iDreamPost
android-app
ios-app

Dunki Trailer: మనల్ని ఆపడానికి వాళ్లెవరు.. డంకీ.. ఓ ఎమోషనల్‌ జర్నీ…

షారుఖ్‌ అభిమానులు ఎంత గానో ఎదురు చూస్తున్న ‘డంకీ’ ట్రైలర్‌ రానే వచ్చింది. డిసెంబర్‌ 5వ తేదీ ఉదయం ట్రైలర్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకీ ట్రైలర్‌ ఎలా ఉందంటే...

షారుఖ్‌ అభిమానులు ఎంత గానో ఎదురు చూస్తున్న ‘డంకీ’ ట్రైలర్‌ రానే వచ్చింది. డిసెంబర్‌ 5వ తేదీ ఉదయం ట్రైలర్‌ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇంతకీ ట్రైలర్‌ ఎలా ఉందంటే...

Dunki Trailer: మనల్ని ఆపడానికి వాళ్లెవరు.. డంకీ.. ఓ ఎమోషనల్‌ జర్నీ…

బాలీవుడ్‌ దిగ్గజ దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరానీ సినిమాలకు ప్రపంచ వ్యాప్తంగా క్రేజ్‌ ఉంది. ఈయన సినిమా జర్నీ మొదలై దాదాపు 20 ఏళ్లు అవుతున్నా.. అతి తక్కువ సినిమాలు మాత్రమే చేశారు. ఇప్పటి వరకు 6 చిత్రాలకు మాత్రమే దర్శకత్వం వహించారు. 2003లో వచ్చిన మున్నాభాయ్‌ ఎంబీబీఎస్‌ మూవీతో ఆయన దర్శకత్వ జర్నీ మొదలైంది. 2009లో త్రీ ఇడియట్స్‌, 2014లో వచ్చిన పీకే సినిమాలు దేశ వ్యాప్తంగా సంచలన విజయాన్ని నమోదు చేశాయి. 2018లో సంజు సినిమా తర్వాత రాజ్‌కుమార్‌ హిరానీ దాదాపు 5 ఏళ్లు సినిమాలకు గ్యాప్‌ ఇచ్చారు. 2023లో ‘డంకీ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

ఈ చిత్రం డిసెంబర్‌ 21న థియేటర్లలోకి రానుంది. ఇక, ఈ మూవీ కోసం బాలీవుడ్‌ బాద్‌షా షారుఖ్‌ ఖాన్‌.. రాజ్‌కుమార్‌ హిరానీ మొదటి సారి కలిసి పని చేశారు. ఇందులో షారుఖ్‌ సరసన తాప్సీ నటించింది. విక్కీ కౌశల్‌, బొమ్మన్‌ ఇరానీలు ముఖ్య పాత్రలు చేశారు.​ సినిమా విడులకు కొద్దిరోజులు మాత్రమే ఉండటంతో చిత్ర బృందం మంగళవారం ట్రైలర్‌ను విడుదల చేసింది. ట్రైలర్‌ ఎలా ఉంది? సినిమా ఎలా ఉండబోతోంది? రాజ్‌కుమార్‌ హిరానీ మార్క్‌ సినిమాల్లో షారుఖ్‌ సెట్టయ్యాడా? లేదా?

డంకీ ట్రైలర్‌ ఎలా ఉంది..

సాధారణంగా రాజ్‌కుమార్‌ హిరానీ సినిమాలు పంజాబీ నేటివిటీతోటే ఉంటాయి. ఈ చిత్రం కూడా అలానే ఉంది. 3.01 సెకన్ల ట్రైలర్‌లోనే మొత్తం సినిమాను చూపించేశారు హిరానీ. సింపుల్‌గా కథ ఏంటంటే.. లాల్టూ అనే ప్రాంతంలో 1995లలో కథ మొదలవుతుంది. ఆ ప్రాంతానికి చెందిన ఓ ఐదుగురు వ్యక్తులు.. హర్‌దయాల్‌ సింగ్‌ దిల్హాన్‌(షారుఖ్‌ ఖాన్‌), మను (తాప్సీ పన్ను), సుఖీ (విక్కీ కౌశల్‌) బల్లి(అనిల్‌ గ్రోవర్‌), బగ్గు ( విక్రమ్‌ కొచ్చర్‌) లండన్‌ వెళ్లాలని అనుకుంటూ ఉంటారు. ఈ ఆశయమే వీరిని ఒక్కటిగా చేస్తుంది. లండన్‌ వెళ్లాలంటే ఇంగ్లీష్‌ తప్పని సరి అని తెలుస్తుంది. నేర్చుకోవటానికి వెళతారు. అయినప్పటికి సరిగా నేర్చుకోలేకపోతారు.

లండన్‌కు అధికారికంగా వెళ్లలేకపోతారు. దీంతో ఓ కఠిన నిర్ణయానికి వస్తారు. అక్రమంగా లండన్‌ వెళ్లటానికి ప్రయత్నిస్తారు. ఈ ప్రయత్నంలో వారికి ఎలాంటి సమస్యలు ఎదురయ్యాయి. లండన్‌కు వెళ్లారా? లేదా? అన్నదే మిగితా కథ.  సినిమా మొత్తం నవరస భరితంగా ఉండబోతోందని ట్రైలర్‌ను బట్టి తెలుస్తోంది. రాజ్‌కుమార్‌ హిరానీ తన కామెడీ టైమింగ్‌ను మాత్రం ఎక్కడా మిస్‌ చేయలేదు. ఎమోషన్స్‌ విషయంలోనూ ముఖ్య పాత్రలు కంటతడి పెట్టిస్తాయి. నటన పరంగా షారుఖ్‌ కొంచెం కొత్తగా కనిపిస్తున్నారు. మరి, డంకీ ట్రైలర్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయగలరు.