iDreamPost
android-app
ios-app

ఈ నెల టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో కనక వర్షమే.. 200 కోట్లు !

  • Published Jun 02, 2025 | 2:10 PM Updated Updated Jun 02, 2025 | 2:10 PM

గత రెండు నెలలుగా థియేటర్స్ లో కనీసం మెయింటెనెన్స్ ఖర్చులకు కూడా సరిపడా కలెక్షన్స్ రాలేదు. దీనితో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వెలవెల బోయింది. ఈ కారణంగా పర్సెంటేజ్ డిమాండ్ సీన్ లోకి ఎంటర్ అయింది. ఇప్పుడు జూన్ నెలలో వారానికి ఓ సినిమా క్యూ కట్టడం థియేటర్ ఓనర్స్ కు కాస్త ఉపశమనం కలిగించినట్టు అయింది.

గత రెండు నెలలుగా థియేటర్స్ లో కనీసం మెయింటెనెన్స్ ఖర్చులకు కూడా సరిపడా కలెక్షన్స్ రాలేదు. దీనితో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వెలవెల బోయింది. ఈ కారణంగా పర్సెంటేజ్ డిమాండ్ సీన్ లోకి ఎంటర్ అయింది. ఇప్పుడు జూన్ నెలలో వారానికి ఓ సినిమా క్యూ కట్టడం థియేటర్ ఓనర్స్ కు కాస్త ఉపశమనం కలిగించినట్టు అయింది.

  • Published Jun 02, 2025 | 2:10 PMUpdated Jun 02, 2025 | 2:10 PM
ఈ నెల టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో కనక వర్షమే.. 200 కోట్లు !

గత రెండు నెలలుగా థియేటర్స్ లో కనీసం మెయింటెనెన్స్ ఖర్చులకు కూడా సరిపడా కలెక్షన్స్ రాలేదు. దీనితో టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వెలవెల బోయింది. ఈ కారణంగా పర్సెంటేజ్ డిమాండ్ సీన్ లోకి ఎంటర్ అయింది. బంద్ వివాదం గురించి నానా రచ్చ జరిగింది. ఎవరెవరు ఏమేమి మాట్లాడారో తెలియనిది కాదు. ఇలా సాగుతూ ఉండగా. ఇప్పుడు జూన్ నెలలో వారానికి ఓ సినిమా క్యూ కట్టడం థియేటర్ ఓనర్స్ కు కాస్త ఉపశమనం కలిగించినట్టు అయింది. ముఖ్యంగా ఈ నెల టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ లో మల్టీస్టారర్లు సందడి చేయనున్నారు.

జూన్ 5 న రిలీజ్ కాబోతున్న కమల్ హాసన్ థగ్ లైఫ్ తో ఈ సందడి మొదలవ్వబోతుంది. ఇది స్ట్రెయిట్ తెలుగు సినిమా కాకపోయినా కూడా.. కమల్ , త్రిష , శింబు , మణిరత్నం కాంబినేషన్ బ్రాండ్ ఇక్కడ క్రేజ్ తీసుకుని వస్తుంది. విక్రమ్ సినిమాకు ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో తెలియనిది కాదు. ఇప్పుడు థగ్ లైఫ్ కు కూడా అలాంటి టాక్ వస్తే మాత్రం ఇక కలెక్షన్స్ మోత మోగిపోతుందని చెప్పొచ్చు.

ఇక ఇది కంప్లీట్ అయ్యాక.. బాక్స్ ఆఫీస్ దగ్గర అసలు సిసలైన సినిమా రిలీజ్ కు రెడీ గా ఉంది. పవన్ అభిమానులందరికి ఇది బిగ్ డే అని చెప్పొచ్చు. జూన్ 12 న హరి హర వీరమల్లు వచ్చేస్తుంది. సినిమా కథ కథనం బజ్ ఇదంతా సెకండరీ ముందు .. సినిమా రిలీజ్ కు మాత్రం గ్రాండ్ వెల్కమ్ ప్లాన్ చేస్తున్నారు అభిమానులు. సినిమా నిర్మాత ఏఎం రత్నం మాత్రం సినిమా విషయంలో ఫుల్ కాన్ఫిడెన్స్ చూపిస్తున్నారు. ఇది కనుక వర్కౌట్ అయితే బాహుబలి , పుష్ప రేంజ్ లో కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంది. ఇదంతా జరగాలంటే ఓపెనింగ్స్ ఒక్కటే వస్తే సరిపోదు. దానికి తగినట్టు టాక్ కూడా సంపాదించుకోవాల్సిన బాధ్యత ఉంది.

ఇక ఈ సినిమా తర్వాత చాల గ్యాప్ తర్వాత శేఖర్ కమ్ముల నుంచి వస్తున్న కుభేర సినిమా. జూన్ 20న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ధనుష్ , నాగార్జున కాంబోలో వస్తున్న మూవీ పైగా.. దానికి తోడు డిఫరెంట్ టీజర్ కట్ ఉండడంతో దీనికి స్లో స్లో గా హైప్ పెరుగుతుంది. దీని తర్వాత జూన్ నెలకు ఎండ్ చెప్పేస్తూ విష్ణు కన్నప్ప రిలీజ్ కానుంది. జూన్ 27 న విష్ణు డ్రీం ప్రాజెక్ట్ కు ఎలాంటి మార్క్స్ పడతాయో తేలిపోతుంది. ఇలా ఒక్క జూన్ లో వస్తున్న ఈ సినిమాలన్నీ కలిపితే సుమారు 200 కోట్లకు పైనే థియేట్రికల్ బిజినెస్ జరిగే అవకాశం ఉన్నట్లు ట్రేడ్ పండితులు చెబుతున్నారు. ఇక ఏ సినిమా ఎలాంటి ఔట్పుట్ ఇస్తుందో చూడాలి. మరి ఈ అప్డేట్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి .

Jojobet Girişİmajbetjojobetultrabetcasibomcasibomcasibomjojobetcasibom girişşanlıurfa konteynerbetciobetcioHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetjojobet girişbetcioJojobetJojobetJojobetjojobetgrandpashabetcasibomjojobet girişgrandpashabet