iDreamPost
android-app
ios-app

సలార్.. కొత్త రిలీజ్ డేట్! ఈసారైనా ఫ్యాన్స్ ఆశలు పెట్టుకోవచ్చా..?

  • Author ajaykrishna Updated - 11:46 AM, Fri - 8 September 23
  • Author ajaykrishna Updated - 11:46 AM, Fri - 8 September 23
సలార్.. కొత్త రిలీజ్ డేట్! ఈసారైనా ఫ్యాన్స్ ఆశలు పెట్టుకోవచ్చా..?

ఇండస్ట్రీలో రిలీజ్ ముందు ఫుల్ హైప్ క్రియేట్ చేసి.. తీరా రిలీజ్ ముందు వాయిదా అని హ్యాండ్ ఇస్తే ఫ్యాన్స్ ఎంత ఫీల్ అవుతారో ప్రత్యేకంగా చెప్పే అవసరం లేదు. ఆల్రెడీ చాలా కాలంగా సినిమాల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. అలాంటిది ఒక్కసారిగా వాయిదా అనేసరికి జీర్ణించుకోవడం కష్టంగానే ఉంటుంది. అయితే.. వాయిదా అనేది చిన్న సినిమాల విషయంలో జరిగితే వేరు. అదే వరల్డ్ వైడ్ కావాల్సినంత క్రేజ్, హైప్ క్రియేట్ అయిన పాన్ ఇండియా మూవీస్ హ్యాండ్ ఇస్తే.. ఖచ్చితంగా ఫ్యాన్స్ ఆశలన్నీ బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. ఎన్నో రోజులుగా అభిమాన హీరో సినిమా కోసం పడిగాపులు కాసిన కష్టం అంతా వృధా అయిపోయిన ఫీలింగ్ కలుగుతుంది.

కొద్దిరోజులుగా సలార్ ఫ్యాన్స్ పరిస్థితి అలాగే ఉంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో కేజీఎఫ్, కాంతార ఫేమ్ హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మించిన భారీ యాక్షన్ మూవీ సలార్. కొన్ని నెలల క్రితమే ఈ సినిమాని సెప్టెంబర్ 28న రిలీజ్ చేస్తున్నామని.. రిలీజ్ విషయంలో ఎలాంటి మార్పు ఉండదు అని మేకర్స్ చెబుతూ వచ్చారు. దీంతో మేకర్స్ అంత గట్టిగా చెబుతున్నారంటే.. ఈసారి పక్కా అనుకున్న టైమ్ కే సలార్ వస్తుందని ఫ్యాన్స్ హంగామా మొదలైపోయింది. వరల్డ్ వైడ్ సలార్ ఫీవర్ చుట్టేసింది. అప్పటికి టీజర్ తప్ప సలార్ నుండి ఎలాంటి సాంగ్, అప్డేట్ రాలేదు. కానీ.. హైప్ మాత్రం అలాగే ఉంది.

కట్ చేస్తే.. సరిగ్గా రిలీజ్ కి నెల రోజుల టైమ్ మాత్రమే ఉందనగా.. మేకర్స్ సైలెంట్ అయిపోయారు. సోషల్ మీడియాలో, ఇండస్ట్రీ వర్గాలలో సలార్ వాయిదా అని వార్తలు వచ్చేశాయి. దీంతో సలార్ ఫ్యాన్స్ అందరికీ హార్ట్ బ్రేక్ అయిపోయింది. ఎప్పుడెప్పుడు వస్తుందా అని చూసిన ఫ్యాన్స్.. ఎప్పుడైనా రాని అన్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు కొత్తగా సలార్ నవంబర్ 10న రిలీజ్ కాబోతుందని, కొత్త రిలీజ్ డేట్ ఇదేనంటూ కథనాలు వినిపిస్తున్నాయి. ఆల్రెడీ సెప్టెంబర్ 28న రావట్లేదని చాలా సినిమాలు ఆ డేట్ లాక్ చేసుకున్నాయి. దీంతో ఇప్పుడు సలార్ దీపావళి సందర్బంగా నవంబర్ లోనైనా కన్ఫర్మ్ గా వస్తుందా? అనే సందేహంలో ఉన్నారు ఫ్యాన్స్. ఎందుకంటే.. మేకర్స్ నుండి ఎలాంటి రియాక్షన్ లేదు. పైగా రెండు మూడు రోజుల్లో క్లారిటీ వస్తుందని అంటున్నారు. సో.. ఈసారైనా ఆశలు పెట్టుకోవచ్చా అని అడుగుతున్నారు ఫ్యాన్స్. చూడాలి మరి మేకర్స్ ఏం ప్లాన్ చేస్తున్నారో. సలార్ గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.

 

View this post on Instagram

 

A post shared by Tollywood Updates (@tollywoodtu)

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetHoliganbetjojobet güncel girişcratosroyalbetganobetgrandpashabetiptv satın alCasibomcasibomjojobetcasibomcasibomHoliganbetcasibomjojobetgrandpashabetcasibom girişgrandpashabetcasibom