iDreamPost
android-app
ios-app

SS Rajamouli: SSMB29.. రాజమౌళి సరికొత్త వ్యూహం! గత చిత్రాలకు భిన్నంగా..

  • Published Sep 20, 2024 | 6:07 PM Updated Updated Sep 20, 2024 | 6:07 PM

SS Rajamouli new strategy for SSMB29: SSMB29 మూవీ కోసం ఇప్పటి వరకు తన చిత్రాలకు చేయని విధంగా సరికొత్త వ్యూహంతో రాజమౌళి రాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇంతకీ మహేశ్ సినిమాకు జక్కన్న అనుసరించబోయే వ్యూహం ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

SS Rajamouli new strategy for SSMB29: SSMB29 మూవీ కోసం ఇప్పటి వరకు తన చిత్రాలకు చేయని విధంగా సరికొత్త వ్యూహంతో రాజమౌళి రాబోతున్నట్లు తెలుస్తోంది. మరి ఇంతకీ మహేశ్ సినిమాకు జక్కన్న అనుసరించబోయే వ్యూహం ఏంటి? ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

  • Published Sep 20, 2024 | 6:07 PMUpdated Sep 20, 2024 | 6:07 PM
SS Rajamouli: SSMB29.. రాజమౌళి సరికొత్త వ్యూహం! గత చిత్రాలకు భిన్నంగా..

సినిమా.. సినిమాకు డైరెక్టర్లు కొత్త కొత్త ప్లాన్స్ తో ముందుకు వెళ్తూ ఉంటారు. గత మూవీస్ షూటింగ్స్ లో ఎదురైన అనుభవాలను దృష్టిలో పెట్టుకుని వచ్చే సినిమాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ప్రస్తుతం అదే పనిలో ఉన్నాడు టాలీవుడ్ దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి. అవును సూపర్ స్టార్ మహేశ్ బాబుతో తెరకెక్కించబోయే SSMB29 మూవీ విషయంలో ఇంతకు ముందులా కాకుండా.. సరికొత్త వ్యూహంతో రాబోతున్నట్లు తెలుస్తోంది. జక్కన్న తీసుకున్న ఈ నిర్ణయానికి ఫ్యాన్స్ సైతం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరి ఇంతకీ మహేశ్ సినిమాకు జక్కన్న అనుసరించబోయే వ్యూహం ఏంటి?

SSMB29.. మహేశ్ బాబు-రాజామౌళి కాంబినేషన్ లో రాబోతున్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు ఇప్పటి నుంచే ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ స్పీడ్ గా జరుగుతోంది. వచ్చే సంవత్సరం జనవరిలో రెగ్యూలర్ షూటింగ్ ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ సినిమా కోసం జక్కన్న ఇంతకు ముందు తన మూవీస్ కు అనుకరించిన విధంగా కాకుండా.. సరికొత్త వ్యూహంతో ముందుకెళ్లాలని భావిస్తున్నాడట. అదేంటంటే? సాధారణంగా జక్కన్న మూవీస్ కు వీఎఫ్ఎక్స్ వర్క్ ఎక్కువగా ఉంటుంది. దాంతో దానికే ఎక్కువ టైమ్ అయిపోతుంది. ఈ సమస్యను అధిగమించడానికి రాజమౌళి మాస్టర్ ప్లాన్ వేశాడట. ముందుగానే వీఎఫ్ఎక్స్ కు సంబంధించి షాట్స్ ను షూట్ చేయాలని భావిస్తున్నాడట.

ఇక అందుకు తగ్గట్లుగానే జక్కన్న ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను స్టార్ట్ చేశాడని టాక్. ఈ మూవీలో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉంటుందని, దాంతో దానికే ఎక్కువ టైమ్ అయిపోతుందని భావించి.. ముందు ఆ సీన్స్ ను షూట్ చేసి, సదరు వీఎఫ్ఎక్స్ కంపెనీలకు అప్పగిస్తే.. వాళ్ల పని వాళ్లు చేసుకుని షూటింగ్ పూర్తి అయ్యే టైమ్ కు వాటిని పూర్తి చేసి ఇవ్వడం ఖాయం. ఈ టైమ్ లో మిగతా షూటింగ్ పూర్తి చేసుకుంటే.. టైమ్ ఆదా అవుతుంది. ఇప్పుడు ఇదే వ్యూహంతో జక్కన్న వెళ్తున్నట్లు తెలుస్తోంది. దాంతో 2025 లో షూటింగ్ స్టార్ట్ చేసినా.. 2026లో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇక ముందే వీఎఫ్ఎక్స్ పనులు పూర్తి చేయాలనే జక్కన్న మాస్టర్ ప్లాన్ కు ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు.

కాగా.. ఇప్పటికే సూపర్ స్టార్ మహేశ్ ఈ సినిమా కోసం పూర్తిగా మారిపోయాడు. లాంగ్ హెయిర్, గుబురు గడ్డం, మీసకట్టుతో సూపర్ స్టార్ లేటెస్ట్ లుక్ వైరల్ గా మారిన సంగతి తెలిసిందే. రూ. 500 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను కేఎల్ నారాయణ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. అమెజాన్ అడవుల్లో సాగే అడ్వెంచరస్ యాక్షన్ డ్రామాగా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ప్రస్తుతం నటీ, నటులను ఎంపిక చేసే పనిలో ఉన్నారు మేకర్స్. మరి గత చిత్రాలకు భిన్నంగా జక్కన్న సరికొత్త వ్యూహంతో ముందుకు వెళ్లడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Jojobet GirişHoliganbetHoliganbetGrandpashabetGrandpashabetjojobetgrandpashabetcasibomiptv satın aljojobetcasibomcasibomGrandpashabetjojobetcasibom girişCasibomgrandpashabet