iDreamPost
android-app
ios-app

త్వరలోనే ‘సలార్ 2’.. క్రేజీ న్యూస్ చెప్పేసిన వరద!

  • Published Mar 11, 2024 | 4:30 PM Updated Updated Mar 11, 2024 | 4:30 PM

‘సలార్’ బ్లాక్​బస్టర్ హిట్ కావడంతో ఈ మూవీ సీక్వెల్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం పార్ట్​-2 గురించి తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

‘సలార్’ బ్లాక్​బస్టర్ హిట్ కావడంతో ఈ మూవీ సీక్వెల్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ చిత్రం పార్ట్​-2 గురించి తాజాగా పృథ్వీరాజ్ సుకుమారన్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

  • Published Mar 11, 2024 | 4:30 PMUpdated Mar 11, 2024 | 4:30 PM
త్వరలోనే ‘సలార్ 2’.. క్రేజీ న్యూస్ చెప్పేసిన వరద!

వరుస పరాజయాలతో ఉక్కిరిబిక్కరి అవుతున్న పాన్ ఇండియా స్టార్ ప్రభాస్​కు గొప్ప ఊరటను ఇచ్చింది ‘సలార్’. ‘బాహుబలి 2’ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ లేక చాన్నాళ్లు ఇబ్బంది పడ్డారు డార్లింగ్. ‘సాహో’ నుంచి ‘ఆదిపురుష్’ వరకు ప్రతి చిత్రం ఆకాశామంత అంచనాలతో విడుదల అవడం, బాక్సాఫీస్ దగ్గర చతికిలపడటం తెలిసిందే. అయితే అవి ఫెయిలైనా ప్రభాస్ స్టామినా వల్ల వసూళ్లలో ఫర్వాలేదనిపించాయి. దీంతో ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలని చూస్తున్న ఆయనకు ‘సలార్’ రూపంలో బిగ్ రిలీఫ్ దొరికింది. కన్నడ స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కించిన ఈ మూవీ గతేడాది రిలీజై భారీ బ్లాక్​బస్టర్​గా నిలిచింది. ప్రభాస్​ను అభిమానులు చూడాలనుకునే విధంగా ఊరమాస్ అవతార్​లో చూపించాడు నీల్ మామ. దీంతో సినిమాను సూపర్​హిట్​ చేశారు ఫ్యాన్స్, ఆడియెన్స్. ఫస్ట్ పార్ట్​ గ్రాండ్​ సక్సెస్​ అవడంతో ‘సలార్ 2’ మీద ఎక్స్​పెక్టేషన్స్ భారీగా పెరిగిపోయాయి.

ప్రభాస్ ఇతర సినిమాలతో ఫుల్ బిజీగా ఉండటంతో ‘సలార్ 2’ ఇప్పట్లో లేనట్లేనని అంతా అనుకుంటున్నారు. ఈ తరుణంలో సీక్వెల్ మీద క్రేజీ అప్​డేట్ ఇచ్చారు పృథ్వీరాజ్ సుకుమారన్. ‘సలార్’లో వరదరాజ మన్నార్​ పాత్రలో తనదైన శైలిలో నటించి మంచి మార్కులు కొట్టేశారీ మలయాళ సూపర్​స్టార్. ప్రభాస్ స్నేహితుడిగా వరద క్యారెక్టర్​లో ఆయన ఒదిగిపోయిన తీరు, ఎక్స్​ప్రెషన్స్ పలికించిన తీరుకు అంతా ఫిదా అయ్యారు. అలాంటి పృథ్వీరాజ్ తాజాగా ‘సలార్’ సీక్వెల్ గురించి అప్​డేట్ ఇచ్చారు. త్వరలోనే సీక్వెట్ షూటింగ్ మొదలవుతుందంటూ అభిమానులకు గుడ్​న్యూస్ చెప్పారు. తాను, ప్రభాస్ మంచి ఫ్రెండ్స్ అన్నారు. తామిద్దరం ఎప్పుడూ ఒకరితో ఒకరం మాట్లాడుకుంటూ టచ్​లో ఉంటామని పృథ్వీరాజ్ తెలిపారు. ‘సలార్’ పార్ట్​-2 షూటింగ్ అతి త్వరలో ప్రారంభం కానుందని చెప్పుకొచ్చారు.

‘నేను ప్రభాస్ మంచి ఫ్రెండ్స్. మేం ఇద్దరమూ ఎప్పుడూ ఒకరితో ఒకరం మాట్లాడుకుంటూ టచ్​లో ఉంటాం. ‘సలార్ 2’ షూటింగ్ అతి త్వరలో మొదలుకానుంది’ అని పృథ్వీరాజ్ వ్యాఖ్యానించారు. ఇక, ‘సలార్’లో కీలక పాత్రలో యాక్ట్ చేసిన వెర్సటైల్ యాక్టర్ బాబీ సింహా కూడా పార్ట్-2 గురించి ఇంట్రెస్టింగ్​ అప్​డేట్ ఇచ్చారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ‘సలార్ 2’ స్టోరీ రెడీగా ఉందన్నారు. ఏప్రిల్​లో ఫిల్మ్ షూటింగ్​ స్టార్ట్ చేయాలని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. వచ్చే ఏడాది రిలీజ్​కు ప్లాన్ చేసినట్లు వివరించారు. అటు పృథ్వీరాజ్, ఇటు బాబీ సింహా మాటల్ని బట్టి ‘సలార్’ సీక్వెల్ వచ్చే నెలలో సెట్స్ మీదకు వెళ్లడం ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు. కాగా, పార్ట్​-2ను ‘శౌర్యాంగ పర్వం’ పేరుతో తెరకెక్కించనున్నారు. ఫస్ట్ పార్ట్​లో ప్రశ్నలుగా మిగిలిన వాటికి సీక్వెల్​లో సమాధానాలు ఇవ్వనున్నాడు నీల్ మామ. ఇక, ప్రభాస్ ‘కల్కి 2898 ఏడీ’తో పాటు ‘రాజా సాబ్’లో నటిస్తున్నారు. మరి.. ‘సలార్ 2’ కోసం మీరెంతగా ఎదురు చూస్తున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టిల్లు అన్న ఇట్టా అయితే ఎట్టా అన్న? జర హుషార్ ఉండాలే!

gamdomCasibomJojobet Girişmarsbahis girişJojobet GirişMarsbahisHoliganbetJojobet