనర్జటిక్ ఫెర్మామెన్స్ తో చంపేస్తుంది. చదువుకుంటూనే.. యాక్టింగ్ చేస్తూ ఎంతో మంది అప్ కమింగ్ హీరోయిన్లకు ప్రేరణగా నిలుస్తున్న శ్రీలీల.. ఓ నిర్ణయం తీసుకుంది.

టాలీవుడ్ యంగ్ బ్యూటీ శ్రీలీల గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నటనలో, డ్యాన్సుల్లో ఎనర్జటిక్ ఫెర్మామెన్స్ తో చంపేస్తుంది. చదువుకుంటూనే.. యాక్టింగ్ చేస్తూ ఎంతో మంది అప్ కమింగ్ హీరోయిన్లకు ప్రేరణగా నిలుస్తున్న శ్రీలీల.. ఓ నిర్ణయం తీసుకుంది.

  • Published Feb 05, 2024 | 3:58 PMUpdated Feb 05, 2024 | 3:58 PM
శ్రీలీల గొప్ప నిర్ణయం.. అలాంటి వాటికి దూరంగా ఉంటానంటూ..!

తెలుగు చిత్ర పరిశ్రమకు దొరికిన మరో ముద్దుగుమ్మ శ్రీలీల. యాక్టింగ్, డ్యాన్సింగ్‌లతో ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది ఈ తెలుగింటి ఆడపడుచు. వరుస ఆఫర్లను కొల్లగొడుతూ.. కొంత మంది హారోయిన్లకు కంటిమీద కునుకు లేకుండా చేసింది. డాక్టర్ చదువుతూనే యాక్టింగ్ చేస్తూ రెండు పడవలపై కూడా నెగ్గుకు రావచ్చునని నిరూపించింది. కన్నడ నుండి టాలీవుడ్ పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ చందమామ..పెళ్లి సందDతో మెప్పించింది. ధమాకా చిత్రంతో స్టార్ డమ్ తెచ్చుకున్న ఆమెకు ఛాన్సులు క్యూ కట్టాయి. బాలకృష్ణ వంటి సీనియర్ హీరోలతో పాటు రామ్ వంటి యంగ్స్ స్టార్స్‌తో జతకట్టింది ఈ భామ.

అలాగే.. అటు యాడ్స్, షాపింగ్ మాల్స్ ఓపెనింగ్స్‌కు వెళుతూ రెండు చేతులా సంపాదిస్తోంది. అయితే శ్రీలీల తీసుకున్న ఓ మంచి నిర్ణయం తీసుకుంది. ఆమె ఓ ప్రకటనలో నటించమని ఆఫర్ వస్తే తిరస్కరించిందట. బెట్టింగ్ యాప్ యాడ్ చేయమని.. ఓ ప్రముఖ సంస్థ ఆమెకు భారీ ఆఫర్ చేయగా.. సున్నితంగా నో చెప్పిందని టాక్ నడుస్తుంది. అలాగే మద్యం బ్రాండ్స్ కి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించమని కోరగా.. మొహమాటం లేకుండా తాను భాగస్వామ్యం కానని చెప్పేసిందట. వీటిల్లో నటిస్తే.. సమాజానికి చెడు సందేశం ఇచ్చినట్లు అవుతుందని భావించిందట శ్రీలీల. ఈ విషయం తెలిసిన ఫ్యాన్స్ ఈ భామను పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. గ్రేట్ యాక్ట్రెస్ అంటూ ప్రశంసిస్తున్నారు.

గత ఏడాది స్కంద, భగవంత్ కేసరి, ఆదికేశవ, ఎక్స్ ట్రా ఆర్డినరీ వంటి చిత్రాలో అలరించిన ఈ అమ్మడు.. ఈ సంక్రాంతికి గుంటూరు కారంలో మహేష్ సరసన ఆడిపాడింది . ఈ సినిమా సక్సెస్ కావడంతో ప్రస్తుతం ఎంజాయ్ మోడ్‌లో ఉంది శ్రీలీల. పవన్ కళ్యాణ్ మూవీ ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా మాత్రమే చేస్తుంది ఆమె. కొత్త సినిమాలకు ఓకే చెప్పడం లేదు. అలాగే విజయ్ దేవరకొండ, గౌతమ్ తిన్ననూరి ప్రాజెక్ట్ నుండి ఈ డాన్స్ క్వీన్ తప్పుకుంది. అయితే ఎంబీబీఎస్ పరీక్షలు ఉండటంతో ఆమె మరో సినిమా ఒప్పుకోవడం లేదని, ఎగ్జామ్స్ అయ్యాక కొత్త కథలు విని ఓకే చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందుకే కొత్త కథలు వినడం లేదని టాక్ నడుస్తోంది. శ్రీలీల తీసుకున్న ఈ నిర్ణయంపై మీ అభిప్రాయలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom