iDreamPost
android-app
ios-app

హీరోయిన్ సంఘవి గుర్తుందా.? ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే?

  • Published Aug 07, 2024 | 12:00 AM Updated Updated Aug 07, 2024 | 12:00 AM

మాస్ మహారాజ రవితేజ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో సింధూరం కూడా ఒకటి. అయితే ఈ సినిమాలో రవితేజ సరసన నటించిన ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా.. ఇప్పుడు ఎలా మారిపోయిందంటే..

మాస్ మహారాజ రవితేజ నటించిన సూపర్ హిట్ సినిమాల్లో సింధూరం కూడా ఒకటి. అయితే ఈ సినిమాలో రవితేజ సరసన నటించిన ఈ హీరోయిన్ ను గుర్తుపట్టారా.. ఇప్పుడు ఎలా మారిపోయిందంటే..

  • Published Aug 07, 2024 | 12:00 AMUpdated Aug 07, 2024 | 12:00 AM
హీరోయిన్ సంఘవి గుర్తుందా.? ఇప్పుడు ఎంతలా మారిపోయిందంటే?

టాలీవుడ్ ఇండస్ట్రీలోని అప్పటిలో ఓ వెలుగు వెలిగి ఆ తర్వాత ఏదో ఒక కారణంతో ఇండస్ట్రీకి దూరమైపోయిన అందాల తారలు చాలామంది ఉన్నారు. ఇక అలా చాలా ఏళ్లు ఇండస్ట్రీకి దూరమై ఇప్పుడిప్పుడే తమ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తున్న ముద్దుగుమ్మలు కూడా చాలానే ఉన్నారు. ఇప్పటికే ఒకప్పుడు స్టార్ హీరోయిన్లుగా ఇండస్ట్రీలో రాణించిన సంగీత,స్నేహ, సదా,ఇంద్రజ, ప్రియమణి వంటి హీరోయిన్స్ ఇప్పుడిప్పుడె తమ సెకండ్ ఇన్నింగ్స్ ను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. కానీ, ఇప్పుడు మనం చెప్పుకున్న హీరోయిన్ మాత్రం ఇండస్ట్రీకి దూరంగా ఫ్యామిలీతో లైఫ్ ను ఎంజాయ్ చేస్తుంది. మరీ, ఆమె ఎవరో కాదు.. అలనాటి హీరోయిన్ ‘సంఘవి’.

 ఈమె గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే.. ఒకప్పుడు స్టార్ హీరోయిన్లలో ఈమె కూడా ఒకరు. ముఖ్యంగా అతి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీలో దాదాపు స్టార్ హీరోల అందరీ సరసన నటించి క్రేజీ హీరోయిన్ గా మంచి గుర్తింపు  తెచ్చుకుంది. అంతేకాకుండా..దాదాపు తన 15 ఏళ్ల సినీ కెరీర్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం భాషల్లో 80కి పైగా చిత్రాల్లో నటించింది. ఈ క్రమంలోనే తనదైన నటనతో ఎంతమంది ప్రేక్షకుల హృదయాల్లో చెరగని ముద్ర వేసుకుంది సంఘవి. ఇక ఈ విషయం పక్కన పెడితే..  ఈ హీరోయిన్ అసలు పేర ‘కావ్య రమేష్’. ఈ అందాల తారకు సినిమాల మీద ఆసక్తితో డిగ్రీ పూర్తయిన అనంతరం ఇండస్ట్రీకి అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలోనే ఇండస్ట్రీలో తన పేరును సంఘవిగా మార్చుకుంది. అయితే ఈమె మొదటిగా శ్రీకాంత్ నటించిన ‘తాజ్ మహల్’ సినిమాతో వెండితెరకు పరిచయమైంది. దీంతో తొలి సినిమాతోనే ఈ అమ్మడు తన నటనతో, అందంతో అప్పటిలో కుర్రకారును ఫిదా చేసింది.

ఇక ఆ సినిమా తర్వాత డైరెక్టర్ కృష్ణవంశీ 1997లో తెరకెక్కించిన ‘సింధూరం’ మూవీలో రవితేజ సరసన సంఘవి హీరోయిన్ గా నటించింది. అయితే అప్పటిలో ఈ సినిమా మంచి హిట్ ను అందుకోవడమే కాకుండా.. సంఘవికి ఎనలేని క్రేజ్ ను సంపాదించకుంది.  దీంతో తెలుగులో వరుస అవకాశలు అందుకున్న సంఘవి దాదాపు 26 సినిమాల్లో అలరించింది. ఇక ఈమె చివరిగా ఒక్కడే కాని ఇద్దరు సినిమాలో నటించింది. ఆ తర్వాత తెలుగులో ఏ సినిమాలో కూడా సంఘవి నటించలేదు. ఇకపోతే కన్నడలో మాత్రం పలు సినిమాల్లో నటించి చివరిగా 2008లో తెరకెక్కిన ఇంద్ర సినిమాతో దూరమైంది.

Heroine sanghavi present life

అనంతరం వెండితెరపై అవకాశాలు తగ్గడంతో.. బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చిన సంఘవి అక్కడ గోకులతిల్ సీతై’, ‘సావిత్రి’, ‘కాలభైరవ’ లాంటి సీరియల్స్‌లో నటించింది. ఇక ఆ తర్వాత తనకు సరైన ఆఫర్స్ రాకపోవడంతో.. 2016లో వెంకటేష్ అనే ఐటీ ఉద్యోగిని పెళ్లి చేసుకుంది. దీంతో నటనకు గుడ్ బై చెప్పేసి ఫ్యామీలితో ఎంజాయ్ చేస్తుంది. ప్రస్తుతం సంఘవికి ఓ పాపా ఉంది. అయితే ప్రస్తుతం ఆమెకు సంబంధించిన లేటెస్ట్ ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్స్ సంఘవి చాలా మారిపోయిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరి, సంఘవి లేటెస్ట్ లుక్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet