సలార్.. ప్రభాస్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో కేజీఎఫ్ ఫేమ్ హోంబలే ఫిలిమ్స్ వారు నిర్మించిన పాన్ ఇండియా మూవీ. ఈ పాటికి ప్రమోషన్స్ లో బిజీ అయిపోయి.. ముందే ప్రకటించినట్లుగా సెప్టెంబర్ 28న రిలీజ్ కావాల్సిన సినిమా. రాధేశ్యామ్, ఆదిపురుష్ లాంటి మూవీస్ తర్వాత ప్రభాస్ నుండి వస్తున్న మోస్ట్ అవైటెడ్ సాలిడ్ యాక్షన్ మూవీ. ప్రభాస్ ఈసారి సలార్ తో పాన్ ఇండియా చరిత్రలో కొత్త రికార్డులు తిరగరాస్తాడని అంతా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఫ్యాన్స్ లో అయితే ఎన్నో ఆశలు.. అంచనాలు.. కుంభస్థలం బద్దలు కొట్టేస్తాం అని గట్టిగా ఫిక్స్ అయిపోయారు. సోషల్ మీడియాలో మూడు నెలల ముందే రచ్చ కూడా మొదలు పెట్టేశారు.
కరెక్ట్ గా నెల రోజులు కూడా టైమ్ లేదు. సలార్ టీమ్ నుండి ఎలాంటి ఉలుకు పలుకు లేదు. టీజర్ వదిలి హైప్స్ రెట్టింపు చేసేశారు. మరి నెక్స్ట్ అప్డేట్ అయినా ఇవ్వాలిగా.. అదికూడా లేదు. టీజర్ విడుదలై నెల కావస్తుంది. అయినా.. సాంగ్, ట్రైలర్ డేట్ కూడా లేదు. ఇంకేముంది.. ఒక్కసారిగా ఇండస్ట్రీ వర్గాలలో సలార్ రిలీజ్ అవ్వట్లేదు.. వాయిదా అని ప్రచారం జోరుగా మొదలైంది. కట్ చేస్తే.. ఇవన్నీ రూమర్స్ అని కూడా కొట్టివేయలేదు సలార్ టీమ్. ఓహో.. ఈసారి మీడియాలో వినిపించింది వాస్తవమే అన్నమాట అనుకునే టైమ్. వచ్చిందని ఫ్యాన్స్ అనుకున్నారు. కొత్తగా అనుకోడానికి ఏముంది.. ఆల్రెడీ సలార్ రిలీజ్ డేట్ కి దాదాపు 10 సినిమాల వరకు షెడ్యూల్ మార్చుకుంటున్నాయి.
సలార్ ఒక్క వాయిదాతో.. దాదాపు 10 సినిమాలకు లైఫ్ వచ్చిందని అంటున్నాయి సినీ వర్గాలు. అసలు సలార్ వస్తుందని సలార్ కి ముందో వారం, తర్వాత రెండు వారాలు కనిపించకుండా డేట్స్ షెడ్యూల్ చేసుకున్న సినిమాలన్ని ఒక్కసారిగా యూటర్న్ తీసుకుంటున్నాయి. ఇప్పట్లో రావేమో అనుకున్న సినిమాలు కూడా సలార్ డేట్ ని లాక్ చేసుకుంటున్నాయి. తెలుగులో ఆల్రెడీ స్కంద, రూల్స్ రంజన్, మ్యాడ్, పెదకాపు లాంటి సినిమాలు సెప్టెంబర్ 28, 29 డేట్స్ లాక్ చేసుకున్నాయి. వీటితో పాటు మరికొన్ని మీడియం, చిన్న సినిమాలే కాకుండా డబ్బింగ్ మూవీస్ కూడా వస్తున్నాయని సమాచారం. అంటే.. సలార్ ఇంపాక్ట్ ఏ రేంజ్ లో ఉందో ఇట్టే అర్ధమవుతుంది. ఒక్క సినిమా వాయిదా.. దాదాపు ఇన్ని సినిమాలకు లైఫ్ అయ్యిందని చెప్పుకుంటున్నారు. మరి సలార్ వాయిదా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలపండి.