iDreamPost
iDreamPost
ప్రస్తుతం హరిహర వీరమల్లు పూర్తి చేసే పనిలో ఉన్న పవన్ కళ్యాణ్ ఇదయ్యాక హరీష్ శంకర్ దర్శకత్వంలో భవదీయుడు భగత్ సింగ్ చేయబోతున్న సంగతి తెలిసిందే. రెగ్యులర్ షూట్ ఎప్పటి నుంచి ఉంటుందో ఇంకా క్లారిటీ రాలేదు. దీనికన్నా ముందు వినోదయ సితం రీమేక్ చేస్తారనే వార్తలు గట్టిగానే వచ్చాయి కానీ ఎందుకనో దానికి సంబంధించిన అప్ డేట్స్ ఆగిపోయాయి. ఒరిజినల్ వెర్షన్ డీల్ చేసిన సముతిరఖని డైరెక్షన్ లో పవన్ తో పాటు సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ ని సెట్ చేస్తూ త్రివిక్రమ్ రచనలో అంతా సిద్ధమైనట్టుగా వార్తలు వచ్చాయి. ఏప్రిల్ రెండో వారంలోనే పూజా కార్యక్రమాలు అన్నారు కానీ మళ్ళీ ఎలాంటి సౌండ్ లేదు.
ఇక విషయానికి వస్తే భవదీయుడు భగత్ సింగ్ ని హరీష్ శంకర్ యాక్షన్ కం ఎంటర్ టైన్మెంట్ రెండూ మిక్స్ చేసి తీయబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. అందులో భాగంగానే పవన్ ఈ సినిమాలో కాలేజీ లెక్చరర్ గా కనిపిస్తారని సమాచారం. గతంలో హరీష్ ఇదే తరహా క్యారెక్టరైజేషన్ ని రవితేజ మిరపకాయ్ లో చూపించారు. అక్కడ కామెడీ బ్రహ్మాండంగా పేలింది. అదే తరహాలో ఇక్కడా చేయబోతున్నారట. అయితే పాఠాలు చెప్పుకునే వ్యక్తి భగత్ సింగ్ పేరు ఎందుకు పెట్టుకున్నాడు, ఏదైనా లక్ష్యంతో అక్కడ చేరాడా లాంటి ప్రశ్నలకు సమాధానం తెరమీదే చూడాలని అంటున్నారు. లాయర్, పోలీస్ తర్వాత పవన్ ఇప్పుడు లెక్చరర్
దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ మూవీలో మెయిన్ హీరోయిన్ గా పూజా హెగ్డే దాదాపు లాక్ అయినట్టే. మరో ఇద్దరు కూడా ఉంటారట. వాళ్ళను లాక్ చేసే పనిలో ఉన్నాడు హరీష్. మూడు నాలుగు పేర్లు పరిశీలనలో ఉన్నాయి కానీ ఎవరనే లీక్ బయటికి రాలేదు. మైత్రి మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో రూపొందించబోయే ఈ ఎంటర్ టైనర్ లో బలమయిన సందేశం కూడా ఉంటుంది. గబ్బర్ సింగ్ తర్వాత వస్తున్న కాంబినేషన్ కావడంతో అభిమానుల అంచనాలు అప్పుడే ఎక్కడికో వెళ్లిపోతున్నాయి. వరసగా రీమేకులు చేస్తున్న పవన్ కు హరిహర వీరమల్లు, భవదీయుడు భగత్ సింగ్ రెండు స్ట్రెయిట్ సినిమాల మీద ఫ్యాన్స్ ఆశలన్నీ