iDreamPost
android-app
ios-app

సలార్ రిలీజ్ డేట్.. మళ్ళీ ఇండస్ట్రీని కుదిపేసింది!

  • Author ajaykrishna Published - 12:50 PM, Sat - 30 September 23
  • Author ajaykrishna Published - 12:50 PM, Sat - 30 September 23
సలార్ రిలీజ్ డేట్.. మళ్ళీ ఇండస్ట్రీని కుదిపేసింది!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటించిన బిగ్గెస్ట్ యాక్షన్ మూవీ ‘సలార్’. దర్శకుడు ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాని.. భారీ బడ్జెట్ తో కేజీఎఫ్ ఫేమ్ హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ప్రభాస్ ఊరమాస్ లుక్స్.. రక్తంతో నిండిన పోస్టర్స్.. మాసీవ్ టీజర్.. ఇలా అన్ని సలార్ పై అంచనాలను ఆకాశానికి చేర్చేసాయి. దీంతో ఎప్పుడెప్పుడు సినిమా రిలీజ్ అవుతుందా? అని ఫ్యాన్స్ అందరు వెయిట్ చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సిన సినిమా.. వాయిదా పడి అందరికి షాకిచ్చింది. కానీ.. ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేకర్స్.. సలార్ కొత్త రిలీజ్ డేట్ పై క్లారిటీ ఇచ్చేశారు.

సలార్ మూవీ.. ఈ ఏడాది క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలలో రిలీజ్ అవుతోంది. ఆల్రెడీ పాన్ ఇండియా క్రేజ్ ఉన్న ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో వస్తుంది. కాబట్టి.. సినిమా వసూళ్ల పరంగా రికార్డులు కొత్త రికార్డులు సృష్టించడం ఖాయమని సినీ వర్గాలు చెబుతున్నాయి. అయితే.. సలార్ కొత్త రిలీజ్ డేట్ రాకతో మరోసారి ఇండస్ట్రీ వర్గాలు కుదేలు అయినట్లు తెలుస్తుంది. ముందు సెప్టెంబర్ 28న సినిమా వస్తుందని.. సలార్ రెండు వారాల ముందు, రెండు వారాల తర్వాత వరకు రిలీజ్ డేట్స్ వాయిదా వేసుకున్నాయి వేరే సినిమాలు.

ఇప్పుడు డిసెంబర్ 22న వస్తుందని తెలిసి.. మరోసారి ఆల్రెడీ రిలీజ్ ఖరారు చేసుకున్న సినిమాలు సైడ్ అయిపోతున్నాయి. సలార్ పై ఉన్న హైప్, క్రేజ్, అంచనాలకు.. సలార్ ని తప్ప థియేటర్స్ లో వేరే ఏ సినిమాలను ఆ టైమ్ లో చూడలేరు ప్రేక్షకులు. ఎందుకంటే.. దాదాపు ఏడాదికి పైగా దీనికోసం వెయిట్ చేస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. సలార్ రాకతో సైడ్ అయిన లిస్టులో రెండు పెద్ద సినిమాలే ఉన్నాయి. డిసెంబర్ 21 రిలీజ్ అనుకున్న హాయ్ నాన్న, డిసెంబర్ 22న రిలీజ్ అనుకున్న సైందవ్.. ఈ రెండింటితో పాటు మరికొన్ని సినిమాలు.. సలార్ ఫిక్స్ అవ్వడంతో ముందు వెనుకకు వాయిదా వేసుకునే ఆలోచనలో ఉన్నాయి. ఎందుకంటే.. సలార్ కి పోటీగా షారుఖ్ ఖాన్ డుంకి వస్తోంది. సో.. సలార్ కొత్త రిలీజ్ డేట్ మళ్ళీ ఇండస్ట్రీని కుదిపేసింది అనడంలో ఎలాంటి సందేహం లేదని విశ్లేషకులు అంటున్నారు. మరి సలార్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.