iDreamPost
android-app
ios-app

Salaar: ‘సలార్’కు భారీ ఓపెనింగ్స్.. ఈ రికార్డులను టచ్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు!

  • Published Dec 22, 2023 | 2:53 PM Updated Updated Dec 22, 2023 | 2:53 PM

‘సలార్’ మేనియాతో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవుతోంది. ప్రభాస్ మాస్ హీరోయిజమ్​కు థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ సరికొత్త రికార్డులను పెడుతోంది.

‘సలార్’ మేనియాతో ఇండియన్ బాక్సాఫీస్ షేక్ అవుతోంది. ప్రభాస్ మాస్ హీరోయిజమ్​కు థియేటర్లు దద్దరిల్లుతున్నాయి. సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ సరికొత్త రికార్డులను పెడుతోంది.

  • Published Dec 22, 2023 | 2:53 PMUpdated Dec 22, 2023 | 2:53 PM
Salaar: ‘సలార్’కు భారీ ఓపెనింగ్స్.. ఈ రికార్డులను టచ్ చేయడం ఎవరికీ సాధ్యం కాదు!

రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ‘సలార్’ మూవీకి బ్లాక్​బస్టర్ టాక్ వచ్చేసింది. అర్లీ మార్నింగ్ షోస్ నుంచి సూపర్ హిట్ టాక్ రావడంతో ప్రేక్షకులు థియేటర్లకు పోటెత్తుతున్నారు. ఆల్రెడీ బుక్​ మై షో లాంటి యాప్స్​తో పాటు బిగ్​స్క్రీన్స్​ వద్ద ముందే టికెట్లు అమ్మేశారు. అయినా ఒక్క టికెట్ దొరక్కపోదా అనే ఆశతో తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు ఫ్యాన్స్. అక్కడా, ఇక్కడా అనే తేడా లేకుండా విడుదలైన అన్ని చోట్లా ‘సలార్’కు ఆడియెన్స్​ నుంచి అదిరిపోయే రీతిలో రెస్పాన్స్ లభిస్తోంది. చాన్నాళ్ల తర్వాత ప్రభాస్​ను పూర్తిగా మాస్ అవతార్​లో చూపించడంతో ఆయన్ను సిల్వర్ స్క్రీన్ మీద చూసేందుకు అభిమానులతో పాటు ప్రేక్షకులూ తహతహలాడుతున్నారు. వారి అంచనాలకు తగ్గట్లుగా సినిమా ఉండటంతో బొమ్మ బ్లాక్ బస్టర్ అనే టాక్ వచ్చేసింది. దీంతో మూవీ ఓపెనింగ్ డే భారీ వసూళ్లను సాధించడం కన్ఫర్మ్ అయిపోయింది.

‘సలార్’కు ప్రేక్షకుల నుంచి వస్తున్న రెస్పాన్స్, టికెట్ బుకింగ్స్, మౌత్ పబ్లిసిటీ చూస్తుంటే ప్రభాస్-ప్రశాంత్ కాంబో బాక్సాఫీస్​ను చెల్లాచెదురు చేసేలా ఉంది. రిలీజ్​కు ముందున్న హైప్, బజ్​కు పాజిటివ్ టాక్ కూడా తోడైంది కాబట్టి ‘సలార్’ మూవీ సెన్సేషనల్ ఓపెనింగ్స్ రాబట్టడం గ్యారెంటీ. ట్రేడ్ వర్గాల నుంచి వస్తున్న ప్రెడిక్షన్ ప్రకారం.. ఈ ఫిల్మ్ మొదటి రోజు రూ.170 కోట్ల నుంచి రూ.180 కోట్ల వరకు కలెక్షన్స్ రాబట్టేలా ఉంది. ఇదే జరిగితే ఈ ఏడాది హయ్యెస్ట్ డే-1 కలెక్షన్స్ విషయంలో ప్రభాస్ కొత్త బెంచ్​మార్క్ సెట్ చేసినట్లే. తక్కువలో తక్కువ రూ.150 కోట్ల ఓపెనింగ్స్ రాబట్టినా ఈ ఇయర్ హయ్యెస్ట్ ఓపెనింగ్ గ్రాసర్​గా నిలుస్తుంది. 2023 ఓపెనింగ్ డే వసూళ్లలో దళపతి విజయ్ నటించిన ‘లియో’ రూ.148 కోట్లతో టాప్ ప్లేస్​లో ఉంది. రెండో స్థానంలో ప్రభాస్ యాక్ట్ చేసిన ‘ఆదిపురుష్’ (రూ.137 కోట్లు) చిత్రం ఉంది. నెక్స్ట్ పొజిషన్స్​లో ‘జవాన్’ (రూ.129 కోట్లు), ‘యానిమల్’ (రూ.115 కోట్లు), ‘పఠాన్’ (రూ.104 కోట్లు), ‘టైగర్ 3’ (రూ.94 కోట్లు), ‘జైలర్’ (రూ.91 కోట్లు) ఉన్నాయి.

‘లియో’ రాకముందు వరకు ఈ ఏడాది హయ్యెస్ట్ ఓపెనింగ్ డే కలెక్షన్స్ ‘ఆదిపురుష్’ పేరు మీదే ఉంది. ఆ లిస్టులో ఇప్పుడు ‘లియో’ టాప్​లో ఉంది. అయితే దాన్ని బ్రేక్ చేయాలంటే ‘సలార్’ రూ.150 కోట్లకు పైగా వసూలు చేయాలి. 99 శాతం ఆక్యుపెన్సీ మెయింటెయిన్ చేస్తున్న ప్రభాస్ కొత్త చిత్రం రూ.150 కోట్లు కలెక్ట్ చేయడం ఏమంత కష్టం కాకపోవచ్చు. సూపర్ హిట్ టాక్ వచ్చింది కాబట్టి నైట్ షోస్ మరింత ప్యాక్ అవ్వడం ఖాయం. థియేటర్ల వద్ద క్రేజ్, పాజిటివ్ టాక్ చూస్తుంటే ఈ రోజు ముగిసేసరికి ‘సలార్’ డే-1 రికార్డు క్రియేట్ చేసేలా ఉంది. అయితే ‘లియో’ను ఎంత మార్జిన్​తో ప్రభాస్ మూవీ బీట్ చేస్తుందనేది రేపే తెలుస్తుంది. అయితే ‘సలార్’ రికార్డును అధిగమించడం నెక్స్ట్ వచ్చే సినిమాలకు చాలా కష్టమని ట్రేడ్ అభిప్రాయపడుతోంది. మరి.. ‘సలార్’ సినిమా డే-1 కలెక్షన్స్​లో కొత్త రికార్డు పెడుతుందని మీరు భావిస్తే కామెంట్ చేయండి.

ఇదీ చదవండి: ‘సలార్‌’ ఓటీటీలోకి వచ్చేది ఎప్పుడు? ఎక్కడంటే..

Jojobet GirişJojobetHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetJojobetHoliganbetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetcasibomjojobetcasibom girişjojobet girişCasibombetciograndpashabet