iDreamPost
android-app
ios-app

సలార్.. ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్ అయ్యిందా? డేట్ వైరల్!

  • Author ajaykrishna Published - 03:23 PM, Tue - 19 September 23
  • Author ajaykrishna Published - 03:23 PM, Tue - 19 September 23
సలార్.. ట్రైలర్ కి ముహూర్తం ఫిక్స్ అయ్యిందా? డేట్ వైరల్!

సలార్.. ఈ సినిమా కోసం దాదాపు ఏడాది కాలంగా ఫ్యాన్స్ కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమా.. సెప్టెంబర్ 28న రిలీజ్ అని ఏడాది క్రితమే ప్రకటించారు మేకర్స్. కేజీఎఫ్, కాంతార ఫేమ్ హోంబలే ఫిలిమ్స్ నిర్మాణంలో.. సలార్ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటుంది. సెప్టెంబర్ 28న రిలీజ్ అవుతుందని దాదాపు రెండు మూడు నెలల ముందునుండి ప్రిపేర్ అయి ఉన్నారు డార్లింగ్ ఫ్యాన్స్. కట్ చేస్తే.. సినిమా సడన్ గా వాయిదా పడి ఒక్కసారిగా ఫ్యాన్స్ పెట్టుకున్న ఆశలను ఆవిరి చేసేసింది. పైగా సినిమా వాయిదా పడిన విషయాన్నీ కూడా మేకర్స్ కన్ఫర్మ్ చేయడానికి చాలా రోజుల టైమ్ తీసుకున్నారు.

ఇక సలార్ వాయిదాతో నిరాశకు గురైన ఫ్యాన్స్.. మూవీ ఇప్పట్లో రావడం కష్టమేనని అనుకున్నారు. కానీ.. మళ్లీ ఆశలు పెంచుతూ అతి త్వరలోనే రిలీజ్ అని చెప్పారు. సరే మేకర్స్ ఎలాగో డేట్ చెప్పలేదు. సో.. ఎప్పుడైనా రాని అన్నట్లుగా ఉన్నారు ఫ్యాన్స్. కానీ.. బుక్ మై షోలో సినిమా రిలీజ్ సెప్టెంబర్ నుండి నవంబర్ కి షిఫ్ట్ అయినట్లు చూపిస్తుంది. దీంతో మేకర్స్ కన్ఫర్మ్ చేయకపోయినా.. నవంబర్ లో రిలీజ్ అని ఫిక్స్ అయిపోతున్నారు. పైగా సినిమా నవంబర్ 10న రాబోతుందని సోషల్ మీడియాలో డేట్ కూడా ప్రచారం జరుగుతుంది. అయితే.. ఇప్పుడు కొత్తగా సలార్ ట్రైలర్ రిలీజ్ కి టైమ్ అయ్యిందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

దీంతో మరోసారి ప్రభాస్ ఫ్యాన్స్ లో హైప్ మళ్ళీ మొదలవుతుంది. ఎందుకంటే.. ట్రైలర్ రిలీజ్ అంటూ చెప్తున్న డేట్ అలా టెంప్ట్ చేస్తుందని చెప్పాలి. నవంబర్ లో రిలీజ్ అనుకుంటే.. పాన్ ఇండియా సినిమా కాబట్టి అక్టోబర్ లోనే ట్రైలర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో.. అక్టోబర్ 23న ప్రభాస్ బర్త్ డే ఉంది. ఇక అంతకంటే మంచి డేట్ ఇంకేంటని అంటున్నారు ఫ్యాన్స్. ప్రస్తుతం డార్లింగ్ బర్త్ డే రోజున ట్రైలర్ వస్తుందని సోషల్ మీడియాలో హైప్ పెరిగిపోతుంది. కానీ.. ఏదైనా మేకర్స్ క్లారిటీ ఇస్తే గానీ పరిస్థితులు నమ్మేలా లేవని కొందరి అభిప్రాయం. మరి సలార్ నుండి పోస్టర్ అయినా.. ట్రైలర్ అయినా మేకర్స్ క్లారిటీ ఇస్తేనే అని సినీవర్గాలు అంటున్నాయి. మరి సలార్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişgrandpashabetcasibomiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetgrandpashabetcasibom girişcasibom