Venkateswarlu
యానిమల్ సినిమా తెలుగుతో పాటు మొత్తం నాలుగు భాషల్లో డిసెంబర్1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు...
యానిమల్ సినిమా తెలుగుతో పాటు మొత్తం నాలుగు భాషల్లో డిసెంబర్1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాను తెలుగులో దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు...
Venkateswarlu
యానిమల్ సినిమా విడుదలకు కేవలం ఒక్క రోజు మాత్రమే ఉంది. దేశ వ్యాప్తంగా ఉన్న సగటు సినీ ప్రేక్షకుడు ఎంతో ఆత్రుతగా ఈ చిత్రం విడుదల కోసం ఎదురు చూస్తున్నాడు. డిసెంబర్ 1న యానిమల్ తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్లలో బిజీ అయిపోయింది. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తెలుగులో పలు మీడియా ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఓ మీడియా ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో యానిమల్ చిత్రంలోని హైలెట్స్ గురించి చెప్పారు.
‘‘ సినిమాను మరో లెవల్‌కు తీసుకెళ్లే సీన్లు యానిమల్‌లో ఏవైనా ఉంటాయా?’’ అని యాంకర్ అని అడిగిన ప్రశ్నకు సందీప్‌రెడ్డి వంగా సమాధానం ఇస్తూ.. ‘‘ ఓపెనింగ్ సీన్ .. 15 నిమిషాల తర్వాత ఒకటి ఉంది.. 45 నిమిషాల తర్వాత ఒకటి ఉంది. హై పాయింట్స్ చాలా ఉన్నాయి. అర్జున్ రెడ్డి ఇంటర్వెల్.. డిఫరెంట్ ఇంటర్ వెల్.. ప్లాన్ చేస్తే రాదు… అది ఐకానిక్ ఇంటర్వెల్ అని చెబుతాను. ఇప్పుడు వస్తున్న ఇంటర్వెల్‌లతో పోలిస్తే.. ఆ ఇంటర్వెల్ లాంగ్ టైం గుర్తు ఉంటుంది.
ఇందులో కూడా ఇంట్రస్టింగ్ ఇంటర్వెల్ ఉంది. మీరు అన్నట్లు హై ఇచ్చే సీన్సు.. సినిమాలో 25 చోట్ల ఉంది. ఫస్ట్ హాప్.. సెకండ్ హాఫ్ కలుపుకుని మొత్తం 25 చోట్ల హై ఫీలవుతారు. ఏందిది అనుకునే ఫీల్ వస్తుంది. నేను ఫస్ట్ రాసుకునే టప్పుడు ఎలా ఉందో.. ఎడిట్ తర్వాత కూడా అలానే ఉంది. నేను ఊహించుకున్న దానికంటే కొన్ని సీన్లు వచ్చాయి. పేపర్ మీద ఏమీ తెలీదు కదా.. పెన్ను అంటే పెన్ను కదా.. కొన్ని కొన్ని నేను ఊహించుకున్న దాని కంటే బాగా వచ్చాయి. ఈజీగా 25 చోట్ల హై ఇచ్చే సీన్లు ఉన్నాయి’’ అని అన్నారు.
కాగా, యానిమల్ సినిమాను తెలుగులో ప్రముఖ నిర్మాత దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. దాదాపు 15 కోట్ల రూపాయలకు, ఆంధ్ర, నైజాం, సీడెడ్ డిస్ట్రిబ్యూషన్ హక్కుల్ని కొన్నారు. యానిమల్‌ను బాగానే ప్రమోట్ చేస్తున్నారు. ఇక, యానిమల్ సినిమా థియేటర్లలో 3:21 నిమిషాల నిడివితో విడుదల కానుంది. కానీ, ఓటీటీ విషయంలో మాత్రం కొంత మార్పు జరగనుందట. ఈ చిత్రం ఓటీటీలో ఏకంగా నాలుగు గంటల నిడివితో స్ట్రీమింగ్ అవ్వనుందట. థియేటర్లలో విడుదలైన 6నుంచి 8 వారాలకు ఓటీటీకి రానుందట.
యానిమల్‌కు సీక్వెల్ కూడా ఉందన్న ప్రచారం జరుగుతోంది. మొన్న హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో సందీప్‌రెడ్డి మాట్లాడుతూ.. ఎండింగ్ అస్సలు మిస్ కాకండి అని అన్నారు. దీంతో ఆ ప్రచారానికి బలం చేకూరింది. సీక్వెల్ వార్తల్లో నిజం ఎంతుందో తెలియాలి అంటే.. డిసెంబర్ 1వ తేదీ వరకు వేచి చూడాల్సిందే.. మరి, యానిమల్ సినిమాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.