iDreamPost
android-app
ios-app

సీరియల్ నటుడు కృష్ణారెడ్డి ఎంగేజ్​మెంట్.. సందడి చేసిన బుల్లితెర సెలబ్రిటీలు!

  • Author singhj Published - 05:26 PM, Sun - 27 August 23
  • Author singhj Published - 05:26 PM, Sun - 27 August 23
సీరియల్ నటుడు కృష్ణారెడ్డి ఎంగేజ్​మెంట్.. సందడి చేసిన బుల్లితెర సెలబ్రిటీలు!

సినీ స్టార్లకే కాదు బుల్లితెర నటులకు కూడా ప్రేక్షకాదరణ భారీగానే ఉంటుందనే విషయం తెలిసిందే. ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియెన్స్ బుల్లితెర నటుల్ని బాగా ఇష్టపడుతుంటారు. సీరియళ్లు, ఇతర టెలివిజన్ కార్యక్రమాలతోనూ ప్రతి ఇంట్లోని టీవీల్లో సందడి చేస్తుంటారు బుల్లితెర నటులు. అందుకే వారిని గుర్తుపట్టని వారు పెద్దగా ఉండరని చెప్పొచ్చు. సీరియళ్లు మగవారు కూడా చూసినా వాటికి ఫిమేల్ వ్యూయర్స్ సంఖ్యే ఎక్కువని చెప్పొచ్చు. అందుకే మేకర్స్ కూడా వారికి నచ్చేలా కుటుంబ నేపథ్యంతో సాగే కథల్నే ఎక్కువగా ఎంచుకొని సీరియళ్లు తీస్తుంటారు.

సీరియల్స్ ద్వారా మంచి పేరు తెచ్చుకొని అనంతరం సినీ రంగంలోకి వెళ్లిన వాళ్లూ చాలా మందే ఉన్నారు. ఇవాళ మూవీ స్టార్లుగా వెలుగొందుతున్న వారిలో చాలా మంది ఒకప్పుడు టెలివిజన్ రంగంలో పనిచేసిన వారే కావడం గమనార్హం. అంతెందుకు దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా తన కెరీర్​ను బుల్లితెర నుంచే మొదలుపెట్టారు. కె.రాఘవేంద్రరావు నిర్మించిన ‘శాంతి నివాసం’ అనే టీవీ సిరీస్​కు జక్కన్న దర్శకత్వం వహించారు. ఆ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్​తో తీసిన ‘స్టూడెంట్ నెం.1’ చిత్రంతో ఆయన సినీ కెరీర్ ప్రారంభమైంది.

ఇదిలా ఉంటే.. ప్రముఖ టెలివిజన్ నటుడు కృష్ణారెడ్డి గురించి వినే ఉంటారు. కొన్నేళ్ల కింద జీ-తెలుగులో ప్రసారమై సూపర్ సక్సెస్ సాధించిన ‘ముత్యమంత ముద్దు’ సీరియల్​తో ఆయన బాగా ఫేమస్ అయ్యారు. ‘ముద్ద మందారం’ అనే సీరియల్​తో తన కెరీర్​ను ఆయన మొదలుపెట్టారు. అయితే ‘ముత్యమంత ముద్దు’ సీరియల్ సక్సెస్​తో ఆయనకు వరుస ఆఫర్లు క్యూ కట్టాయి. అలాంటి కృష్ణారెడ్డికి స్వాతి అనే అమ్మాయితో శనివారం నిశ్చితార్థం జరిగింది. వీళ్ల ఎంగేజ్​మెంట్​కు హాజరైన కొందరు సీరియల్ సెలబ్రిటీలు ఈ ఫొటోలను సోషల్ మీడియాలో పెట్టడంతో అవి వైరల్​గా మారాయి. కాబోయే దంపతులకు అందరూ విషెస్ చెబుతున్నారు.

 

View this post on Instagram

 

A post shared by NIRUPAM PARITALA (@nirupamparitala)

Jojobet GirişgrandpashabetcasibomjojobetcasibomcasibomJojobetjojobetgrandpashabetmatbet girişgrandpashabetDeneme Bonusu Veren Sitelergrandpashabet kayıp bonusugrandpashabet kayıp bonusugrandpashabet telegramgrandpashabet girişGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetjojobetjojobet girişcasibomgrandpashabetesrar satın algrandpashabetmarsbahis giriş