iDreamPost
android-app
ios-app

ప్రశాంత్ నీల్ లైనప్ పై రూమర్స్.. ఆ ప్రాజెక్ట్ నిజం కాదట!

  • Published Jul 25, 2024 | 1:07 PM Updated Updated Jul 25, 2024 | 1:07 PM

Prasanth Neel Upcoming Projects: ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న దర్శకులలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ప్రశాంత్ నీల్. కెజిఎఫ్ తో ఈ దర్శకుడి స్థాయి మారిపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు అందరి ఫోకస్ ప్రశాంత్ నీల్ నెక్ట్ ప్రాజెక్ట్స్ మీదకు మళ్లింది. దానికి సంబంధించిన అప్ డేట్స్ చూసేద్దాం.

Prasanth Neel Upcoming Projects: ఇండస్ట్రీలో ప్రస్తుతం ఉన్న దర్శకులలో ఎక్కువగా వినిపిస్తున్న పేరు ప్రశాంత్ నీల్. కెజిఎఫ్ తో ఈ దర్శకుడి స్థాయి మారిపోయింది. ఈ క్రమంలో ఇప్పుడు అందరి ఫోకస్ ప్రశాంత్ నీల్ నెక్ట్ ప్రాజెక్ట్స్ మీదకు మళ్లింది. దానికి సంబంధించిన అప్ డేట్స్ చూసేద్దాం.

  • Published Jul 25, 2024 | 1:07 PMUpdated Jul 25, 2024 | 1:07 PM
ప్రశాంత్ నీల్ లైనప్ పై రూమర్స్.. ఆ ప్రాజెక్ట్ నిజం కాదట!

కెజిఎఫ్ , సలార్ లాంటి సినిమాలతో ఇండస్ట్రీలో ప్రశాంత్ నీల్ పేరు మోత మోగిపోయింది. యష్ హీరోగా నటించిన కెజిఎఫ్ మూవీ ఏ రేంజ్ లో హిట్ టాక్ సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక కెజిఎఫ్ 2 కు అయితే ఏకంగా బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ షేక్ చేసేలా.. 1200 కోట్లకు పైగా కలెక్షన్స్ వచ్చాయి. దాని తర్వాత ప్రభాస్ నటించిన సలార్.. ఈ సినిమా రిలీజ్ అయినా సమయంలో ఎక్కడ చూసిన ప్రశాంత్ గురించే టాక్ వినిపించేది. ప్రభాస్ అభిమానుల ఆరేళ్ల ఆకలిని తీర్చిన దర్శకుడు ప్రశాంత్ నీల్. ఇక సలార్ సినిమాకు సిక్వెల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇటీవల ప్రభాస్ కల్కి మూవీ కూడా రిలీజ్ అయ్యి సక్సెస్ సాధించడంతో.. ఇప్పడు అందరి ఫోకస్ మళ్ళీ ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్స్ వైపు మళ్లింది. దానికి సంబంధించిన అప్ డేట్స్ ఇలా ఉన్నాయి.

ప్రస్తుతం ప్రశాంత్ నీల్ చేతిలో రెండు బడా హీరోల భారీ బడ్జెట్ సినిమాలు ఉన్నాయి. కానీ ఈ రెండిటి గురించి కూడా ఇంతవరకు ఎలాంటి అప్ డేట్స్ రాలేదు. ఒకటి ప్రభాస్ సలార్ కు సిక్వెల్ గా.. శౌర్యంగ పర్వం చిత్రం , రెండు ఎన్టీఆర్ హీరోగా డ్రాగన్ మూవీ. ఈ రెండు ప్రాజెక్ట్స్ మీద ఇప్పుడు ప్రేక్షకులు భారీగా అంచనాలను పెంచేసుకున్నారు. ఈ సినిమాలలో దేనిని ముందు స్టార్ట్ చేస్తారు.. ఎప్పుడు స్టార్ట్ చేస్తారు.. అనే సమాచారం అయితే ప్రశాంత్ నుంచి లేదు. కానీ.. ఎన్టీఆర్ మూవీ షూటింగ్ మాత్రం మరొక రెండు నెలల్లో స్టార్ట్ అవుతుందని.. ఇన్సైడ్ ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తుంది. అలాగే దానితో పాటు సలార్ 2 మూవీ షూటింగ్ కూడా ఈ ఏడాది ఆఖరిలోనే స్టార్ట్ అవుతుందని సమాచారం. ఈ రెండిటిని ఒకేసారి టెక్ అప్ చేస్తారా.. లేదా ఒక దాని తర్వాత మరొకటి చేస్తారా అనే విషయాలపై అయితే ఇప్పటికి ఇంకా ఎలాంటి క్లారిటీ లేదు.

ప్రస్తుతానికైతే ప్రభాస్ వరుస సినిమాలతో సక్సెస్ ట్రాక్ లోనే నడుస్తూ ఉన్నాడు. అటు తారక్ కూడా వరుస మూవీ రిలీజెస్ తో బాక్స్ ఆఫీస్ దగ్గర యుద్దానికి సిద్ధంగా ఉన్నాడు. వీటి తర్వాత.. వెంటనే ప్రశాంత్ ప్రాజెక్ట్స్ కనుక స్టార్ట్ అయితే.. ఇదే ఊపు కనుక కొనసాగితే.. ప్రభాస్ , ఎన్టీఆర్ మూవీస్ లో ఏ మూవీ ముందు స్టార్ట్ చేసినా కానీ.. బాక్స్ ఆఫీస్ రికార్డ్స్ బ్రేక్ చేయడం ఖాయం అని చెప్పి తీరాల్సిందే. అయితే ఈ రెండు మూవీస్ కాకుండా కెజిఎఫ్ పార్ట్ 3 గురించి.. ప్రశాంత్ , అజిత్ ల మధ్య డిస్కషన్ జరిగిందంటూ కొన్ని వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ నిజం కాదట. పార్ట్ 3 లో కూడా యష్ ఏ నటించబోతున్నాడు. అయితే ప్రభాస్ , తారక్ సినిమాల తర్వాత.. యష్ మూవీ ఉండే అవకాశం ఉంది. సో ప్రస్తుతానికి ప్రశాంత్ నీల్ చేతిలో భారీ ప్రాజెక్ట్స్ ఏ ఉన్నాయి. ఏమౌతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet Girişmeritbet girişcasibomcasino siteleriDeneme Bonusu Veren SitelerDeneme Bonusu Veren SitelerbetparkGrandpashabetgrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetGrandpashabetcasibomgrandpashabetmeritbet girişjojobet girişgrandpashabetgrandpashabet girişjojobet girişdeneme bonusuMadridbetMadridbetJojobetJojobetgrandpashabet girişholiganbetgrandpashabet