Venkateswarlu
సలార్ ట్రైలర్ 24 గంటలు గడవక ముందే రికార్డు క్రియేట్ చేసింది. పాత కేజీఎఫ్ రికార్డులను 20 గంటల్లోనే బ్రేక్ చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలకు కలిపి..
సలార్ ట్రైలర్ 24 గంటలు గడవక ముందే రికార్డు క్రియేట్ చేసింది. పాత కేజీఎఫ్ రికార్డులను 20 గంటల్లోనే బ్రేక్ చేసింది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలకు కలిపి..
Venkateswarlu
ప్యాన్ ఇండియా స్టార్ ప్రభాస్- దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో తెరకెక్కిన ‘ సలార్’ ట్రైలర్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. హోంబళే ఫిల్మ్స్ తమ అఫిషియల్ యూట్యూబ్ ఖాతాల్లో నిన్న రాత్రి 7.19 నిమిషాలకు ట్రైలర్‌ను విడుదల చేసింది. 3.37 నిమిషాల నిడివి కలిగిన ఈ ట్రైలర్ ప్యాన్ ఇండియా లెవెల్‌లో విడుదలైంది. తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ట్రైలర్ వచ్చింది. ట్రైలర్ విడుదలైన అన్ని భాషల్లో సంచలన రికార్డులను సృష్టించింది. సృష్టిస్తోంది కూడా.
మొదటి నుంచి రికార్డులు క్రియేట్ చేస్తున్న సలార్ ఖాతాలోకి మరో కొత్త రికార్డు వచ్చి చేరింది. ట్రైలర్ తక్కువ టైంలో పాత రికార్డులను తుడిచి పెట్టే సింది. యూట్యూబ్‌లో విడుదలైన 16 గంటల్లో అన్ని భాషల్లో 75 మిలియన్ల వ్యూస్ సాధించింది. ఇక, 24 గంటలు కూడా గడవక ముందే 100 మిలియన్ల మార్కును చేరుకుంది. 20 గంటల్లో తెలుగులో 30 మిలియన్ల వ్యూస్ రాగా, హిందీలో ఏకంగా 50 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. మిగిలిన భాషలు అయిన తమిళంలో 8 మిలియన్లు..
కన్నడలో 9 మిలియన్లు.. మలయాళం 6.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. గతంలో కేజీఎఫ్ సినిమా పై 100 మిలియన్ల రికార్డు ఉండింది. ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు వచ్చిన 24 గంటల్లో.. 106 మిలియన్ల వ్యూస్ తెచ్చుకుంది. కానీ, సలార్ మాత్రం కేవలం 20 గంటల్లోనే 100 మిలియన్ల ఫీట్‌ను సాధించింది. 24 గంటలు కావటానికి ఇంకా టైం ఉంది కాబట్టి.. మిలియన్ల సంఖ్య ఇంకా పెరగొచ్చు. సలార్ కొత్త రికార్డుతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు.
ఇక, ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగుతో పాటు మిగిలిన భాషల్లో కూడా ఏకకాలంలో రిలీజ్ అవ్వనుంది. దేశంలో పెద్ద ఇండస్ట్రీలు అయిన, తెలుగు, హిందీ, తమిళ భాషలపైనే సినిమా టీం ఎక్కువ ఫోకస్ పెట్టింది. ఈ మూడు ప్రాంతాల్లో.. అది కూడా తెలుగు, హిందీల్లో ఎక్కువగా సినిమాను ప్రమోట్ చేయడానికి చూస్తోంది. దేశ వ్యాప్తంగా ముఖ్య పట్టణాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్లు.. మీడియా ప్రతినిధుల ఇంటర్వ్యూలు నిర్వహించనుంది.
సలార్ మూవీ అడ్వాన్స్ విషయంలోనూ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్ అందింది. డిసెంబర్ 16 నుంచి సలార్ అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అవ్వనున్నాయి. ఇక, అడ్వాన్స్ బుకింగ్స్ విషయంలోనూ సలార్ రికార్డులు క్రియేట్ చేస్తుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో ప్రభాస్‌కు జంటగా శృతి హాసన్ నటించారు. పృథ్వీ రాజ్ సుకుమార్, జగపతి బాబు, టిన్ను ఆనంద్, ఈశ్వరీ రావు, శ్రీరామ్ రెడ్డి, శ్రేయరెడ్డి తదితరులు కీలక పాత్రల్లో కనువిందు చేయనున్నారు. మరి, ట్రైలర్ విషయంలో సలార్ రికార్డులు క్రియేట్ చేయటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.