iDreamPost
android-app
ios-app

టిల్లు అన్న ఇట్టా అయితే ఎట్టా అన్న? జర హుషార్ ఉండాలే!

Tillu Square Update: డీజే టిల్లుతో సిద్ధు జొన్నలగడ్డ కుర్రకారును ఉర్రూతలూగించాడు. ఇప్పుడు టిల్లు స్క్వేర్ తో అంతకు మించి అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి వస్తున్న వార్తలు ఫ్యాన్స్ ని కంగారు పెడుతున్నాయి.

Tillu Square Update: డీజే టిల్లుతో సిద్ధు జొన్నలగడ్డ కుర్రకారును ఉర్రూతలూగించాడు. ఇప్పుడు టిల్లు స్క్వేర్ తో అంతకు మించి అలరించేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పుడు ఈ మూవీకి సంబంధించి వస్తున్న వార్తలు ఫ్యాన్స్ ని కంగారు పెడుతున్నాయి.

టిల్లు అన్న ఇట్టా అయితే ఎట్టా అన్న? జర హుషార్ ఉండాలే!

సిద్ధూ జొన్నలగడ్డ.. ఈ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఇండస్ట్రీలో తమని తామే లేపుకున్న హీరోల్లో సిద్ధూ కూడా ఒకడు. మంచి కథ రాకపోతే తన కథ తానే రాసేసుకుంటాడు. ఈ యంగ్ హీరో డీజే టిల్లు మూవీతో సృష్టించిన విధ్వసం అంతా ఇంతా కాదు. కుర్రాళ్లంతా టిల్లు లెక్కనే బట్టలేసుకోవడం, డైలాగులు చెప్పడం చేస్తూ అబ్బో పిచ్చెక్కిపోయారు. మరి.. అంతటి హైప్ ఉన్న ఈ సినిమాకి సీక్వెల్ రావడానికి కాస్త ఆలస్యమే అయ్యింది. ఇప్పుడు ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. అయితే చెప్పిన రిలీజ్ డేట్ కి టిల్లు స్క్వేర్ థియేటర్లలోకి వస్తుందా? అనే అనుమానాలు ఎక్కువగా వినిపిస్తున్నాయి.

డీజే టిల్లు అంత సక్సెస్ అయినా కూడా దానికి సీక్వెల్ రావడానికి మాత్రం కాస్త లేట్ అయ్యింది. కారణాలు ఏవైనా లేట్ చేసినందుకు ఈ స్టార్ బాయ్ సిద్ధు అభిమానులకు సారీ కూడా చెప్పాడు. ఈ మార్చి 29న మాత్రం తప్పకుండా వచ్చేస్తున్నాం అని చెప్పాడు. ఇప్పుడు వినిపిస్తున్న వార్తలను బట్టి చూస్తే మాత్రం టిల్లు వచ్చుడు అంత గ్యారెంటీగా చెప్పలేం అనే పరిస్థితి కనిపిస్తోంది. అందుకు కారణం లేకపోలేదు. అదేంటంటే.. టిల్లు స్క్వేర్ సినిమాకి ఇంకా ప్యాచ్ వర్క్ జరుగుతోంది అంటున్నారు. క్లయిమ్యాక్స్ కి సంబంధించి షూటింగ్ జరగాల్సి ఉందంట. అది మార్చి 12 నుంచి కాకినాడలో షూట్ చేస్తున్నట్లు చెప్తున్నారు. కాకినాడలో 12 నుంచి ఆరు రోజులపాటు ఈ షూట్ జరుగుతుందంట.

అంటే మార్చి 17వ తారీఖు వరకు ఆఖరి షెడ్యూల్ షూట్ నడుస్తుంది. అంటే అప్పుడు కేవలం 12 రోజుల్లో రిలీజ్ ఉంటుంది. ఆ షార్ట్ పిరియడ్ లో పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ అవుతుందా? అనే అనుమానులు కలుగుతున్నాయి. అంతేకాకుండా అంత తక్కువ సమయంలో హడావుడిగా పనిచేస్తే క్వాలిటీ దెబ్బతినదా? అంటూ ప్రశ్నిస్తున్నారు. అంత డెడ్ లైన్ పెట్టుకుని ఎందుకు పని చేస్తున్నారు అంటూ సిద్ధు ఫ్యాన్స్ కూడా కంగారు పడుతున్నారు. అయితే మేకర్స్ మాత్రం టిల్లు స్క్వేర్ సినిమా విషయంలో మాత్రం చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నారు. ఈ మూవీ సిద్ధు లైఫ్ లో బెస్ట్ ప్లేస్ లో ఉంటుంది అంటున్నారు. ఆఖరి షెడ్యూల్ పెద్ద షూటింగ్ ఏం కాదని.. జస్ట్ ప్యాచ్ వర్క్ అంటున్నారు. కాబట్టి పెద్దగా భయపడాల్సిన అవసరం ఉండదు. చెప్పిన టైమ్ కే టిల్లు వచ్చేస్తాడు అని నమ్మకంగా ఉన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Siddhu Jonnalagadda (@siddu_buoy)

ఇంక సినిమా విషయానికి వస్తే.. ఈ మూవీలో కూడా రాధికా ఉంటుంది అంటున్నారు. ఫస్ట్ పార్ట్ ని గుర్తు చేస్తూ రాధికా రిఫరెన్సులు చూపించడమే కాకుండా.. ఆమెతో టిల్లుకి 15 నిమిషాల హిలేరియస్ సీక్వెన్స్ ప్లాన్ చేశారంట. అలాగే అనుపమ కూడా బోల్డ్ క్యారెక్టర్ లో ఇరగదీసింది. ఏ విధంగా చూసుకున్నా కూడా టిల్లు స్క్వేర్ డబుల్ ధమాకా సాధిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇంక ఈ మూవీకి ఓటీటీ డిమాండ్ కూడా ఓ రేంజ్ లో ఉంది. ఇప్పటికే టిల్లు స్క్వేర్ ఓటీటీ రైట్స్ రూ.35 కోట్లకు అమ్మడుపోయాయి అంటున్నారు. మొత్తానికి ఈసారి కూడా టిల్లు గట్టిగానే కొట్టబోతున్నాడు అంటున్నారు. మరి.. టిల్లు స్క్వేర్ ఇంకా షూటింగ్ దశలోనే ఉంది అంటూ వస్తున్న వార్తలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetCasibomCasibomGrandpashabetcasibomgrandpashabetmeritbet girişgrandpashabetjojobet girişcasibom girişgrandpashabetgrandpashabet girişgrandpashabetjojobet girişdeneme bonusu