iDreamPost
android-app
ios-app

Salaar: సలార్ ట్రైలర్ టైమ్ ఎన్నిసార్లు మారుస్తారు? మండిపడుతున్న ఫ్యాన్స్!

సలార్‌ సినిమా డిసెంబర్‌ 22వ తేదీన తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సెకండ్‌ ట్రైలర్‌ విడుదలకు సలార్‌ టీం ఏర్పాట్లు చేసింది.

సలార్‌ సినిమా డిసెంబర్‌ 22వ తేదీన తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో సెకండ్‌ ట్రైలర్‌ విడుదలకు సలార్‌ టీం ఏర్పాట్లు చేసింది.

Salaar: సలార్ ట్రైలర్  టైమ్ ఎన్నిసార్లు మారుస్తారు? మండిపడుతున్న ఫ్యాన్స్!

ప్రభాస్‌ ఫ్యాన్స్‌కు నిరాశ మీద నిరాశ ఎదురవుతోంది. నిన్న సాయంత్రం విడుదల కావాల్సిన సలార్‌ సెకండ్‌ ట్రైలర్‌ ఈ రోజు ఉదయానికి వాయిదా పడ్డం  ఒక ఎత్తయితే. ఒకే రోజులో రెండు సార్లు ట్రైలర్‌ లాంచ్‌ వాయిదా పడ్డం మరో ఎత్తు. ఉదయం 10.42 నిమిషాలకు విడుదల కావాల్సిన ట్రైలర్‌ మధ్యాహ్నం 2 గంటల ప్రాంతానికి వాయిదా పడింది. మధ్యాహ్నం ట్రైలర్‌ చూసి సంతోషిద్దామనుకున్న ఫ్యాన్స్‌కు మళ్లీ ఎదురు దెబ్బ తగిలింది. 2 గంటలకు విడుదల కావాల్సిన ట్రైలర్‌ మళ్లీ వాయిదా పడింది.

దీంతో ఫ్యాన్స్‌ సలార్‌ టీంపై అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. సోషల్‌ మీడియా వేదికగా తీవ్ర స్థాయిలో ఫైర్‌ అవుతున్నారు. 2 గంటలకు వాయిదా పడ్డ సెకండ్‌ ట్రైలర్‌ మళ్లీ ఎప్పుడు విడుదల అవుతోందో క్లారిటీ లేదు. ఇది ప్రభాస్‌ ఫ్యాన్స్‌తో పాటు సగటు సినీ ప్రేక్షకుడ్ని ఆగ్రహానికి గురి చేస్తోంది. సినిమా విడుదలైన తర్వాత ట్రైలర్‌ విడుదల చేస్తారా? అంటూ తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. కాగా, డిసెంబర్‌ 1వ తేదీన సలార్‌ ఫస్ట్‌ ట్రైలర్‌ విడుదల అయింది. సోషల్‌ మీడియా ప్లాట్‌ ఫామ్‌ యూట్యూబ్‌లో రికార్డులు క్రియేట్‌ చేసింది.

తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ట్రైలర్‌ విడుదల అయింది. విడుదలైన 18 గంటల్లోనే 100 మిలియన్ల వ్యూస్‌ను సంపాదించింది. పాత రికార్డును తుడిచి పెట్టేసింది. కేజీఎఫ్‌ 2 సినిమా 24 గంటల్లో 100 మిలియన్ల వ్యూస్‌ సంపాదించగా.. సలార్‌ 18 గంటల్లోనే ఆ ఫీట్‌ను సాధించింది. ఇప్పటి వరకు 175 మిలియన్లకు పైగా వ్యూస్‌ను కొల్లగొట్టింది. కాగా, ప్రపంచ వ్యాప్తంగా సలార్‌ అడ్వాన్స్‌ బుకింగ్స్‌ మొదలయ్యాయి. దేశంలోని ముఖ్య నగరాలైన చెన్నై, బెంగళూరు, ముంబై లాంటి వాటిల్లో

బుక్‌ మై షో ద్వారా సలార్‌ టికెట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రీ బుకింగ్స్‌ విషయంలోనూ సలార్‌ రికార్డులు క్రియేట్‌ చేస్తోంది. ముఖ్యంగా ఓవర్‌సీస్‌లో 1 మిలియన్లకు పైగా బుకింగ్స్‌ను నమోదు చేసింది. అమెరికాలో అయితే సలార్‌ క్రేజ్‌ పీక్స్‌లో ఉంది. ప్రీ బుకింగ్స్‌లో పాత రికార్డులు గల్లంతయ్యాయి. అయితే, ప్రపంచ వ్యాప్తంగా రికార్డులు సృష్టిస్తున్న సలార్‌ ప్రీ బుకింగ్స్‌ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఓపెన్‌ కాలేదు. తెలుగు ఫ్యాన్స్‌కు ఈ విషయంలోనూ నిరాశ ఎదురవుతోంది.

సలార్‌ నిర్మాతలు తెలుగు రాష్ట్రాల్లో టికెట్ల పెంపు కోరుతూ రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు జీవో విడుదల కావాల్సి ఉంది. జీవో విడుదల అయిన తర్వాత తెలుగు రాష్ట్రాల్లో పెరిగిన టికెట్లతో ప్రీ బుకిం‍గ్స్‌ ఓపెన్‌ అయ్యే అవకాశం ఉంది. మరి, సలార్‌ సెకండ్‌ ట్రైలర్‌ వరుసగా వాయిదా పడుతూ రావటంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.