Nagendra Kumar
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్రిపుల్ ఆర్ సినిమా టిక్కెట్లు ఇప్పుడు అమ్ముడుపోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అది తెలియాలంటే పూర్తి వివరాల కోసం ఈ వార్తను పూర్తిగా చదివేయండి...
ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ట్రిపుల్ ఆర్ సినిమా టిక్కెట్లు ఇప్పుడు అమ్ముడుపోవడం ఏంటని ఆశ్చర్యపోతున్నారా? అది తెలియాలంటే పూర్తి వివరాల కోసం ఈ వార్తను పూర్తిగా చదివేయండి...
Nagendra Kumar
త్రిబుల్ ఆర్ దెబ్బ ప్రపంచం మీద మామూలుగా తగల్లేదు. కరోనా నుంచి ప్రపంచం తప్పించుకున్నా, త్రిబుల్ ఆర్ దాడి నుంచి మాత్రం ప్రపంచదేశాలు తప్పించుకోలేకపోతున్నాయి. దానికి అత్యంత ఆధునాతనమైన, సాంకేతికంగా ఎంతో ముందంజలో ఉన్న జపాన్ దేశమే ప్రత్యక్ష నిదర్శనం. మార్చి 18న జపాన్ దేశంలో త్రిబుల్ ఆర్ స్పెషల్ షో జరగబోతోంది. దానికి త్రిబుల్ ఆర్‌తో గ్లోబ్‌ని షేక్ చేసిపారేసిన దర్శకుడు రాజమౌళి హాజరు కాబోతున్నారు. అయితే ఇంతకు ముందు కూడా జపాన్‌లో త్రిబుల్ ఆర్ ఆడింది. కానీ మళ్ళీ వేస్తున్న స్పెషల్ షోకి కూడా కౌంటర్లు ఇలా ఓపెన్ చేశారో లేదో క్షణాల మీద టిక్కెట్లు ఖతం అయ్యాయి. వేలం వెర్రిగా కొనేసుకున్నారు జపాన్ పబ్లిక్. నిన్ననే.. అంటే మార్చి 13వ తేదీనాడే బుకింగ్ ఓపెన్ చేశారు.
జపాన్ నలుమూలల నుంచి ఈ షో కోసం ఎగబడ్డారు. జపాన్ మొత్తం త్రిబుల్ ఆర్ వేవ్స్‌లో పడి కొట్టుకుపోతోంది. అక్టోబర్ 2022లో కూడా త్రిబుల్ ఆర్ టీం.. రాజమౌళి, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ అండ్ పార్టనర్స్ ప్రమోషన్ నిమిత్తం జపాన్ వెళ్ళారు. కానీ అప్పటికీ కరోనా ప్రతిబంధకాలు ముమ్మరంగా నడుస్తున్నాయి. ఇప్పుడు అన్ని దేశాలలో లాగే జపాన్‌లో కూడా ఈ నిబంధనలను ఎత్తేశారు. త్రిబుల్ ఆర్ షోని జపాన్‌లో షింజుకు వాల్డ్ 9 థియేటర్లోనూ, షింజుకు పిక్కడిల్లాలోనూ ప్రదర్శించబోతున్నారు. షోకి హాజరవుతున్న దర్శకధీరుడు రాజమౌళి షోలో పాల్గొనడంతో పాటు, అక్కడి ఫ్యాన్స్‌తో కూడా ఇంటరాక్ట్ కాబోతున్నారని త్రిబుల్ ఆర్ టీం ఎక్స్ హ్యాండిల్ ద్వారా పోస్ట్ పెట్టింది.
అక్కడి ఫ్యాన్స్ అడిగే బహుశా ప్రశ్నలలో త్రిబుల్ ఆర్ సీక్వెల్ ఎప్పుడన్నది కూడా ఉండొచ్చు. ఎందుకంటే త్రిబుల్ ఆర్ రచయిత, రాజమౌళి ఫాదర్ విజయేంద్ర ప్రసాద్ త్రిబుల్ ఆర్ సీక్వెల్ వర్క్ ఆన్ది వే అని గతంలో చెప్పడం జరిగింది. అది ప్రపంచవ్యాప్తంగా అందరిలోనూ నాటుకుని ఉంది. త్రిబుల్ ఆర్ సినిమాతో మెస్మరైజ్ అయిపోయిన ప్రపంచ ప్రేక్షకులు ఇప్పుడు ఈ వండర్ పార్ట్ 2 గురించి తాపత్రయపడడం నేచురల్. ఇలా త్రిబుల్ ఆర్ సంచలనం ధారావాహికంగా కొనసాగుతుంటే మన తెలుగు స్టార్స్ పలుకుబడికి కొదవేముంటుంది? అందుకే బాలీవుడ్ అసూయలో పడి మగ్గిపోతోంది.