iDreamPost
android-app
ios-app

వీడియో: సందీప్ ఇంత కష్టపడ్డాడు కాబట్టే.. యానిమల్ అంత హిట్టైంది..!

Sandeep Reddy Vanga Dedication For Animal: యానిమల్ మూవీ వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ అయ్యింది. అందుకోసం సందీప్ రెడ్డి వంగా ఎంత కష్టపడ్డాడో చూడండి.

Sandeep Reddy Vanga Dedication For Animal: యానిమల్ మూవీ వరల్డ్ వైడ్ గా సెన్సేషన్ అయ్యింది. అందుకోసం సందీప్ రెడ్డి వంగా ఎంత కష్టపడ్డాడో చూడండి.

వీడియో: సందీప్ ఇంత కష్టపడ్డాడు కాబట్టే.. యానిమల్ అంత హిట్టైంది..!

సందీప్ రెడ్డి వంగా.. ఈ పేరు ఇప్పుడు ఇండియన్ సినిమాలో ఒక పెను సంచలనం. ఒక తెలుగు డైరెక్టర్ బాలీవుడ్ మీడియాని వణికిస్తున్నాడు. బాలీవుడ్ బాక్సాఫీస్ ని షేక్ చేస్తున్నాడు. కెరీర్ ఇంకా సరిగ్గా సెట్ కూడా కాని ఒక డైరెక్టర్ వేళ్లూనుకుపోయిన బాలీవుడ్ మాఫీయాని గజగజ వణికిస్తున్నాడు. తన సినిమాతోనే కాకుండా.. తన మాటలతో కూడా అక్కడి వారికి నిద్ర పట్టకుండా చేస్తున్నాడు. స్టార్ హీరోలుగా చలామణి అవుతున్న వాళ్లు కూడా పైకి చెప్పలేని నిజాలను ముఖం మీదే చెప్పేస్తున్నాడు. అతను తీసిన యానిమల్ చిత్రానికి దేశం దాసోహం అంది. అయితే ఆ స్థాయి విజయం అంత తేలిగ్గా రాలేదు. అందుకోసం సందీప్ రెడ్డి వంగా పడిన కష్టం అంతా ఇంతా కాదు.

సినిమా విడుదలై దాదాపు నెల కావొస్తున్నా ఇంకా యానిమల్ మేనియా నుంచి పాన్ ఇండియన్ ప్రేక్షకులు బయటకు రాలేదు. సందీప్ రెడ్డి విజన్ కు, టేకింగ్ కు యావత్ దేశం దాసోహం అంది. బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటూ జేజేలు కొడుతోంది. ఆ మూవీ ఇప్పటివరకు రూ.870 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టింది. ఎన్నో విధాలుగా ఆ సినిమా తొక్కేయాలని, కలెక్షన్స్ కు గండి కొట్టాలని చూసినా కూడా కంటెంట్ ఉన్న మూవీ కావడంతో వాళ్ల ఆటలు సాగలేదు. ఎంత తొక్కాలని చూసినా అంతే పొగరుతో పైకి లేచాడు. అందరూ యానిమల్ సినిమాని పొగడ్తలతో ముంచెత్తుతున్న విషయం తెలిసిందే. అయితే ఆ యానిమల్ సినిమా అంత బాగా రావడానికి సందీప్ పడిన కష్టం చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. ఇప్పుడు అందుకు సంబంధించిన ఒక చిన్న వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

ఆ వీడియో ఏంటంటే.. యానిమల్ సినిమాలో ఒక మంచి హై ఇచ్చిన సీన్ హీరో తన అక్కతో కలిసి కాలేజ్ కి వెళ్తాడు. తన అక్కని ఎవరో ఏడిపించారని వారికి వార్నింగ్ ఇస్తాడు. ఆ సమయంలో క్లాస్ లోకి గన్ తీసుకెళ్లి అక్కడున్న వాళ్లందరినీ వణికిస్తాడు. అయితే అప్పుడు ర్యాగింగ్ చేసినవాళ్లు క్లాసులో ఉండరు. తర్వాత వాళ్లు హీరో కారుని ఫాలో అయ్యి బెదిరించే ప్రయత్నం చేస్తారు. కానీ, రణ్ బీర్ సింగ్ మాత్రం తన కారుతో వాళ్లను ఢీకొడతాడు. తర్వాత మరో బైక్ ను వెంబడిస్తాడు. వాళ్లు ఒక ఓపెన్ ప్లేస్ లో పారిపోతూ ఉంటారు. వాళ్లను హీరో కారుతో ఛేజ్ చేస్తాడు. ఆ సమయంలో బ్యాగ్రౌండ్ మ్యూజిక్ లో ఒక విజిల్ వినిపిస్తూ ఉంటుంది. ఆ విజిల్ వేసింది సందీప్ రెడ్డి వంగా. ఎవరైనా విజిల్ అయితే సరిపోతుంది కదా అనుకుంటారు.

ఒక పిచ్ లో స్టార్ట్ అయ్యి హై పిచ్ కి వెళ్లి మళ్లీ లో పిచ్ కి వచ్చేలా ఒక రిథమ్ లో ఆ విజిల్ వేశాడు. అందుకోసం సందీప్ ప్రాక్టీస్ చేసి మరీ దానిని రికార్డు చేశాడు. ఆ సీన్ లో ఆ విజిల్ గురించి ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. కానీ, ఇప్పుడు ఈ వీడియో చూసిన తర్వాత సందీప్ రెడ్డి వంగా డెడికేషన్ కి, మ్యూజిక్ సెన్స్ కి, ఎలివేషన్ మైండ్ సెట్ కి టేకే బో అంటున్నారు. సందీప్ రెడ్డి వంగా సినిమాలు బ్లాక్ బస్టర్ అవుతున్నాయి అంటే.. అతని విజన్, అతని డెడికేషన్ వల్లే అంటూ చెబుతున్నారు. ఇంత చిన్న విజిల్ కోసమే అతను అంత శ్రద్ధ తీసుకుంటే కథ కోసం ఎంత కష్టపడి ఉండాలి? మేకింగ్ కోసం ఎంత కృషి చేసుండాలి అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట ఆ వీడియో వైరల్ అవుతోంది. మరి.. సందీప్ రెడ్డి వంగా డెడికేషన్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

 

View this post on Instagram

 

A post shared by thellaruu_memez (@thellaruu_memezz)