iDreamPost
android-app
ios-app

Sree Leela : ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో కొత్త హీరో ఎంట్రీ

  • Published Mar 02, 2022 | 2:07 PM Updated Updated Mar 02, 2022 | 2:07 PM
Sree Leela : ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో కొత్త హీరో ఎంట్రీ

పెళ్లి సందD సినిమా సక్సెస్ అయ్యిందా లేదా పక్కన పెడితే హీరోయిన్ శ్రీలీల మాత్రం జాక్ పాట్లు కొడుతోంది. డెబ్యూ ఫలితంతో సంబంధం లేకుండా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ఆల్రెడీ ధమాకాలో మాస్ మహారాజా రవితేజతో జోడి కట్టిన సంగతి తెలిసిందే. సీనియర్ హీరో సరసన కాబట్టి కాస్త ఎక్కువ రెమ్యునరేషనే ఆఫర్ చేసినట్టు టాక్ ఉంది. ఇదిలా ఉండగా బళ్లారికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, రాజకీయ నాయకుడు గాలి జనార్దన్ రెడ్డి వారసుడు కిరిటీ పరిచయం కాబోతున్న సినిమాలో హీరోయిన్ గా శ్రీలీలనే లాక్ చేసినట్టు లేటెస్ట్ అప్ డేట్. ఇందుకు గాను తనకు రెగ్యులర్ గా ఇచ్చే పారితోషికానికి డబుల్ ఆఫర్ చేసినట్టు ఇన్ సైడ్ న్యూస్.

కర్ణాటకలో పొలిటీషియన్ల కొడుకులు హీరోలు కావడం అక్కడ ట్రెండ్ గా మారుతోంది. మాజీ సీఎం కుమారస్వామి తనయుడు నిఖిల్ గౌడ మరీ పెద్ద స్టార్ కాలేదు కానీ మీడియం రేంజ్ లో చెప్పుకోదగ్గ మార్కెట్ ని తెచ్చుకున్నాడు. ఇతని జాగ్వార్ ని తెలుగులోనూ డబ్బింగ్ చేసి వదలడం రెగ్యులర్ గా సినిమాలు చూసేవాళ్లకు గుర్తే. కోట్ల రూపాయల బడ్జెట్ తో దాన్ని రూపొందించారు. తర్వాత అక్కడ కంటిన్యూ గా చేస్తున్నాడు కానీ వాటిని ఇక్కడికి అనువదించడం లేదు. అల్లు అర్జున్ సరైనోడుని రీమేక్ చేసుకుంది ఇతనే. ఇప్పుడీ కిరిటీకు గ్రాండ్ లాంచ్ ఇవ్వడానికి ఎంత చేయాలో అంతా చేస్తున్నారు గాలి జనార్దన్ రెడ్డి.

టెక్నికల్ టీమ్ ని చాలా బలంగా సెట్ చేసుకుంటున్నారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తుండగా ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా ప్రోజెక్టులకు మాత్రమే దొరుకుతున్న సెంథిల్ కుమార్ ఛాయాగ్రహణం సమకూర్చబోతున్నారు. ఈ ఇద్దరికే ఎంత ఇవ్వాల్సి వస్తుందో లెక్కేసుకుంటే చాలు ఓవరాల్ గా బడ్జెట్ ఏ స్థాయిలో ఉండబోతోందో అర్థం చేసుకోవచ్చు. సాయి కొర్రపాటి నిర్మాతగా వ్యవహరించబోతున్నారు. ఇప్పటికే కిరిటీకి తగినంత స్థాయిలో శిక్షణ కూడా ఇచ్చారట. స్టార్ కిడ్ అనలేం కానీ అంతకు మించిన బలమైన ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ తో వస్తున్న ఈ హీరోకి మొదటి దర్శకుడు శాండల్ వుడ్ కు చెందిన రాధాకృష్ణ

Also Read : Etharkum Thunindhavan : సమస్య కోసం యుద్ధం చేసే ఈటి